Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ICC World Cup 2023: అమితాబ్ కు బీసీసీఐ గోల్డెన్ టికెట్ - స్వయంగా జైషా కలిసి..!!

ఐసీసీ 2023 ప్రపంచ కప్ పండుగకు సమయం సమీపిస్తోంది. ఉపఖండంలో జరిగే క్రికెట్ సమరానికి జట్లు..ఆటగాళ్లతో కోట్లాది మంది అభిమానులు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో బీసీసీఐ వరుస నిర్ణయా లతో ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పెంచుతోంది. క్రికెట్ అంటే సినీ స్టార్స్ కు అభిమానం పీక్ లో కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆటగాళ్లు..సినీస్టార్స్ ఒకే గ్రౌండ్ లో ఉంటే ఆ మజానే వేరు. ఇప్పుడు తాజాగా ఆ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.

దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫీవర్:ప్రపంచ కప్ క్రికెట్ సమరానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అన్ని మ్యాచ్ లు ఎలా ఉన్నా..అక్టోబర్ 14న జరిగే దాయాది సమరానికి ఉన్న ప్రత్యేకతే వేరు. టికెట్ల ధర ఎంత అయినా పర్వాలేదు అన్నట్లుగా విక్రయాలు జరిగాయి. ఇక, ఇప్పుడు ఈ సారి ప్రపంచ కప్ సమరం వేళ బీసీసీఐ ప్రత్యేక నిర్ణయాలు అమలు చేస్తోంది. లెజెండరీ క్రికెటర్లతో పాటుగా సినీ సెలబ్రటీలను ప్రపంచ కప్ కు ఆహ్వానిస్తూ మరింత ఆసక్తిని పెంచుతోంది. అందులో భాగంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా కలిసారు.

BCCI secretary Jayshah presents Amitabh Bachchan with Golden Ticket for ICC World Cup 2023

అమితాబ్ ను కలిసిన జైషా:క్రికెట్ కు అమితాబ్ బచ్చన్ వీరాభిమాని. 2011 లో భారత్ క్రికెట్ కప్ గెలిచిన సమయంలో బిగ్ బీ తన ఫ్యామిలీ తో చేసిన సందడి ఫ్యాన్స్ కు గుర్తుండిపోతుంది. బిగ్ బీ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్ ను తప్పకుండా ఫాలో అవుతారు. భారత్ క్రికెట్ కు ప్రతీ సందర్భంలోనూ అమితాబ్ అండగా నిలిచారు.

తన మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి ప్రపంచకప్ వేళ బీసీసీఐ కార్యదర్శి జైషా నేరుగా అమితాబ్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. బీసీసీఐ తరపున ప్రత్యేకంగా గౌరవించారు. బీసీసీఐ నుంచి వరల్డ్ కప్-2023 గోల్డెన్ టికెట్ అందచేసారు. దీని పైన బీసీసీఐ అధికారికంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

అమితాబ్ కు గోల్డెన్ టికెట్:"మన గోల్డెన్ ఐకాన్ కు గోల్డెన్ టికెట్ ఇస్తున్నాం. ఈ శతాబ్దపు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ అందించే భాగ్యాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా దక్కించుకున్నారు. లెజెండరీ నటుడు, క్రికెట్ కు వీరాభిమాని అయిన అమితాబ్ బచ్చన్ టీమిండియాకు అందించే అచంచల మద్దతు ఇకపైనా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తున్నాం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో అమితాబ్ కూడా పాలుపంచుకుంటుండడం పట్ల ఉద్విగ్నతకు లోనవుతున్నాం" అంటూ బీసీసీఐ పేర్కింది. ఈ గోల్డెన్ టికెట్ ద్వారా అందుకు ప్రముఖులు ప్రపంచ కప్ లో ఏ మ్యాచ్ అయినా వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ అటు సినీ..ఇటు క్రికెట్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+