పెళ్లి చేసుకుంటానని ఫ్రెండ్స్ తో కలిసి గర్ల్ ఫ్రెండ్ మీద గ్యాంగ్ రేప్, వీడియోలు తీసి!
బెంగళూరు/అసోం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి అస్సోం నుంచి బెంగుళూరుకు తీసుకొచ్చిన యువతిపై ఆమె ప్రేమికుడు అతని నలుగురు స్నేహితులతో కలిసి ఓ గదిలో నిర్బందించి ఆమె మీద కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని బెంగళూరు నగరంలోని పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
అసోంకు చెందిన 20 ఏళ్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె ప్రియుడు షాహిద్ ఉద్దీన్, అతని నలుగురు స్నేహితులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని పరప్పన అగ్రహార పోలీసులు తెలిపారు.

అసోం చెందిన బాధితురాలు, నిందితుడు షాహీద్ గత సంవత్సరం అసోంలోని ఓ పార్క్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. తరువాత షాహిద్ ఆ యువతి వారి మొబైల్ నంబర్‌లు మార్చుకున్నారు. తర్వాత ఆ యువతిని షాహిద్ ప్రేమించడం మొదలుపెట్టాడు. నిందితుడు షాహీద్ గత జూన్‌లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి అసోం నుంచి బాధితురాలిని బెంగళూరుకు తీసుకొచ్చాడు.
బాధితురాలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా దొడ్డ నాగమంగళలోని ఓ అద్దె ఇంట్లో బాధితురాలిని ఉంచి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ దృశ్యాలను షాహిద్ అతని మొబైల్‌లో సీక్రేట్ గా చిత్రీకరించాడు. కొద్దిరోజుల తర్వాత షాహిద్‌కి మరో యువతితో వివాహమైనట్లు బాధితురాలికి తెలిసింది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ అసోం యువతి ప్రశ్నించగా నిందితుడు షాహిద్ ఆమెను బెల్టుతో కొట్టి ఆ ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. అనంతరం నలుగురు స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిన షాహిద్ బాధితురాలి మీద సామూహిక అత్యాచారం చేశారని తెలిసింది.
తనను వదిలేయాలని తాను ఎంత వేడుకున్నా షాహిద్ తో పాటు అతని ఫ్రెండ్స్ పట్టించుకోకుండా తన మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో వివరించింది. నిందితుడు షాహీద్ బాధితురాలిని వ్యభిచార రొంపిలోకి దించాలనే ఉద్దేశ్యంతో ప్రేమ పేరుతో డ్రామాలు ఆడి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అసోం నుంచి బెంగళూరు తీసుకొచ్చాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications