Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

hospital: ఫేమస్ ఆసుపత్రి, ఎర్రతోలు లేడీ తెల్ల కోటు వేసుకుని వెళ్లి ?, నేను లేడీస్ డాక్టర్, 10 నిమిషాల్లో!

బెంగళూరు: ఐటీ హబ్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఆ ఆసుపత్రి ఒకటి. వైట్ కోట్ వేసుకున్న ఎర్రతోలు లేడీ ఆసుపత్రిలో ఇన్ పేషంట్స్ ఉన్న గది దగ్గరకు వెళ్లింది. నేను డాక్టర్, మీ అమ్మగారి ప్రైవేట్ పార్ట్స్ పరీక్షించాలని, మీరు లోపలికి రాకూడదు, ఇక్కడే ఉండాలని అక్కడ ఉన్న పేషంట్ కొడుక్కి చెప్పింది. వెంటనే రూమ్ లోకి వెళ్లి తరువాత బయటకు వచ్చింది. కొంతసేపు మీ అమ్మగారిని డిస్టబ్ చెయ్యకండి అని చెప్పి పక్కన ఉన్న మరో గదిలోకి వెళ్లింది. అక్కడ పేషంట్ బంధువుల దగ్గర సేమ్ డైలాగ్ చేప్పిన లేడీ లోపలికి వెళ్లి వచ్చింది. కొంతసేపటి తరువాత ఇద్దరు పేషంట్లు, వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

నకిలీ లేడీ డాక్టర్

నకిలీ లేడీ డాక్టర్

బెంగళూరులోని సెయింట్ ఫిలోమినా ఆసుపత్రిలో జనవరి 14వ తేదీన విచిత్రమైన సంఘటర జరిగింది. కోమల (58), సరస (72) అనే రోగులు వాళ్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే నగలు పోగొట్టుకున్నారు. ఈ విషయమై టీసీ పాళ్యకు చెందిన రమేష్‌కుమార్‌ కేసు పెట్టడంతో బెంగళూరు పోలీసులు గుర్తు తెలియని నకిలీ డాక్టర్ కోసం గాలిస్తున్నారు.

బెంగళూరులో ఫేమస్ ఆసుపత్రి

బెంగళూరులో ఫేమస్ ఆసుపత్రి

రమేష్ కుమార్ అనే వ్యక్తి తల్లి సరసను జనవరి 12వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి తీసుకొచ్చి ఇన్ పేషెంట్ గా చికిత్స చెయ్యాలని మనవి చేశారు. జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తెల్లకోటు వేసుకున్న సుమారు 35 ఏళ్ల మహిళ ఆసుపత్రిలోని ఇన్ పేషంట్ వార్డుకు వెళ్లింది.

రమేష్ కుమార్ దగ్గరకు వెళ్లిన కిలాడీ లేడీ నేను డాక్టర్‌ని, మీ అమ్మగారి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేయాలి, పెద్ద డాక్టర్లకు రిపోర్టు ఇవ్వాలి, నువ్వు కాసేపు బయట ఉండు అని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన రమేష్ కుమార్ వార్డు నుంచి బయటకు వెళ్లాడు.

నిమిషాల్లో బయటకు వచ్చేసింది

నిమిషాల్లో బయటకు వచ్చేసింది

పది నిముషాల తర్వాత డాక్టర్‌గా నటిస్తున్న కిలాడీ లేడీ వార్డులో నుంచి బయటకు వచ్చింది. మీ అమ్మను డిస్టర్బ్ చేయకు. ఆమె నిద్రపోతున్నది, ఆమెకు కొంతసేపు విశ్రాంతి అవసరం, ఆమెకు వయసు అయ్యింది, ఇలాంటి ఆరోగ్య సమస్యలు మామూలే అని సినిమా డైలాగ్ లు చెప్పింది.

నకిలీ డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిన ఇరవై నిమిషాల తరువాత ఓ నర్సు వచ్చి మీ అమ్మగారికి బ్లడ్ టెస్ట్ చెయ్యాలని రమేష్ కుమార్ కు చెప్పింది. ఇప్పుడే డాక్టర్‌ వచ్చి చూసి వెళ్లారు, అంతలోనే బ్లడ్ టెస్ట్ ఎందుకు అని ప్రశ్నించాడు. ఏడాక్టర్ వచ్చారు, ఎవరిని చూశారు అని నర్సు రమేష్ కుమార్ ను ప్రశ్నించింది.

బంగారు చైన్లు, ఉంగరం మాయం

బంగారు చైన్లు, ఉంగరం మాయం

ఇంతలో రమేష్ కుమార్ కు అతని తల్లి సరస ఫోన్ చేసి తన చేతికి ఉన్న ఉంగరం, మెడలో ఉన్న 41 గ్రాముల బంగారు గొలుసు మాయమైయ్యిందని చెప్పింది. విషయం తెలుసుకున్న రమేష్ కుమార్ హడలిపోయాడు. సరస రూమ్ లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నకిలీ లేడీ డాక్టర్ పక్క వార్డులో ఉన్న 58 ఏళ్ల కోమల వద్దకు వెళ్లి సేమ్ టూ సేమ్ లేడీ డాక్టర్ గా నటించింది.

కోమలను చెక్ చేస్తానని చెప్పి కొడుకు రాజును బయటకు పంపించింది. ఐదు నిమిషాల్లో వార్డు నుంచి బయటకు వచ్చి మీ అమ్మను 45 నిమిషాలు డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఆసుపత్రిలో నుంచి బయటకు వెళ్లిపోయింది.

నిమిషాల్లోనే మొత్తం సినిమా చూపించింది

నిమిషాల్లోనే మొత్తం సినిమా చూపించింది

కొంతసేపటి తరువాత రాజు అతని తల్లి కోమల వద్దకు వెళ్లి చూడగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైన విషయం వెలుగు చూసింది. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో అశోకనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని, కిలాడీ లేడీ కోసం గాలిస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు.

ప్రముఖ ఆసుపత్రిలో నకిలీ లేడీ డాక్టర్ ఇద్దరు మహిళా పేషంట్ ల దగ్గర బంగారు నగలు చోరీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై ఆ రోజు డ్యూటీలో ఉన్న నర్సులు, సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+