రాష్ట్ర స్థాయి సమావేశంలో గుండెపోటుతో చనిపోయిన సీనియర్ నాయకుడు!

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ నాయకులు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సత్తాచాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ రాస్ట్ర స్థాయి సమావేశం జరుగుతున్న సమయంలో పార్టీ ఆఫీసులో గుండెపోటు రావడంతో ఓ నాయకుడు చనిపోయాడు.

సోమవారం గురుపౌర్ణమి సందర్బంగా బెంగళూరులోని మల్లేశ్వరంలోని రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన సిద్దేశ్ యాదవ్ (49) ఈ సమవేశానికి హాజరైనారు. సోమవారం మద్యాహ్నం బీజేపీ నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో మీటింగ్ ఉన్న సిద్దేశ్ యాదవ్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి కుప్పకూలిపోయారు.

A senior leader of the BJP died of a heart attack at the state level meeting of the BJP in

వెంటనే బీజేపీ నాయకులు సిద్దేశ్ యాదవ్ ను కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై బీజేపీ నాయకుడు సిద్దేశ్ యాదవ్ మరణించారని బీజేపీ నాయకులు తెలిపారు. 1988లో ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీ అనుబంధ సంస్థలో అడుగుపెట్టిన సిద్దేశ్ యాదవ్ తరువాత చిత్రదుర్గ ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడిగా ఏబీవీపీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

2008 నుంచి 2013 వరకు బీజేపీ చిత్రదుర్గ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. హిరయూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓసారి ఓడిపోయారు. కర్ణాటక ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక బీజేపీ స్లమ్ మోర్చ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బళ్లారి బీజేపీ పార్టీ పరిశీలకుడిగా పని చేసిన సిద్దేశ్ యాదవ్ నాయకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

A senior leader of the BJP died of a heart attack at the state level meeting of the BJP in

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వర్గీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దేశ్ యాదవ్ ఇప్పటికే బీజేపీలో అనేక కీలక పదవుల్లో పని చేశారు. సిద్దేశ్ యాదవ్ పార్టీ సమావేశంలో గుండెపోటు వచ్చి చనిపోవడంతో కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చిత్రదుర్గకు చెందిన పలువురు నాయకులు రాజకీయాలకు అతీతంగా ఆయన కుటుంబానికి ప్రగాడసానుభూతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+