Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EX CM: మాజీ సీఎంకు బాలకృష్ణ బంపర్ ఆఫర్, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు ఆఫర్, దేవుడా ?, కోట్లు ఇస్తాం !

మాజీ సీఎం పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు కూడా మాజీ సీఎం ఎన్నికల ఖర్చుకోసం కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. మాజీ సీఎంకు బాలకృష్ణ కూడా బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు/బళ్లారి: మాజీ సీఎం మీద పలువురు ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. మాజీ సీఎం మా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే ఎన్నికల ఖర్చుల కోసం కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. మాజీ సీఎం పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు కూడా మాజీ సీఎం ఎన్నికల ఖర్చుకోసం కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మాజీ సీఎం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గానికి గుడ్ బై చెప్పేసి మరో నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని అనుకుంటున్న సమయంలో ఆయనకు ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి. మాజీ సీఎంకు బాలకృష్ణ కూడా బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు

మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేస్తోందని. ప్రధాని నరేంద్ర మోదీ మాకు పెద్ద దిక్కుగా ఉంటారని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. అయితే ఈసారి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ విఫలయత్నం చేస్తోంది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఉన్నారు.

సిద్దరామయ్యకు బంపర్ ఆఫర్లు

సిద్దరామయ్యకు బంపర్ ఆఫర్లు

కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. కర్ణాటకలోని విజయనగరం జిల్లాలోని హోస్ పేట్ నియోజక వర్గంలో నివాసం ఉంటున్న వ్యక్తి అయితే ఏకంగా సిద్దరామయ్య ఎన్నికల ఖర్చుల కోసం కోటిరూపాయలు ఇస్తానని ప్రకటించాడు. సిద్దరామయ్య మా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే చాలు అని అతను అంటున్నాడు.

పొలం అమ్మి కోటి రూపాయలు ఇస్తా

పొలం అమ్మి కోటి రూపాయలు ఇస్తా

విజయనగరం జిల్లాలోని హోస్ పేట్ లో ఆనంద్ సింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆనంద్ సింగ్ వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిచడమే కాకుండా విజయనగరం జిల్లా కేంద్రంగా చేసి ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో పర్యాటక శాఖా మంత్రిగా పని చేస్తున్నారు. ఇలాంటి నియోజక వర్గం నివాసం ఉంటున్న ఓ రైతు తన ఆరు ఎకరాల్లో రెండు ఎకరాలు భూమి విక్రయిస్తూ కోటి రూపాయలు వస్తుందని అన్నారు. సిద్దరామయ్య మా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే ఆ కోటి రూపాయలు ఆయన ఎన్నికల ఖర్చు కోసం ఇస్తానని ఆ రైతు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 బీజేపీ కార్యకర్తలు ఆఫర్

బీజేపీ కార్యకర్తలు ఆఫర్

యాదగిరికి చెందినన తాలుకా పంచాయితీ మాజీ సభ్యుడు చంద్రరాయ నాగరాళ్ హులకల్ అలియాస్ చంద్రరాయ అనే బీజేపీ లీడర్ సిద్దరామయ్య మా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నేను బీజేపీ కార్యకర్త అయినా సిద్దరామయ్య కోసం పని చేస్తానని, ఆయన ఇక్కడ పోటీ చేస్తే చాలని చంద్రరాయ మాజీ సీఎం సిద్దూకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నేను వ్యాపారవేత్తను కాదు. కాంట్రాక్టర్ అంతకంటే కాదు. నేను సామాన్య రైతు, అయితే తన పొలం అమ్మి సిద్దరామయ్య ఎన్నికల ఖర్చులకు కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఇదే సమయంలో శహాపుర సిట్టింగ్ ఎమ్మెల్యే శరణబసప్ప గౌడ యాదగిరి నుంచి పోటీ చేస్తే ఆయనకు కూడా రూ. 25 లక్షలు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నానని చంద్రరాయ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది.

 బాలకృష్ణ బంపర్ ఆఫర్

బాలకృష్ణ బంపర్ ఆఫర్

చిక్కమగళూరులోని బీజేపీ సీనియర్ నాయకుడు, తమిళనాడు బీజేపీ ఇన్ చార్జ్ సీటీ. రవి మీద సిద్దరామయ్య పోటీ చేస్తే తన తోట అమ్మి కోటి రూపాయలు ఇస్తానని ఆ నియోజక వర్గంలో నివాసం ఉంటున్న కాఫీ తోటల యజమాని బాలకృష్ణ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మాజీ సీఎం సిద్దరామయ్య మీద ప్రేమతో వీళ్లు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా ?, లేద చాలెంజ్ చేస్తున్నారా అనే విసయం అర్థం కాక సామాన్య ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు.

 కోలారు నుంచి సిద్దరామయ్య పోటీ !

కోలారు నుంచి సిద్దరామయ్య పోటీ !

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చేసి అతి కష్టం మీద ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సిద్దరామయ్య కోలారు నుంచి పోటీ చెయ్యడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మీకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు సార్, అందుకే మా నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యండి అంటూ పలువురు మాజీ సీఎం సిద్దరామయ్యకు కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+