Attack: మాజీ సీఎం ఇలాకాలో హిందూ యువకుడిపై కత్తులతో దాడి, అర్దరాత్రి ?, టార్గెట్ వాళ్లే, ఇప్పటికే!
బెంగళూరు/శివమొగ్గ: అర్దరాత్రి బైక్ లో వెళ్లిన ఓ వర్గంలోని యువకులు ఆ వీధిలో నానా హంగామా చేశారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ గూండాలు రండిరా చూసుకుందాము, మిమ్మల్ని ఇక్కడే నరికిపాతిపెడుతాము అంటూ కత్తులతో హంగామా చేశారు. ఆ సందర్బంలో అభ్యంతరం చెప్పిన యువకుడి మీద కత్తులతో దాడి చేశారు. విషయం గమనించిన స్థానికులు కత్తులతో నానారచ్చ చేస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అందరూ అక్కడి నుంచి తప్పించుకునిపారిపోయారు.
గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. మాజీ సీఎం ఇలాకాలో ఓ వర్గం వాళ్లు మరో వర్గం యువకుల మీద పదేపదే దాడులు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మరో వర్గం యువకుడిని హత్య చేశారు.

మాజీ సీఎం సొంత జిల్లా
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని నెలల క్రితం శివమొగ్గ నగరంలో బీజేపీ కార్యకర్త హర్షాను కొందరు యువకులు హత్య చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్షా హత్య కేసులో ఇప్పటికే కొందరు ముస్లీం యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

అర్దరాత్రి హంగామా
సోమవారం అర్దరాత్రి శివమొగ్గలోని భర్మప్ప వీధిలో కొందరు ముస్లీం యువకులు బైక్ లో కేకలు వేస్తూ వెళ్లారు. అర్దరాత్రి బైక్ లో వెళ్లిన ఓ వర్గంలోని యువకులు ఆ వీధిలో నానా హంగామా చేశారు. ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ గూండాలు రండిరా చూసుకుందాము, మిమ్మల్ని ఇక్కడే నరికిపాతిపెడుతాము అంటూ కత్తులతో హంగామా చేశారు.

యువకుడికి కత్తిపోట్లు
ఆ సందర్బంలో భర్మప్ప వీధిలో నివాసం ఉంటున్న ప్రకాష్ అనే యువకుడు అభ్యంతరం వ్యక్తం చేసి వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో ముస్లీం యువకులు ప్రకాష్ మీద కత్తులతో దాడి చేశారు. విషయం గమనించిన స్థానికులు కత్తులు చేతిలోపట్టుకుని నానారచ్చ చేస్తున్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అందరూ అక్కడి నుంచి తప్పించుకునిపారిపోయారు.

ఆసుపత్రిలో యువకుడు
గాయాలైన ప్రకాష్ ను శివమొగ్గలోని మెగ్గాస్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప ఇలాకాలో ఓ వర్గం వాళ్లు మరో వర్గం యువకుల మీద పదేపదే దాడులు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే మర్షా అనే యువకుడిని ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు హత్య చేశారు.

జిల్లా ఎస్పీ మకాం ... మండిపడిన ఈశ్వరప్ప
విషయం తెలుసుకున్న శివమొగ్గ ఎస్పీ మిథున్ శర్మా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు తెలుసుకుని అక్కడే మకాం వేశారు. శివమొగ్గలో ముస్లీం యువకులు రెచ్చిపోతున్నారని, వాళ్లకు చట్టం అంటే గౌరవం, మర్యాద లేదని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేఎస్. ఈశ్వరప్ప మండిపడ్డారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications