Wife: భర్తకు మందు తాగించి కబాబ్, బిరియాని పెట్టిన భార్య ప్రియుడితో కలిసి ?, సంసారసుఖం !

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు 20 ఏళ్లు సంతోషంగా కాపురం చేశారు. భర్త ఉద్యోగం చేస్తున్నాడు. భర్త ఉద్యోగం చేస్తున్న చోటకు అప్పుడప్పుడు వెలుతున్న భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. యువకుడు ఆమెతో చనువుపెంచుకున్నాడు. కొంతకాలం తరువాత ఇద్దరు అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. భర్తకు తాగుడు అలవాటు ఉండటం, ఇంట్లో సంసార సుఖం ఇవ్వకపోవడంతో భార్య ఆమె ప్రియుడికి పూర్తిగా దాసోహం అయ్యింది. రాత్రి భార్య ఆమె భర్తకు డబ్బులు ఇచ్చి మద్యం తీసుకుని తాగాలని చెప్పింది. భర్త రెండు క్వాటర్లు మద్యం ఇంటికి తెచ్చుకున్నాడు. కబాబ్, చికెన్ బిరియాని చేసిన భార్య భర్తకు పెట్టింది. రాత్రిపీకలదాక మద్యం సేవించిన భర్త కబాబ్, చికెన్ బిరియాని తిని నిద్రపోయాడు. ఉదయం చూస్తే భర్త శవమైనాడు. పోలీసుల విచారణలో మూడు రోజుల నుంచి భర్తకు కనపడకుండా అతని భార్య ప్రియుడిని ఇంట్లో పెట్టిందని వెలుగు చూసింది.

బెంగళూరులో దంపతులు

బెంగళూరులో దంపతులు

పశ్చిమ బెంగాల్ కు చెందిన రాకేష్ తమాంగ్ అలియాస్ రాకేష్ (54), దేబితాబాగ్ అలియాస్ దేబితా (42) అనే మహిళకు 22 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకున్న రాకేష్, దేబితా దంపతులు విద్యారణ్యపురలోని వడేరహళ్లిలో నివాసం ఉంటున్నారు.

యువకుడితో పరిచయం

యువకుడితో పరిచయం

వివాహం చేసుకున్న రాకేష్, దేబితా దంపతులు 20 ఏళ్లు సంతోషంగా కాపురం చేశారు. బెంగళూరులో రాకేష్ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. భర్త రాకేష్ ఉద్యోగం చేస్తున్న చోటకు అప్పుడప్పుడు బోజనం ఇవ్వడానికి వెలుతున్న దేబితాకు అక్కడే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న బాబు ఆలీ అలియాస్ బాబు (30) అనే యువకుడు పరిచయం అయ్యాడు.

భర్త డ్యూటీలో ఉంటే ప్రియుడితో భార్య రొమాన్స్

భర్త డ్యూటీలో ఉంటే ప్రియుడితో భార్య రొమాన్స్

రాకేష్ డ్యూటీలో ఉన్న సమయంలో బాబు ఖాలీగా ఉంటున్నాడు. రాకేష్ ఇంట్లో ఉన్న సమయంలో బాబు డ్యూటీలో ఉంటున్నాడు. రాకేష్ భార్య దేబితాతో బాబు చనువుపెంచుకున్నాడు. కొంతకాలం తరువాత బాబు, దేబితా అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. రాకేష్ డ్యూటీలో ఉన్న సమయంలో ఇంటికి వెలుతున్న బాబు అతని ప్రియురాలు దేబితో రొమాన్స్ చేస్తున్నాడు.

భర్త సంసారసుఖం ఇవ్వలేదని ప్రియుడితో ?

భర్త సంసారసుఖం ఇవ్వలేదని ప్రియుడితో ?

భర్త రాకేష్ కు విపరీతంగా తాగుడు అలవాటు ఉండటం, ఇంట్లో సంసారసుఖం ఇవ్వకపోవడంతో దేబితా ఆమె ప్రియుడు బాబుకు పూర్తిగా దాసోహం అయ్యింది. కొన్ని నెలల క్రితం రాకేష్ కు అతని భార్య దేబితా అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని రాకేష్ అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు.

 కబాబ్, బిరియానీ పెట్టి భర్తను చంపేసింది

కబాబ్, బిరియానీ పెట్టి భర్తను చంపేసింది

రాత్రి దేబితా ఆమె భర్త రాకేష్ కు డబ్బులు ఇచ్చి మద్యం తీసుకుని తాగాలని చెప్పింది. రాకేష్ రెండు క్వాటర్లు మద్యం ఇంటికి తెచ్చుకున్నాడు. కబాబ్, చికెన్ బిరియాని చేసిన దేబితా ఆమె భర్తకు కడుపునిండా పెట్టింది. రాత్రిపీకలదాక మద్యం సేవించిన రాకేష్ చికెన్ బిరియాని తిని నిద్రపోయాడు. తరువాత ప్రియుడు బాబుతో కలిసి దేబితా గాఢ నిద్రలో ఉన్న ఆమె భర్త రాకేష్ ను గొంతు నులిమి చంపేసింది.

కిలాడీ లేడీ స్కెచ్ తో షాక్

కిలాడీ లేడీ స్కెచ్ తో షాక్

తన భర్త రాకేష్ విపరీతంగా మద్యం సేవించి చనిపోయాడని ఉదయం దేబితా స్థానికులు, పోలీసులకు చెప్పింది. రాకేష్ గొంతు మీద గాయాలు ఉండటంతో పోలీసులు దేబితాను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. నెల రోజుల క్రితం దేబితా ఆమె భర్త రాకేష్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బును ఆమె అకౌంట్ వేసుకుందని, తరువాత ప్రియుడు బాబుకు గూగుల్ పే ద్వారా కొంత డబ్బులు పంపించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భర్తకు తెలీకుండా మూడు రోజులు ప్రియుడు ఇంట్లోనే

భర్తకు తెలీకుండా మూడు రోజులు ప్రియుడు ఇంట్లోనే

దేబితా ఆమె భర్త రాకేష్ కు కనపడకుండా ఆమె ప్రియుడు బాబును మూడు రోజుల నుంచి ఇంట్లోనే పెట్టిందని, మూడు రోజుల నుంచి రాకేప్ ను హత్య చెయ్యాలని ప్రయత్నించారని వెలుగు చూసింది. నేను కావాలంటే నా భర్త రాకేష్ ను చంపేయి, లేదంటే నన్ను వదిలేయ్ అని దేబితా ఆమె ప్రియుడు బాబుతో చాలెంజ్ చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రియురాలు దేబితా భర్త రాకేష్ ను హత్య చేసిన బాబు హోసూరులో తలదాచుకోవడంతో పోలీసులు అతన్ని, దేబితాను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+