Shock:డీజీపీకి బుల్లెట్ గాయాలు, అవి ఐపీఎస్ సర్వీస్ రివాల్వర్ బుల్లెట్లు, ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్ లో!
బెంగళూరు: కర్ణాటక పోలీసు హౌసింగ్ బోర్డు డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.పి.శర్మా శరీరంలోకి రివాల్వర్ బుల్లెట్లు దూసుకుపోయాయి. ఇంట్లో ఉన్న ఆర్.పి. శర్మా శరీరంలోకి బుల్లెట్ లు దూసుకోవడంతో కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేని సమయంలో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి శరీరంలోకి బుల్లెట్ గాయాలు దూసుకోవడంతో ప్రజలు హడలిపోయారు. విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారులు వివరాలు సేకరించారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి
కర్ణాటక హౌసింగ్ బోర్డు కార్పోరేషన్ డీజీపీగా పని చేస్తున్న కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.పి. శర్మా బుధవారం సాయంత్రం ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో రివాల్వర్ లోని రెండు బుల్లెట్ లు డీజీపీ ఆర్.పి. శర్మా శరీరంలోకి దూసుకోయాయి. తరువాత ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆర్.పి. శర్మాను హెబ్బాళ సమీపంలోని కోలంబియా ఏషియా ఆసుపత్రికి తరలించారు.

బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్
ఆర్.పి. శర్మా శరీరంలోకి బుల్లెట్ లు దూసుకుపోయాయని సమాచారం తెలుసుకున్న బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్, బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ భీమాశంకర్ తదితర సీనియర్ పోలీసు అధికారులు కోలంబియా ఏషియా ఆసుపత్రి చేరుకుని డీజీపీ ఆర్.పి. శర్మా ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

ఐపీఎస్ సర్వీస్ రివాల్వర్ బుల్లెట్లు
డీజీపీ ఆర్.పి. శర్మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న డీజీపీ ఆర్,పి. శర్మా ఆయన సర్వీస్ రివాల్వర్ శుభ్రం చేస్తున్న సమయంలో ఆకస్మికంగా బుల్లెట్లు దూసుకుపోయాయని, ఆయన ఛాతి, గొంతు భాగంలో రెండు బుల్లెట్లు దూసుకుపోయాయని, ఇది ఆకస్మికంగా జరిగిన ప్రమాదమని బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ భీమాశంకర్ మీడియాకు చెప్పారు.

ఐసీయూలో డీజీపీ !
కర్ణాటక హౌసింగ్ బోర్డు డీజీపీ ఆర్,పీ, శర్మా శరీరంలోకి బుల్లెట్ గాయాలు దూసుకుపోయాయని వెలుగు చూడటంతో బెంగళూరు పోలీసులు ఆందోళనకు గురైనారు. ప్రస్తుతం డీజీపీ ఆర్,పీ, శర్మా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారికి బుల్లెట్ గాయాలు కావడంతో మొదట అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Recommended Video

నో డౌట్ అంటున్న పోలీసులు
డీజీపీ ఆర్,పీ. శర్మా సర్వీస్ రివాల్వర్ నుంచి ఆకస్మికంగా బుల్లెట్ లు దూసుకుపోయాయని వెలుగు చూడటంతో అనుమానాలకు తెరపడింది. 1997 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డాక్టర్ ఆర్,పీ, శర్మా గతంలో బీఎంటీఎఫ్ ఏడీజీపీగా పని చేసిన సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు. సిన్సియర్ పోలీసు అధికారి ఆర్,పీ. శర్మా అని ప్రజలు అనేక సందర్బాల్లో చెప్పారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications