CM Post: రాజీనామాకు సిద్దంగా ఉన్నా; హింట్ ఇచ్చిన సీఎం, నాకు తెలీదు, స్వామీజీల శాపనార్తాలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను సీఎం కుర్చి నుంచి దించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యతిరేక వర్గీయులకు శుభవార్త వచ్చింది. యడియూరప్పతో ఏర్పాటు చేసిన పార్టీ శాసనసభ్యుల సమావేశం రద్దు అయ్యింది. ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు రద్దు చేసిన బీజేపీ హైకమాండ్ అంతకు ముందు రోజు మంత్రులు, ఎమ్మెల్యేలకు స్టార్ హోటల్ లో విందు భోజనం ఏర్పాటు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చుతారు ? అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈనెల 25వ తేదీ తరువాత ఏమైనా జరగవచ్చు, నేను రాజీనామా కూడా చేసే అవకాశం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప స్వయంగా మీడియాకు చెప్పడంతో ఆయన వర్గీయులు షాక్ అయ్యారు.
బీజేపీ హైకమాండ్ ఎప్పుడు ఏమి చెబితే అది చెయ్యడానికి సిద్దం, 25వ తేదీపైన నన్ను రాజీనామా చెయ్యమంటే చేస్తానని యడియూరప్ప మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి దించితే బీజేపీ సర్వనాశనం అవుతుందని వంద మందికి పైగా స్వామీజీలు శాపనార్తాలు పెడుతున్నారు.

మోదీ, అమిత్ షా ఏం చెప్పారు?
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులను పక్కనపెట్టి ఇటీవల ఆయన కుమారుడు బీవై. విజయేంద్రను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప భేటీ అయ్యారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కర్ణాటక ముఖ్యమంత్రికి ఏం చెప్పారో ? అనే విషయం మాత్రం బయటకురాలేదు.

సీఎంతో సమావేశాలు
ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన సన్నిహిత మంత్రులు, ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశం అయ్యారు.బెంగళూరు వచ్చిన వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి ఈనెల 26వ తేదీన పార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
తన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి జూలై 26వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని, అందుకే ఆ రోజు ఎమ్మెల్యేతో సమావేశం అయ్యి ప్రభుత్వం చేపట్టవలసిన అభివృద్ది పనుల విషయం గురించి అందరితో చర్చిస్తామని సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు. అయితే ఆ సమావేశం రద్దు అయ్యింది.

రాజీనామా చెయ్యాలని డిసైడ్ అయిన సీఎం?
సీఎం కుర్చీ నుంచి యడియూరప్పను దించుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మొదటిసారి మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. జులై 25వ తేదీ తరువాత తన పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని సీఎం బీఎస్. యడియూరప్ప మీడియా ముందు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.

ఆ రోజు హైకమాండ్ చెప్పినట్లు చేస్తాను
గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. అంతకు ముందే సీఎం బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. జులై 25వ తేదీ నుంచి బీజేపీ హైకమాండ్ నుంచి తనకు ఫోన్ వచ్చే అవకాశం ఉంది, హైకమాండ్ చెప్పిన వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యడానికి ఇప్పటి నుంచే తాను మానసికంగా సిద్దం అయ్యానని బీఎస్. యడియూరప్ప క్లారిటీ ఇచ్చేశారు.

దేశంలో నేనే ఒక్కడే అనుకుంటా!
75 సంవత్సరాలు పూర్తి అయిన వారు అధికారంలో ఉండటానికి బీజేపీ అంగీకరించలేదని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా తన మీద నమ్మకంతో, గౌరవంతో తనకు 75 సంవత్సరాలు పూర్తి అయినా సీఎం పదవిలో ఉండటానికి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు వాళ్లు తనను రాజీనామా చెయ్యమంటే కచ్చితంగా వారిమాటలను గౌరవించి రాజీనామా చేస్తానని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

కొత్త సీఎం పేరు నేను ఎందుకు చెప్పాలి?
మీ తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ? అని మీడియా ప్రశ్నిస్తే సీఎం బీఎస్. యడియూరప్ప కొంచెం ఘాటుగానే సమాధానం ఇచ్చారు. కొత్త సీఎం పేరు నేను ఎందుకు చెప్పాలి ?, నేను ఎవర పేరు చెప్పను, ఎవ్వరి పేరు రెకమండ్ చెయ్యను, అది బీజేపీ హైకమాండ్ ఇష్టం, ముఖ్యమంత్రి ఎరైనా నాకు ఏమీ అభ్యంతరం లేదని, కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి నేను చేస్తానని సీఎం. బీఎస్, యడియూరప్ప మీడియాకు చెప్పారు.

శాపనార్తాలు పెడుతున్న స్వామీజీలు
మొత్తం మీద తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప క్లారిటీ ఇచ్చేశారు. అయితే సీఎం బీఎస్. యడియూరప్పను సీఎం పదవిలో కొనసాగించాలని కర్ణాటకలోని వంద మందికి పైగా స్వామీజీలు బీజేపీ హైకామాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి కిందకు దించితే కర్ణాటకలో బీజేపీ సర్వనాశనం అవుతోందని స్వామీజీలు శాపనార్తాలు పెడుతున్నారు.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications