DKS: తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్న ట్రబుల్ షూటర్, నివేదిక ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు ఆర్డర్, హమ్మయ్యా!
డీకే. శివకుమార్ మీద సీబీఐ చేస్తున్న విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని, ఇంత వరకు డీకే శివకుమార్ కేసులో మీరు చేసిన దర్యాప్తు నివేదిక మా ముందు సమర్పించాలని కర్ణాటక హైకోర్టు సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు/న్యూఢిల్లీ: కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. డీకే. శివకుమార్ మీద సీబీఐ చేస్తున్న విచారణ తాత్కాలికంగా నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంత వరకు డీకే శివకుమార్ కేసులో మీరు చేసిన దర్యాప్తు వివరాలను గడువులోపు మా ముందు సమర్పించాలని హైకోర్టు సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల ఈడీ అధికారులు డీకే శివకుమార్ కు సమన్లు జారీ చేశారు. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈడీ, సీబీఐ అధికారులు మా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ డీకే. శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

డీకే ఫ్యామిలీకి సమన్లు జారీ
ఈడీ అధికారులు డీకే శివకుమార్ కు సమన్లు జారీ చేశారు. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 22వ తేదీన మా ముందు హాజరుకావాలని డీకే శివకుమార్ కు ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈడీ, సీబీఐ అధికారులు మా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ డీకే. శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో విచారణ
డీకే. శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది సీహెచ్, జాధవ్ వాదనలు వినిపించారు. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు అయిన నా క్లైంట్ డీకే. శివకుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో డీకే. శివకుమార్ మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి సీబీఐ, ఈడీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

తాత్కాలికంగా స్టే ఇచ్చిన హైకోర్టు
డీకే శివకుమార్ పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి కే. నటరాజన్ ఈనెల 24వ తేదీ వరకు డీకే. శివకుమార్ కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని సీబీఐకి చూసించింది. ఇంత వరకు డీకే శివకుమార్ కేసులో మీరు చేసిన దర్యాప్తు వివరాలను ఈనెల 22వ తేదీలోపు మా ముందు సమర్పించాలని కర్ణాటక హైకోర్టు సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

నా జీవితంతో ఆడుకుంటున్నారు
సీబీఐ, ఈడీ అధికారులు నాతో పాటు నా కుటుంబ సభ్యులతో ఆడుకుంటున్నారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ఆరోపించారు. పదేపదే నాకు నోటీసులు ఇస్తున్న ఈడీ, సీబీఐ అధికారులు విచారణ పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నా మీద కక్షసాధింపులకు పాల్పడుతోందని, అందుకే సీబీఐ, ఈడీని రంగంలోకి దిపిందని డీకే శివకుమార్ మండిపడుతున్నారు.

ఎన్ని సంవత్సరాలు అంటే?
2017లో డీకే. శివకుమార్ కు మొదట ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. తరువాత ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో డీకే శివకుమార్ మీద ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు డీకే. శివకుమార్ మీద విచారణ చెయ్యడానికి కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. అప్పటి నుంచి డీకే. శివకుమార్ ఐటీ శాఖ, ఈడీ, సీబీఐ అధికారుల విచారణ ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications