family: కాంట్రాక్టర్ ఫ్యామిలీలో ముగ్గురి ఆత్మహత్య కేసులో ట్విస్ట్, నలుగురు అందర్, 30 నిద్రమాత్రలు !
బెంగళూరు: కాంట్రాక్టర్ అతని తల్లి, సోదరి సామూహిక ఆత్మహత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒక్కొక్కరు 30కి పైగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. కాంట్రాక్టర్ మరో సోదరి కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
బెంగళూరు సిటీలోని మహాలక్ష్మి లేఔట్ లోని శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ స్ట్రీట్ లో యశోధ (70) అనే మహిళ నివాసం ఉంటున్నారు. యశోధాకు సుమనా గుప్తా (42), అపర్ణా గుప్తా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు నరేష్ గుప్తా (37) అనే కుమారుడు ఉన్నాడు. అపర్ణా గుప్తా వివాహం చేసుకుని బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ లోని ఆమె భర్త ఇంటిలో ఉంటున్నది.

ఇటీవల యశోధా, ఆమె కుమార్తె సుమనా గుప్తా, కుమారుడు నరేష్ గుప్తా రాజాజీనగర్ లో ఉంటున్న అపర్ణా గుప్తాకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. మరుసటి రోజు అపర్ణా గుప్తా ఆమె తల్లి యశోధాకు, సోదరి సుమనా గుప్తాకు, సోదరుడు నరేష్ గుప్తాకు ఫోన్ చేసినా ఎవ్వరూ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. రెండు రోజుల నుంచి అపర్ణా ఫోన్ చేసినా ఎవ్వరూ రిసీవ్ చెయ్యలేదు.
అపర్ణా గుప్తాకు అనుమానం వచ్చి మంగళవారం మద్యాహ్నం మహాలక్ష్మిలోని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లి చూసింది. అపార్ట్ మెంట్ లోపల లాక్ చేసి ఉండటంతో అపర్ణా గుప్తా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు తలుపులు పలగొట్టి చూడగా లోప యశోధ, సుమన గుప్తా, నరేష్ గుప్తా శవాలై కనిపించారు.
నరేష్ గుప్తా ప్యాంట్ జోబులో ఓ స్లిప్ చిక్కిందని, అందులో నిద్రమాత్రలు కొనుగోలుచేసినట్లు ఉందని పోలీసులు చెప్పారు. యశోధా, నరేష్ గుప్తా, సుమన గుప్తా ఒక్కొక్కరు 30కి పైగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. కాంట్రాక్టర్ మరో సోదరి అపర్ణా గుప్త కేసు పెట్టడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
పోస్టుమార్టం అంతిమ నివేదిక, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వచ్చిన తరువాత ముగ్గురి ఆత్మహత్యలకు అసలు కారణం ఏమిటని కచ్చితంగా తెలుస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు. తన కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్యలకు తన సోరుడు నరేష్ గుప్తా స్నేహితులు కొందరు కారణం అయ్యారని అపర్ణా గుప్తా పోలీసులకు చెప్పారు. కాంట్రాక్టర్ నరేష్ గుప్తా అతని తల్లి, సోదరి సామూహిక ఆత్మహత్యలలో నరేష్ నలుగురు స్నేహితులను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications