Bengaluru: వినాయక చవితి పండుగ సమయంలో గొడవలకు స్కెచ్ ?, గూండాకు రివాల్వర్ ఇవ్వడానికి వచ్చి!

బెంగళూరు/ నాగ్ పూర్: వినాయక చవితి పండుగ సమీపిస్తున్న సమయంలో బెంగళూరులో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఇప్పటికే బెంగళూరు పోలీసులు రౌడీషీటర్ల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఓ వర్గంలోని వ్యక్తికి కంట్రీమేడ్ రివాల్వర్ డెలవరీ చెయ్యడానికి సీక్రేట్ గా బెంగళూరు వచ్చిన ఆయుధాల డీలర్ ను బెంగళూరు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

బెంగళూరులో హై అలర్ట్

బెంగళూరులో హై అలర్ట్

వినాయక చవితి పండుగ సందర్బంగా బెంగళూరులో గొడవలు జరిగే అవకాశం ఉందని అనుమానం రావడంతో బెంగళూరు నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటి నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాడు. బెంగళూరు నగరంలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి

వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అనుమతి

వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసే వారికి అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు ఆచితూచి అన్ని రకాలుగా ఆలోచించి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. వినాయక చవితి పండుగ సమీపిస్తున్న సమయంలో బెంగళూరులో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

రౌడీషీటర్ల ఇళ్లల్లో సోదాలు

రౌడీషీటర్ల ఇళ్లల్లో సోదాలు

వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఇప్పటికే బెంగళూరు పోలీసులు రౌడీషీటర్ల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. బెంగళూరులోని సున్నితమైన ప్రాంతాల్లోని ఓ వర్గానికి చెందిన రౌడీలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

డీజేహళ్లి గూండాకు రివాల్వర్?

డీజేహళ్లి గూండాకు రివాల్వర్?

బెంగళూరు నగరంలోని డీజేహళ్లి ఎంత సున్నితమైన ప్రాంతమో అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. ఇటీవల డీజేహళ్లిలో జరిగిన గొడలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అలాంటి డీజేహళ్లిలోని వర్గంలోని గూండాకు కంట్రీమేడ్ రివాల్వర్ డెలవరీ చెయ్యడానికి నాగ్ పూర్ నుంచి సీక్రేట్ గా బెంగళూరు ఆయుధాల డీలర్ నీలేష్ రావర్ అనే వ్యక్తి బెంగళూరు వచ్చాడు.

పోలీస్ ఇన్ఫార్మర్ దెబ్బతో అరెస్టు

పోలీస్ ఇన్ఫార్మర్ దెబ్బతో అరెస్టు

నాగ్ పూర్ నుంచి బెంగళూరు కంట్రీమేడ్ రివాల్వర్ తీసుకుని వచ్చిన నీలేష్ నావర్ డీజేహళ్లిలోని ఆ గూండా అడ్రస్ కనుక్కొవడం కష్టం అయ్యి బ్యాగ్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడు. పోలీసు ఇన్ఫార్మర్ కు అనుమానం వచ్చి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు నీలేష్ నావర్ ను అదుపులోకి తీసుకుని బ్యాగ్ పరిశీలించగా రివాల్వర్ బయటపడింది. ఒకవేళ డీజేహళ్లి గూండా చేతికి రివాల్వర్ చిక్కిఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవని, నీలేష్ నావర్ ను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. డీజేహళ్లి గూండా వివరాలు చెప్పడానికి పోలీసు అధికారులు నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+