Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday: అత్త ఇంట్లో మర్యాదలేదని, కేక్ కట్ చేస్తున్న మరదలి మొగుడిని పొడిచేసిన బావ, మ్యాటర్!

బెంగళూరు: వివాహం చేసుకున్న యువకుడు భార్య తల్లి ఇంటిలోని ఒక పోర్షన్ లోనే నివాసం ఉంటున్నాడు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతుల ఇంటి పక్కనే పోర్షన్ లో భార్య తల్లి నివాసం ఉంటున్నది. గత ఏడాది భార్య చెల్లెలు ఓ యువకుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. కొన్ని రోజుల తరువాత ప్రేమ వివాహం చేసుకున్న చిన్నకూతురు, అల్లుడితో ఆమె తల్లి కలిసిపోయింది. అక్క కూడా చెల్లెలి లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఆమె కూడా కలిసిపోయింది.

అయితే బావ మాత్రం మరదలు, ఆమె భర్త మీద గుర్రగా ఉన్నాడు. ఇటీవల చిన్న అల్లుడికి ఇంట్లో మర్యాద ఎక్కువ అయ్యిందని, తన గురించి పట్టించుకోవడం మానేశారని పెద్ద అల్లుడికి అనుమానం మొదలైయ్యింది. తన భార్య, అత్త, మరదలు, ఆమె భర్త నేను ఇంట్లో లేని సమయంలో తన గురించి చులకనగా మాట్లాడుకుంటున్నారని అతనికి బలంగా అనుమానం వచ్చింది.

మరదలి భర్త పుట్టిన రోజు వేడుకలను అత్త ఇంట్లో ఏర్పాటు చేశారు. మరిది పుట్టిన రోజుల వేడుకలకు పక్కింటిలోనే ఉంటున్న భార్య కూడా వెళ్లింది. అయితే మర్యాదలేని ఆ కొంపలో నేను అడుగు పెట్టనని భర్త తేల్చి చెప్పాడు. బర్త్ డే వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న మరదలి భర్తను ఇంటి పెద్ద అల్లుడు కత్తితో దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

 కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి

కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి

బెంగళూరులోని బయ్యప్పనహళ్ళిలోని బండెనగరలో సునీల్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బయ్యప్పనహళ్ళిలో నివాసం ఉంటున్న సుస్మితా అనే యుతిని కొన్ని సంవత్సరాల క్రితం సునీల్ వివాహం చేసుకున్నాడు. సునీల్, సుస్మితా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుస్మితా తల్లి ఇంట్లోని ఒక పోర్షన్ లో సునీల్, సుస్మితా దంపతులు నివాసం ఉంటున్నారు.

మరదలు లవ్ మ్యారేజ్

మరదలు లవ్ మ్యారేజ్

సునీల్ భార్య సుస్మితాకు జ్యోతికా అనే చెల్లెలు ఉంది. జ్యోతిక రాకేష్ అనే యువకుడిని ప్రేమించింది. మరదలు జ్యోతికా రాకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె బావ సునీల్ కు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే విషయంలో రెండుమూడుసార్లు సునీల్ ఇంట్లో గొడవ చేశాడని తెలిసింది. అయితే గత ఏడాది జ్యోతిక, రాకేష్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఇద్దరు కూతుర్లకు రెండు ఇండ్లు ఇచ్చిన తల్లి

ఇద్దరు కూతుర్లకు రెండు ఇండ్లు ఇచ్చిన తల్లి

కొన్ని రోజుల తరువాత ప్రేమ వివాహం చేసుకున్న చిన్నకూతురు జ్యోతికా, చిన్న అల్లుడు రాకేష్ తో ఆమె తల్లి కలిసిపోయింది. అక్క సుస్మితా కూడా చెల్లెలు జ్యోతికా లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఆమె కూడా కలిసిపోయింది. అయితే జ్యోతికా బావ సునీల్ మాత్రం మరదలు, ఆమె భర్త రాకేష్, అతని అత్త మీద గుర్రగా ఉన్నాడు. పెద్ద కూతురు సుస్మితాకు ఒక ఇల్లు ఇచ్చిన ఆమె తల్లి చిన్న కూతురు జ్యోతికాకు కూడా మరో ఇల్లు ఇచ్చి చిన్న అల్లుడు రాకేష్ ను కూడా అక్కడే పెట్టుకుంది.

చిన్న అల్లుడిని నెత్తిన పెట్టుకుంటున్న అత్త

చిన్న అల్లుడిని నెత్తిన పెట్టుకుంటున్న అత్త

ఇటీవల చిన్న అల్లుడు రాకేష్ కు ఇంట్లో మర్యాద ఎక్కువ అయ్యిందని, మా అత్త అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నదని, తన గురించి పట్టించుకోవడం మానేశారని పెద్ద అల్లుడు సునీల్ కు అనుమానం మొదలైయ్యింది. తన భార్య సుస్మిత, అత్త, మరదలు జ్యోతికా, ఆమె భర్త రాకేష్ నేను ఇంట్లో లేని సమయంలో తన గురించి చులకనగా మాట్లాడుకుంటున్నారని సునీల్ కు బలంగా అనుమానం వచ్చింది.

చిన్న అల్లుడి పుట్టిన రోజు ఏం జరిగిందంటే?

చిన్న అల్లుడి పుట్టిన రోజు ఏం జరిగిందంటే?

రాకేష్ పుట్టిన రోజు సందర్బంగా అత్త ఆమె ఇంట్లో కేక్ కటింగ్ తో పాటు చిన్న డిన్నర్ ఏర్పాటు చేసింది. రాకేష్ అతని అత్త ఇంట్లో బర్త్ డే కేక్ కట్ చెయ్యడానికి బయలుదేరాడు. ఆ సమయంలో సునీల్ అతని తోడల్లుడు రాకేష్ నడిరోడ్డులో అడ్డగించి అతని మీద దాడి చేశాడు. ఆ సమయంలో స్థానికులు సునీల్ క చివాల్లు పెట్టి అక్కడి నుంచి పంపించేశారు. తరువాత రాకేష్ అత్త ఇంటకి వెళ్లి అతని భార్య జ్యోతికాకు విషయం చెప్పాడు. ఈ రోజు పుట్టిన రోజు పూర్తి అయిన తరువాత రేపు ఈ విషయం గురించి మాట్లాడుదామని జ్యోతికా ఆమె భర్త రాకేష్ కు చెప్పింది.

బర్త్ డే రోజు కేక్ కట్ చేస్తుంటే పొడిచి పారేసిన పెద్ద అల్లుడు

బర్త్ డే రోజు కేక్ కట్ చేస్తుంటే పొడిచి పారేసిన పెద్ద అల్లుడు

మరదలు జ్యోతికా భర్త రాకేష్ పుట్టిన రోజు వేడుకలను అత్త ఇంట్లో ఏర్పాటు చేశారు. మరిది పుట్టిన రోజుల వేడుకలకు పక్కింటిలోనే ఉంటున్న సునీల్ భార్య సుస్మితా కూడా వెళ్లింది. అయితే మర్యాదలేని ఆ కొంపలో నేను అడుగు పెట్టనని సునీల్ తేల్చి చెప్పాడు. బర్త్ డే వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న జ్యోతికా భర్త రాకేష్ దగ్గరకు వెళ్లిన సునీల్, అతని స్నేహితుడు కుళ్ల బాబా కలిసి అతన్ని చితకబాదేశారు. కుటుంబ సభ్యులు అడ్డుపుడుతున్నా సునీల్ ఏమాత్రం లెక్క చెయ్యకుండా కత్తి తీసుకుని తోడల్లుడు రాకేష్ ను కత్తితో దారుణంగా పొడిచేశాడు.

బర్త్ డే రోజు దారుణం

బర్త్ డే రోజు దారుణం

బర్త్ డే రోజు కత్తిపోట్లు పడటంతో రాకేష్ కుప్పకూలిపోయాడు, వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు రాకేష్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బర్త్ డే రోజు తోడల్లుడు సునీల్ చేతిలోనే తీవ్రకత్తిపోట్లకు గురైన రాకేష్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని, సునీల్ వెంటాడిన పోలీసు అధికారులు అతన్ని పట్టుకున్నారు. సునీల్ ఫ్రెండ్ బాబు తప్పించుకున్నాడు. పెద్ద అల్లుడు బర్త్ డే పార్టీ చేసుకుంటున్న చిన్న అల్లుడు రాకేష్ ను కత్తితో దారుణంగా పొడిచేయడం బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+