• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

CD lady: అపార్ట్ మెంట్ లో, పీజీలో ఏం సీజ్ చేశారంటే? స్పాట్ లో మేడమ్ విచారణ, రాసలీలలు!

|

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి తన మీద అత్యాచారం చేశాడని కేసు పెట్టిన పీజీ సుందరిని సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. రాసలీలల సీడీ తీశారని సీడీ లేడీ చెప్పిన బెంగళూరులోని లగ్జరీ అపార్ట్ మెంట్, బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో సీడీ లేడీ ఉన్న పీజీలో ఆ లేడీని స్పాట్ లో విచారణ చేసిన సిట్ అధికారులు సోదాలు చేసి అనేక వస్తువులు సీజ్ చేశారని తెలిసింది.

రాసలీలల వీడియో తీసిన సమయంలో పీజీ లేడీ వేసుకున్న దుస్తులు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. అసలు ఆ వీడియో తీసింది ఎవరు ? రొమాన్స్ జరిగిన బెడ్ ఆ రోజుకి, ఈ రోజుకి ఏమైనా మార్పులు చేశారా ?, సీడీ లేడీ ఎన్నిసార్లు అపార్ట్ మెంట్ కు వెళ్లింది ? తదితర పూర్తి వివరాలు సేకరించిన సిట్ అధికారులు సీడీ లేడీని మరోసారి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

Khiladi: భర్తకు బాయ్ బాయ్, అత్త ఆధార్ కార్డుతో కోడలు ఏం చేసిందంటే, బాయ్ ఫ్రెండ్ తో?

స్పాట్ కు సీడీ లేడీ

స్పాట్ కు సీడీ లేడీ

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జరాకిహోళి తన మీద అత్యాచారం చేశాడని కేసు పెట్టిన పీజీ సుందరిని సిట్ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. రాసలీలల సీడీ తీశారని సీడీ లేడీ చెప్పిన బెంగళూరులోని మల్లేశ్వరం సమీపంలోని రమేష్ జారకిహోళికి చెందిన లగ్జరీ అపార్ట్ మెంట్ లోకి సీడీ లేడీని పిలుచుకుని వెళ్లి అక్కడ పంచనామా (స్పాట్ విజిట్, విచారణ) నిర్వహించారని తెలిసింది,

సుమారు ఐదు గంటల పాటు సీడీ లేడీని అపార్ట్ మెంట్ లో స్పాట్ లో విచారణ చేసి వివరాలు సేకరించడంతో కథ రసవత్తరంగా మారింది.

ఫ్లాట్ లో బట్టలు సీజ్ !

ఫ్లాట్ లో బట్టలు సీజ్ !

మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి చెందిన మల్లేశ్వరం సమీపంలోని విలాసవంతమైన అపార్ట్ మెంట్ లోని ఆయన ఫ్లాట్ లో ఉన్న కొన్ని దుస్తులు, వస్తువులను సిట్ అధికారులు సీజ్ చేశారని సమాచారం. అంతే కాకుండా అపార్ట్ మెంట్ ఎంట్రీ గేట్ లో సెక్యూరిటీ దగ్గర ఉన్న విజిటర్స్ ఎంట్రీ బుక్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

సీడీ లేడీ ఆ ఫ్లాట్ కు ఎన్నిసార్లు వచ్చింది ?, ఎందుకు వచ్చింది

సీడీ లేడీ ఆ ఫ్లాట్ కు ఎన్నిసార్లు వచ్చింది ?, ఎందుకు వచ్చింది

మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి బెంగళూరులోని మల్లేశ్వరం సమీపంలో లగ్జరీ అపార్ట్ మెంట్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ లోని రమేష్ జారకిహోళి ఫ్లాట్ లోనే రాసలీలల సీడీ తీశారని పీజీ లేడీ అంటోంది. అయితే రమేష్ జారకిహోళి అపార్ట్ మెంట్ అడ్రెస్ ఆమెకు ఎవరు ఇచ్చారు ?, ఆ ఫ్లాట్ కు ఆమె ఎన్నిసార్లు వచ్చింది ?, ఎందుకు వచ్చింది ?, విజిటర్స్ ఎంట్రీ బుక్ లో ఆమె ఏ పేరు రాసింది ? అంటూ సిట్ అధికారులు పూర్తి సమాచారం సేకరించారు.

కెమెరా ఎవరు ఫిట్ చేశారు?

కెమెరా ఎవరు ఫిట్ చేశారు?

మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో పీజీ లేడీ రాసలీలలు సాగించిన వీడియో నెల రోజుల క్రితం మీడియాకు విడుదలై కలకలం రేపింది. రాసలీలల సీడీ దెబ్బతో రమేష్ జారకిహోళి మంత్రి పదవి ఊడిపోయింది. ఫుల్ సెక్యూరిటీ ఉన్న అపార్ట్ మెంట్ లోని మంత్రి హోదాలో ఉన్న రమేష్ జారకిహోళి ఫ్లాట్ లోకి కెమెరా ఎవరు తీసుకెళ్లారు ?, రాసలీలల జరుగుతున్న సమయంలో వీడియో ఎవరు తీశారు ?, ఆ కెమెరా ఎక్కడ ఫిట్ చేశారు ?, ఆ వీడియో కెమెరాను ఎవరు తీసిచ్చారు ? అంటూ సిట్ అధికారులు సీడీ లేడీని ప్రశ్నించారని తెలిసింది.

మీరు చెప్పండి ?, ఈమె మీకు తెలుసా

మీరు చెప్పండి ?, ఈమె మీకు తెలుసా

మల్లేశ్వరం సమీపంలోని మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి చెందిన లగ్జరీ అపార్ట్ మెంట్ లోని సెక్యూరిటీ గార్డు, ఆయన ఫ్లాట్ లో పని చేస్తున్న ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. పీజీ లేడీ రమేష్ జారకిహోళి ఫ్లాట్ కు వచ్చిన సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు ?, పీజీ లేడీ ఎంతసేపు రమేష్ జారకిహోళితో గడిపేది ?, ఆ సమయంలో వీరిద్దరూ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ? అని సిట్ అధికారులు వివరాలు సేకరించారు.

అపార్ట్ మెంట్ లో ఎంట్రీకి చిన్నకథ కాదు

అపార్ట్ మెంట్ లో ఎంట్రీకి చిన్నకథ కాదు

శ్రీమంతులు నివాసం ఉండే ఆపార్ట్ మెంట్ లో ఎవరైనా ఎంట్రీ ఇవ్వాలంటే వారి పూర్తి సమాచారం అక్కడ ఉన్న బుక్ లో రాయాలి. ఎన్ని గంటలకు లోపలికి వెళ్లారు, ఎన్ని గంటలకు బయటకు వెళ్లారు ? అని ఆ రిజిస్టర్ లో సెక్యూరిటీ గార్డు నమోదు చేస్తారు. ఆ బుక్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ జారకిహోళి ఫ్లాట్ పక్కన నివాసం ఉంటున్న వారిని సిట్ అధికారులు మీకు సీడీ లేడీ ఏమైనా తెలుసా ?, ఇక్కడ జరిగే విషయాలు తెలుసా ? అని సిట్ అధికారులు వారిని ప్రశ్నించి వివరాలు సేకరించారని తెలిసింది.

సీడీ లేడీ పీజీలో సోదాలు

సీడీ లేడీ పీజీలో సోదాలు

బెంగళూరులోని ఆర్ టీ నగర్ లో సీడీ లేడీ నివాసం ఉండే పీజీ కేంద్రంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. సీడీ లేడీని వెంట పిలుచుకుని వెళ్లి మరీ పీజీ కేంద్రంలో సోదాలు చేశారని తెలిసింది. సుమారు నాలుగు గంటల పాటు పీజీలో సోదాలు చేసిన సిట్ అధికారులు అక్కడ కొన్ని దుస్తులు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఇదే సమయంలో పీజీ యజమానికి కూడా సిట్ అధికారులు వివచారణ చేసి వివరాలు సేకరించారు. పీజీ సుందరి కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో శుక్రవారం ఆమెను మరోసారి విచారణ చెయ్యాలని సిట్ అధికారులు నిర్ణయించారని తెలిసింది.

English summary
CD Scandal: Ramesh Jarkiholi cd case, SIT conduct Spot Inquest At CD Girl's PG in RT Nagar in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X