Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Guruji: గురూజీ హత్య కేసు నిందితులు పోలీసు కస్టడీకి, బినామీ ఆస్తులు కాదు, ఏదో ఉంది ?, హంతకుడి భార్య!

బెంగళూరు/హుబ్బళి: వాస్తు చెప్పడంలో దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాధించుకున్న కర్ణాటకకు చెందిన ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని కిరాతకంగా హత్య చేసిన నిందితులను హుబ్బళి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చాలా సంవత్సరాల నుంచి ఎంతో నమ్మకంగా పని చేస్తూ ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా 40 సెకన్లలో 60 సార్లు పొడిచి చంపేసిన నిందితులను విచారణ చేసి పూర్తి మ్యాటర్ బయటకు లాగాలని హుబ్బళి పోలీసులు డిసైడ్ అయ్యారు. చంద్రశేఖర్ గురూజీని హత్య చేసిన కొన్ని గంటల్లోనే హంతకులను హుబ్బళి పోలీసులు పట్టుకున్నారు.

గురూజీ సొంత అపార్ట్ మెంట్ లోనే హంతకుడు అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. హంతకుడి అపార్ట్ మెంట్ వెనుక అపార్ట్ మెంట్ లో చంద్రశేఖర్ గురూజీ నివాసం ఉండేవారు. చంద్రశేఖర్ గురూజీని హత్య చేసిన ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బీనామీ ఆస్తుల కోసం హత్య జరగలేదని, ఇంకా అనేక కారణాలు ఉన్నాయనే అనుమానం వారి నుంచి మరింత సమాచారం బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నారు.

హోటల్ లో అరాచకం

హోటల్ లో అరాచకం

కర్ణాటకలోని హుబ్బళి నగరంలోని ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని జులై 5వ తేదీన పట్టపగలు 60 సార్లు కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. చంద్రశేఖర్ గురూజీని హత్య చేసే సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చంద్రశేఖర్ గురూజీని హత్య చేసిన నిందితులను అక్కడే పట్టుకోవడానికి హోటల్ సిబ్బంది ఏమాత్రం ధైర్యం చెయ్యలేకపోయారు.

సీసీటీవీలో చిక్కిపోయిన శిష్యులు

సీసీటీవీలో చిక్కిపోయిన శిష్యులు

చంద్రశేఖర్ గురూజీ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్ అనే వ్యక్తి,, అతని అనుచరుడు మంజునాథ్ మరెవాడా కలిసి హత్య చేశారని, ఆ విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. వెంటనే నిందితులను పట్టుకోవడానికి హుబ్బళి-ధారవాడ ఎస్పీ లాబూరామ్ ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు.

శిష్యుడే స్కెచ్ వేశాడు

శిష్యుడే స్కెచ్ వేశాడు

ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని ఆయన దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్, అతని అనుచరుడు మంజునాథ్ మరెవాడా హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో హుబ్బళిలోని విద్యానగర పోలీసులు అరెస్టు చేశారు. చాలా సంవత్సరాల నుంచి చంద్రశేఖర్ గురూజీ దగ్గర మహంతేష్ చాలా నమ్మకంగా పని చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

గురూజీ స్వయంగా పెళ్లి చేశారు

గురూజీ స్వయంగా పెళ్లి చేశారు

చంద్రశేఖర్ గురూజీ ఆయన శిష్యుడు మహంతేష్ కు స్వయంగా దగ్గర ఉండి పెళ్లి చేశారని పోలీసులు అన్నారు. హుబ్బళిలోని గోకుల్ రోడ్డులోని డెక్తాన్ వెనుక భాగంలోని చంద్రశేఖర్ గురూజీ సొంత అపార్ట్ మెంట్ లో మహంతేష్, అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. మహంతేష్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వెనుక వైపు ఉన్న మరో అపార్ట్ మెంట్ లో చంద్రశేఖర్ గురూజీ చాలాకాలం నుంచి నివాసం ఉండేవారని హుబ్బళి పోలీసు అధికారులు తెలిపారు.

హంతకుడి భార్యకు?

హంతకుడి భార్యకు?

మహంతేష్ తో పాటు అతని భార్యకు చంద్రశేఖర్ గురూజీ ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవడానికి ఆర్థికంగా సహాయం చేశారు. 2019 సంవత్సరం వరకు మహంతేష్ భార్య చంద్రశేఖర్ గురూజీ దగ్గర ఉద్యోగం చేసిందని, తరువాత ఆమె గురూజీ దగ్గర ఉద్యోగం మూనేసిందని పోలీసు అధికారులు తెలిపారు. 2016 నుంచి చంద్రశేఖర్ గురూజీ దగ్గర మహంతేష్ చాలా నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

బినామీ ఆస్తులు కారణమా ?, లేక ఏమైనా

బినామీ ఆస్తులు కారణమా ?, లేక ఏమైనా

చంద్రశేఖర్ గురూజీ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్ అనే వ్యక్తి,, అతని అనుచరుడు మంజునాథ్ మరెవాడా కలిసి హత్య చేశారు. బినామీ ఆస్తుల విషయంలో చంద్రశేఖర్ గురూజీని హత్య చేశామని మహంతేష్ పోలీసులకు చెప్పాడని తెలిసింది.

పోలీసు కస్టడీకి గురూజీ హంతకులు

పోలీసు కస్టడీకి గురూజీ హంతకులు

అయితే బీనామీ ఆస్తుల కోసం హత్య జరగలేదని, ఇంకా అనేక కారణాలు ఉన్నాయనే అనుమానం వారి నుంచి మరింత సమాచారం బయటకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రశేఖర్ గురూజీని హత్య చేసిన ఇద్దరు నిందితులను కోర్టు అనుమతితో ఆరు రోజులు విచారణ చేసి వివరాలు బయటకు లాగడానికి హుబ్బళిలోని విద్యానగర పోలీసులు వారి కస్టడీలోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+