Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cheating: లవ్ మ్యారేజ్, 9 ఏళ్లు కాపురం, మరొకరితో నిశ్చితార్థం, 420 కహాని, ఫ్యామిలీ ప్యాకేజ్ కేసులు!

బెంగళూరు/ హాసన్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పాత సినిమా స్టోరీలాగానే పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. భార్యతో కలిసి అతను సంతోషంగా కాపురం పెట్టాడు. చాలా సంవత్సరాల ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో అతను చక్కగా కాపురం చేశాడు. భార్యకు తెలిసే భర్త అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కొంతకాలం క్రితం భార్యకు హ్యాండ్ ఇచ్చిన భర్త మాయం అయిపోయాడు. ఇటీవల భార్యకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని అతని భార్యకు తెలిసిపోయింది. తన భర్త ఇప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని, పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయని అతని భార్యకు సమాచారం అందింది.

నన్ను పెళ్లి చేసుకుని ఇంతకాలం తనతో కాపురం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని భార్య నిలదీసింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు చెప్పిన డైలాగులకు ఆమెకు మండిపోయింది. భర్తతో పాటు అతని తల్లిదండ్రులు, మరిది మీద వరకట్నం వేదింపుల కేసు, కులం పేరుతో దూషించారని, మానసిక హింసకు గురి చేశారని ఇలా అనేక సెక్షల కింద ఫ్యామిలీ ప్యాకేజ్ టైపులో ఆమె పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

కాలేజ్ లో పరిచయం

కాలేజ్ లో పరిచయం

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణ తాలుకాలోని కుందూరు గ్రామంలో లోహిత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సవిత (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయి కాలేజ్ లో చేరింది. సవిత కు ఆమె చదువుతున్న కాలేజ్ లో చదువుకుంటున్న లోహిత్ కు పరిచయం అయ్యింది.

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న లవర్స్

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న లవర్స్

10 సంవత్సరాల క్రితం సవిత, లోహిత్ ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని సవిత, లోహిత్ అనుకున్నారు. అయితే సవితను పెళ్లి చేసుకోవడానికి లోహిత్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. 9 సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించిన లోహిత్, సవిత స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు.

భార్యకు హ్యాండ్ ఇచ్చి మాయం అయిన భర్త

భార్యకు హ్యాండ్ ఇచ్చి మాయం అయిన భర్త

భార్య సవితతో కలిసి లోహిత్ సంతోషంగా కాపురం పెట్టాడు. చాలా సంవత్సరాల ప్రేమించి పెళ్లి చేసుకున్న సవితతో లోహిత్ చక్కగా కాపురం చేస్తూ ఆమెతో సంతోషంగా కాలం గడిపాడు. భార్య సవితకు తెలిసే ఆమె భర్త లోహిత్ గ్రామంలో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కొంతకాలం క్రితం భార్య సవితకు హ్యాండ్ ఇచ్చిన లోహిత్ ఆమెకు చెప్పాపెట్టకుండా మాయం అయిపోయాడు.

 భర్త తిరిగి వస్తాడని ఎదురు చూసిన భార్య

భర్త తిరిగి వస్తాడని ఎదురు చూసిన భార్య

భార్య సవిత ఆమె భర్త లోహిత్ ను వెతికిపట్టుకుంది, ఆ సమయంలో లోహిత్, సవిత మద్య గొడవ జరిగింది. లోహిత్ అతని ఇంటికి వెళ్లిపోయాడు. తన భర్త లోహిత్ ఎప్పటికైనా తిరిగి వస్తాడని సవిత అనుకుంది. ఇటీవల సవితకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త లోహిత్ మరో పెళ్లి చేసుకుంటున్నాడని సవితకు తెలిసిపోయింది.

 వేరే అమ్మాయితో నిశ్చితార్థం

వేరే అమ్మాయితో నిశ్చితార్థం

తన భర్త లోహిత్ కు ఇప్పటికే దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగిపోయిందని, పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయని అతని భార్య సవితకు సమాచారం అందింది. నన్ను 9 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని ఇంతకాలం తనతో కాపురం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని సవిత ఆమె భర్త లోహిత్ ను అందరి ముందు నిలదీసింది.

ఫ్యామిలీ ప్యాకేజ్ కేసులు

ఫ్యామిలీ ప్యాకేజ్ కేసులు

లోహిత్ తో పాటు అతని కుటుంబ సభ్యులు సవితను కులం పేరుతో దూషించడంతో ఆమెకు మండిపోయిందని తెలిసింది. భర్త లోహిత్ తో పాటు అతని తండ్రి మల్లికార్జున, తల్లి జయశీల మీద వరకట్నం వేదింపుల కేసు, కులం పేరుతో దూషించారని, మానసిక హింసకు గురి చేశారని ఇలా అనేక సెక్షల కింద ఫ్యామిలీ ప్యాకేజ్ టైపులో ఆమె పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

Recommended Video

    INS Visakhapatnam Features నావికాద‌ళంలోకి... చరిత్రలో నిలిచిపోయేలా| Defense Updates| Oneindia Telugu
    కేటుగాడి పెళ్లి ఢమాల్

    కేటుగాడి పెళ్లి ఢమాల్

    లోహిత్ తో పాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని హాసన్ పోలీసులు తెలిపారు. లోహిత్ కు ఇంతకు ముందే వివాహం జరిగిందని తెలుసుకున్న కొత్త పెళ్లి కూతురు అతని పెళ్లి రద్దు చేసుకుందని పోలీసు అధికారులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+