Cheating: మంత్రి ముఖ్య అనుచరుడు అరెస్టు, బళ్లారి బ్రదర్ పేరు చెప్పి, రియల్ ఎస్టేట్ !

బెంగళూరు: కర్ణాటకలో గతంలో చక్రం తిప్పిన బళ్లారి బ్రదర్స్ లో ఒక్కరైన ఆ రాష్ట్ర ప్రస్తుత మంత్రి బళ్లారి శ్రీరాములు అనుచరుడిగా చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకుని తిరుగుతున్న వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంత్రి బళ్లారి శ్రీరాములు పేరు చెప్పుకుని మోసం చేస్తున్నాడని అతని మీద చీటింగ్ కేసు నమోదు కావడంతో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. గతంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర పేరు చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఇదే మంత్రి శ్రీరాములు ముఖ్య అనుచరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తరువాత అతన్ని విచారణ చేసి వదిలిపెట్టేశారు .ఇప్పుడు కర్ణాటకలో బసవరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే శ్రీరాములు అనుచరుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరులో మంత్రి అనుచరుడు ?

బెంగళూరులో మంత్రి అనుచరుడు ?

కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములకు బళ్లారితో పాటు కర్ణాటకతో సహ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ప్రత్యేక అనుచరులు ఉన్నారు. ఐటీ హబ్ బెంగళూరు సిటీ సమీపంలోని బాగలూరులో ధర్మతేజ్ అనే వ్యక్తి కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని పోలీసులు అంటున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం

రియల్ ఎస్టేట్ వ్యాపారం

బాగలూరుకు చెందిన ధర్మతేజ్ బెంగళూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని సమాచారం. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకుని తిరుగుతున్న ధర్మతేజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఆయన పేరు చెప్పుకుని పలువురికి మోసం చేస్తున్నాడని అతని మీద బెంగళూరులోని కోడిగేహళ్ళి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

మోసం చేశాడని కేసు పెట్టిన ప్రదీప్

మోసం చేశాడని కేసు పెట్టిన ప్రదీప్


కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములు పేరు చెప్పి తనను నిలువునా మోసం చేశాడని ప్రదీప్ అనే వ్యక్తి బెంగళూరులోని కొడిగేహళ్ళి పోలీస్ స్టేషన్ లో ధర్మతేజ్ మీద కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన కొడిగేహళ్ళి పోలీసులు సెప్టెంబర్ 1వ తేదీన బుధవారం ధర్మతేజ్ ను అరెస్టు చేసి విచారణ చేశారు.

మూడు రోజులు రిమాండ్

మూడు రోజులు రిమాండ్

నిందితుడ ధర్మతేజ్ ను కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు న్యాయస్థానం ఆదేశాలతో అతన్ని మూడు రోజులు రిమాండ్ కు తరలించారు. గతంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర పేరు చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఇదే మంత్రి శ్రీరాములు ముఖ్య అనుచరుడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు తరువాత అతన్ని విచారణ చేసి అప్పట్లో వదిలిపెట్టేశారు.

కర్ణాటకలో హాట్ టాపిక్

కర్ణాటకలో హాట్ టాపిక్

కర్ణాటకలో గతంలో బీజేపీలో చక్రం తిప్పిన బళ్లారి బ్రదర్స్ లో ఒక్కరైన ఆ రాష్ట్ర ప్రస్తుత మంత్రి బళ్లారి శ్రీరాములు అనుచరుడిగా చెప్పుకుని తిరుగుతున్న ధర్మతేజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించాడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో బసవరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రి బళ్లారి శ్రీరాములు అనుచరుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+