Chicken roll: చికెన్ రోల్స్ ఇవ్వలేదని చిర్రెత్తిపోయింది, అర్దరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించిన శాడిస్టులు!

బెంగళూరు: ఓ హోటల్ లో చికెన్ రోల్, ఎగ్ రోల్ తో పాటు మాంసాహారం విక్రయిస్తుంటారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ఆ హోటల్ లో విక్రయించే ఆహారం తీసుకుంటున్నారు. హోటల్ లో చాలా మంది పని చేస్తున్నారు. హోటల్ లో పని చేసే సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి, రాత్రిపూట నిద్రపోవడానికి సమీపంలో ఓ ఇంటికి తీసిచ్చారు.

రాత్రిపూట చికెన్ రోల్ ఇవ్వలేదని కోపంతో కొందరు యువకులు హోటల్ సిబ్బంది నివాసం ఉంటున్న ఇంటిలో పెట్రోల్ పోసి నిప్పంటించి వారిని సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

 చికెన్ రోల్స్ ఫేమస్

చికెన్ రోల్స్ ఫేమస్

బెంగళూరు సిటీలోని హనుమంతనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్రిగుప్ప మెయిన్ రోడ్డులోని అశోక్ నగర్ లో కుమార్ హోటల్ ఉంది. ఈ కుమార్ హెటల్ లో చికెన్ రోల్, ఎగ్ రోల్ తో పాటు మాంసాహారం విక్రయిస్తుంటారు. సోమవారం రాత్రి దేవరాజ్, గణేష్ తో పాటు మరో వ్యక్తి కుమార్ హోటల్ దగ్గరకు వెళ్లి మూడు చికెన్ రోల్స్ ఇవ్వాలని చెప్పారు.

చికెన్ రోల్స్ లేవు సార్

చికెన్ రోల్స్ లేవు సార్

చికెన్ రోల్స్ ఖాళీ అయిపోయాయని హోటల్ సిబ్బంది చెప్పారు. ఆ సందర్బంలో హోటల్ సిబ్బందికి, ఆ ముగ్గురికి మాటామాటా పెరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన గణేష్, దేవరాజ్ తదితరులు హోటల్ సిబ్బంది మీద దాడి చేశారు. హోటల్ లో ఆహారపదార్థాలు తీసుకోవడానికి చాలా మంది అక్కడ ఉండటంతో ఇరువురికి నచ్చచెప్పారు.

కసితో క్యాన్ లో పెట్రోల్ తీసుకున్న నిందితులు

కసితో క్యాన్ లో పెట్రోల్ తీసుకున్న నిందితులు

ఆ సందర్బంలో దేవరాజ్, గణేష్ రెచ్చిపోయారు. హోటల్ సిబ్బందితో పాటు హోటల్ దగ్గర ఉన్న వాళ్లు దేవరాజ్, గణేష్ ను చితకబాది అక్కడి నుంచి తరిమేశారు. స్థానికుల దగ్గర మమ్మల్ని కొట్టించారని దేవరాజ్, గణేష్ తదితరులు రగిలిపోయారు. రాత్రి సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లిన దేవరాజ్, గణేష్ తదితరులు క్యాన్ లో కొన్ని లీటర్ల పెట్రోల్ పట్టించుకున్నారు.

రూమ్ లో పెట్రోల్ పోసి నిప్పంటించేశారు

రూమ్ లో పెట్రోల్ పోసి నిప్పంటించేశారు

తరువాత హెటల్ సమీపంలో హోటల్ సిబ్బంది ఉంటున్న రూమ్ దగ్గరకు వెళ్లారు. తలుపు సందులో నుంచి పెట్రోల్ పోసిన దేవరాజ్, గణేష్ నిప్పంటించి పరారైనారు. ఆ సందర్బంలో హోటల్ లో పని చేసే ఓ యువకుడు మేలుకుని ఉండటంతో మంటలు వ్యాపించిన విషయం గుర్తించి అందరూ బయటకు పరుగు తీశారు.

నిద్రపోలేదు కాబట్టి బతికిపోయారు

నిద్రపోలేదు కాబట్టి బతికిపోయారు

స్థానికులు, హోటల్ సిబంది మంటలు అదుపు చేశారు. అప్పటికే రూమ్ లోని కొన్ని వస్తువులకు మంటలు వ్యాపించి బూడిద అయ్యాయని పోలీసులు అన్నారు. హోటల్ సిబ్బంది రూమ్ కు నిప్పంటించిన దేవరాజ్, గణేష్ తదితరుల కోసం గాలిస్తున్నామని హనుమంత నగర పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+