New Year: ఐటీ హబ్ లో న్యూఇయర్ పార్టీలు, క్లబ్ లు, పబ్ లు, ఆపని చేస్తే బెల్ట్ తీస్తాము, ప్రతాప్ రెడ్డి!

బెంగళూరు: 2023కి స్వాగతం పలికేందుకు ఐటీ హబ్ బెంగళూరు సిద్ధమైంది. క్లబ్, పబ్, రిసార్ట్, రెస్టారెంట్ లు అన్నీ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు వీరలెవెల్లో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలో అర్థరాత్రి ఎక్కువగా పార్టీలు జరిగే అవకాశం ఉండటంతో బెంగళూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. న్యూ ఇయర్‌ సందర్బంగా బెంగుళూరులో జరిగే పార్టీలు, వేడుకలకు హాజరౌతున్న వారు బెంగళూరు నగర పోలీసులు విధించిన నియమాలు, అక్షలకు కట్టుబడి ఉండాలి. నియమాలు ఉల్లంఘిస్తే పోలీసులు బెల్ట్ తీస్తామని హెచ్చరించారు.

ప్రతాప్ రెడ్డి ఆదేశాలు

ప్రతాప్ రెడ్డి ఆదేశాలు

బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రతాప్ రెడ్డి న్యూఇయర్ సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని పోలీసు ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్రిస్మస్, న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించే వారు తమ అధికార పరిధి నుండి పోలీసు అనుమతిని తప్పనిసరిగా పొందాలని ప్రతాప్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

పబ్ లు, క్లబ్ లు, రిసార్ట్ ల యాజమాన్యంతో మీటింగ్

పబ్ లు, క్లబ్ లు, రిసార్ట్ ల యాజమాన్యంతో మీటింగ్

బెంగళూరు సిటీ పోలీసు కమీషర్ ప్రతాప్ రెడ్డి ఆయన కార్యాలయంలో హోటళ్లు, క్లబ్బులు, ఇతర పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాటించాల్సిన నిబంధనలను బెంగళూరు సిటీ పోలీసు కమీనర్ ప్రతాప్ రెడ్డి వివరించారు.

మహిళా బౌన్సర్లు ఉండాలి

మహిళా బౌన్సర్లు ఉండాలి

అనుమతి లేకుండా నిర్వహించే పార్టీల నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బెంగళూరు పోలీసులు డిసైడ్ అయ్యారు. న్యూఇయర్ పార్టీలు నిర్వహించుకోవడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, నిర్వాహకులు తప్పనిసరిగా వారు హోస్ట్ చేసే ఈవెంట్‌లు ఎలా ఉంటాయి అని పోలీసు అధికారులకు వివరంగా వివరించాలి. పార్టీలలో డ్రగ్స్, మత్తుమందు ఉపయోగించమని లిఖితపూర్వంగా హామీ ఇవ్వాల్సి ఉంది.

మైనర్లకు లిక్కర్ ఇస్తే బెల్ట్ తీస్తాము

మైనర్లకు లిక్కర్ ఇస్తే బెల్ట్ తీస్తాము

న్యూఇయర్ వేడుకల సమయంలో పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బెంగళూరు సిటీ పోలీసు కమీషర్ ప్రతాప్ రెడ్డి పార్టీల నిర్వహకులకు సూచించారు. న్యూఇయర్ పార్టీల మార్గదర్శకాలు గతేడాది మాదిరిగానే ఉన్నాయని గుర్తు చేశారు. మైనర్లకు మద్యం అందించకూడదు, పార్టీల వేదిక వద్ద మహిళా బౌన్సర్లు కచ్చితంగా ఉండాలని సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి సూచించారని ఓ పబ్ నిర్వహకుడు అన్నారు.

 బెంగళూరులో న్యూఇయర్ పార్టీలు

బెంగళూరులో న్యూఇయర్ పార్టీలు

బెంగళూరులో న్యూఇయర్ పార్టీలకు హాజరుకావడానికి బెంగళూరు ప్రజలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరౌతారు. క్రిస్మస్, న్యూఇయర్ పార్టీలు నిర్వహిస్తున్న నిర్వహకులు ఇప్పటికే ప్యాకేజీల రూపంలో టిక్కెట్లు విక్రయించడం మొదలుపెట్టారు.

డెడ్ లైన్ పెట్టిన సిటీ పోలీసులు

డెడ్ లైన్ పెట్టిన సిటీ పోలీసులు

చాలా మంది ఆన్ లైన్ లో వారి ఈవెంట్ వివరాలు పొందుపరిచి వ్యాపారం మొదలుపెట్టేశారు. న్యూఇయర్ సందర్బంగా అర్దరాత్రి 1 గంట తరువత ఎలాంటి పార్టీలకు అనుమతి లేదని బెంగళూరు సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. బెంగళూరు సిటీలోలోని ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో అదనపు పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+