Student: రాత్రి ఫ్రెండ్స్ కు వీడియో మెసేజ్, 23 అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ఫ్యామిలీ!
బెంగళూరు: కాలేజ్ లో చదువుతున్న 17 ఏళ్ల యువకుడు ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ లో సాటి స్నేహితులతో కలిసి సంతోషంగానే ఉండేవాడు. ఇటీవల కొంతకాలం నుంచి ఆ విద్యార్థి ఓ రకంగా, చాలా మూడీగా ఉంటున్నాడని తెలిసింది. రెండు మూడు రోజుల నుంచి ఆ విద్యార్థి ముందులాగా సాటి స్నేహితులతో సంతోషంగా లేడని తెలిసింది. రాత్రి సోదరుడి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. రాత్రి సోదరుడి కుటుంబ సభ్యులు ఎవరిపాటికి వాళ్లు నిద్రపోయారు. వేకువ జామున 3 గంటల సమయంలో కాలేజ్ విద్యార్థి అతని స్నేహితులు కొందరికి వీడియో సందేశం పంపించాడు.
తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు ఏమీ లేవని, తనను కుటుంబ సభ్యులు సంతోషంగానే చూసుకుంటున్నారని, తాను జీవితాంతంలో ఓ విషయంలో పోరాటం చెయ్యాల్సి వస్తోందని, అందుకే తాను వెళ్లిపోతున్నానని ఆ వీడియోలో విచారం వ్యక్తం చేశాడు. వేకువ జామున 3. 30 గంటల సమయంలో ఆ విద్యార్థి 23వ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
23 అంతస్తు నుంచి కిందకు దూకండంతో పెద్ద శభ్దం రావడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు పరుగున వెళ్లి చేశారు. అప్పటికే విద్యార్థి తల పగిలి తీవ్రగాయాలై అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఇంటర్ విద్యార్థి
బెంగళూరు నగర శివార్లలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అభిషేక్ రాజేష్ (పేరు మార్చడం జరిగింది) ఇంటర్ చదువుతున్నాడు. కాలేజ్ లో చదువుతున్న రాజేష్ ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ లో రాజేష్ సాటి స్నేహితులతో కలిసి సంతోషంగానే ఉండేవాడు. ఇటీవల కొంతకాలం నుంచి కాలేజ్ విద్యార్థి రాజేష్ చాలా మూడీగా ఉంటున్నాడని తెలిసింది.

సోదరుడి ఇంట్లో కాలేజ్ విద్యార్థి
రెండు మూడు రోజుల నుంచి రాజేష్ ముందులాగా సాటి స్నేహితులతో సంతోషంగా లేడని తెలిసింది. రాత్రి రాజేష్ బెంగళూరు నగర శివార్లలోని కోణెణకుంటేలోని సోదరుడి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. రాత్రి రాజేష్ సోదరుడి కుటుంబ సభ్యులు ఎవరిపాటికి వాళ్లు నిద్రపోయారు.

వీడియో పంపించిన కాలేజ్ విద్యార్థి
వేకువ జామున 3 గంటల సమయంలో కాలేజ్ విద్యార్థి రాజేష్ అతని స్నేహితులు కొందరికి వీడియో సందేశం పంపించాడు. తనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు ఏమీ లేవని, తనను కుటుంబ సభ్యులు సంతోషంగానే చూసుకుంటున్నారని, తాను జీవితాంతంలో ఓ విషయంలో పోరాటం చెయ్యాల్సి వస్తోందని, అందుకే తాను వెళ్లిపోతున్నానని ఆ వీడియోలో రాజేష్ విచారం వ్యక్తం చేశాడని సమాచారం. వీడియో చూసిన ఫ్రెండ్స్ రాజేష్ కు ఫోన్లు చేసి అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

23 అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
వేకువ జామున 3. 30 గంటల సమయంలో కాలేజ్ విద్యార్థి రాజేష్ అపార్ట్ మెంట్ లోని 23వ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ లోని 23 అంతస్తు నుంచి రాజేష్ కిందకు దూకండంతో పెద్ద శభ్దం రావడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు పరుగున వెళ్లి చేశారు. అప్పటికే రాజేష్ తల పగిలి తీవ్రగాయాలై అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. రాజేష్ తండ్రి వ్యాపారం చేస్తున్నాడని, రాజేష్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications