Scene reverse: పార్క్ లో నటి వర్కౌట్స్, ఛీ...ఈ డ్రెస్స్ ఏంది,ఢిష్యూం...ఢిష్యూం, కవితా రెడ్డి అరెస్టు
బెంగళూరు/ న్యూఢిల్లీ : పబ్లిక్ పార్క్ లో అసభ్యంగా డ్రెస్ వేసుకుని వర్కౌట్ లు చేస్తున్నదని ఆరోపిస్తూ ప్రముఖ నటి సంయుక్తా హెగ్డేపై నైతిక్ పోలీసు గిరి పేరుతో దాడి చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో కాంగ్రెస్ పార్టీ నేత కవితా రెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. స్నేహితులతో కలిసి పార్క్ లో నా మానానికి నేను వర్కౌట్ లు చేసుకుంటుంటే నువ్వేంది... నీ డ్రెస్ ఏంది అని తన మీద ఢిష్యూం ఢిష్యూం అంటూ దాడి చేసి నానా రచ్చ చేశారని మూడు రోజుల క్రితం నటి సంయుక్తా హెడ్డే ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కవితా రెడ్డి నటి సంయుక్త హెగ్డేకి క్షమాపణ చెప్పినా చివరికి సీన్ రివర్స్ కావడంతో ఆమెను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు.

అగర పబ్లిక్ పార్క్ లో ఏం జరిగింది ?
బెంగళూరు నగరంలోని సర్జాపుర రోడ్డులోని అగర చెరువులో బీబీఎంపీకి చెందిన పబ్లిక్ పార్క్ ఉంది. అగర పబ్లిక్ పార్క్ లో కన్నడ నటి సంయుక్తా హెగ్డే, ఆమె స్నేహితులు కలిసి వర్కౌట్ లు చేస్తున్నారు. అదే సమయంలో పార్క్ లో స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు వాకింగ్ కు వెళ్లారని, యోగా చేసుకోవడానికి వెళ్లారని స్థానికులు అంటున్నారు.

నువ్వేంది... ఈ ఛండాలం డ్రెస్ ఏంది ?
నటి సంయుక్తా హెగ్డే, ఆమె స్నేహితులు పార్క్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కవితా రెడ్డి అదే పార్క్ లోకి వెళ్లారు. ఆ సమయంలో ఇది పబ్లిక్ పార్క్, నువ్వేంది... నీ డ్రెస్ ఏంది, నువ్వు ఇలాంటి ప్లేస్ లో అసభ్యంగా దుస్తులు వేసుకుని వర్కౌట్స్ చేస్తే యువతి, యువకులు, పిల్లలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని కవితా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. ఆ సమయంలో తాను ఇక్కడ ఏమి చేస్తే నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అంటూ నటి సంయుక్తా హెగ్డే కాంగ్రెస్ పార్టీ లీడర్ కవితా రెడ్డిపై విరుచుకుపడ్డారని తెలిసింది.

కాపాడండి.... కాపాడండి
నటి సంయుక్తా హెగ్డే, కాంగ్రెస్ లీడర్ కవితా రెడ్డిల మద్య మాటామాట పెరిగిపోవడంతో పార్క్ లో రచ్చరచ్చ అయ్యిందని తెలిసింది. అదే సమయంలో తన మీద కవితా రెడ్డి, ఆమె అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ నటి సంయుక్తా హెడ్డే ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. ఇదే సమయంలో కవితా రెడ్డి, ఆమె అనుచరుడు అనిల్ రెడ్డి తదితరులు తన మీద దాడి చేశారని ఆరోపిస్తూ నటి సంయుక్తా హెగ్డే స్థానిక హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్షమించండి...... కవితా రెడ్డి
నటి సంయుక్త హెగ్డే ఫిర్యాదు చెయ్యడంతో సోమవారం హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్ లో కవితా రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఇదే సమయంలో తాను పార్క్ లో అలా చేసి ఉండకూడదని, పొరపాటున ఇలా జరిగిందని, తాను నటి సంయుక్తా హెగ్డేకి క్షమాపణలు చెబుతున్నానని కవితా రెడ్డి అన్నారు. కవితా రెడ్డి క్షమాపణలను నటి సంయుక్తా హెగ్డే సైతం అంగీకరించింది. ఈ వివాదం ఇంతటితో వదిలేద్దామని నటి సంయుక్త హెగ్డే, కవితా రెడ్డి అన్నారు.

సీన్ రివర్స్ తో కవితా రెడ్డి అరెస్టు
కవితా రెడ్డి, నటి సంయుక్తా హెగ్డే వివాదం ఇంతటితో సమిసిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. రాజీకావడం తనకు ఇష్టం లేదని, తన మీద ఒత్తిడి చేసి రాజీ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని నటి సంయుక్తా హెగ్డే ఎదురుతిరిగారు. కవితా రెడ్డితో పాటు అనిల్ రెడ్డిని అరెస్టు చెయ్యాలని నటి సంయుక్తా పట్టుబట్టారు. నటి సంయుక్తా హెగ్డేపై నైతిక్ పోలీసు గిరి పేరుతో దాడులు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కవితా రెడ్డిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో నటి సంయుక్తాపై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ రెడ్డి తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications