మంత్రికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చిన ట్రబుల్ షూటర్, తమ్ముడితో అన్నయ్య అసలు కథ !
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరు సిటీలోని పద్మనాభనగర నియోజక వర్గంలో బీజేపీ సీనియన్ నాయకుడు అశోక్ పోటీ చేస్తున్నారు. వరుస విజయాలతో ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వచ్చిన ఆర్. అశోక్ బీజేపీలో సీనియర్ మంత్రిగా పని చేస్తున్నారు. మంత్రి ఆర్. అశోక్ మీద పోటీలో దింపడానికి కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకుల పేర్లు పరిశీలించి క్లైమాక్స్ లో ఓ నిర్ణయానికి వచ్చింది.
పధ్మనాభనగర్ నియోజక వర్గంలో ప్రవాసాంధ్రుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరులో మిని చిత్తూరుగా పేరు తెచ్చుకున్న ఇట్టుమడు ప్రాంతం కూడా ఇదే నియోజక వర్గంలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది పేర్లు పరిశీలించి రఘునాథ్ నాయుడికి కాంగ్రెస్ టిక్కెట్ ప్రకటించింది. రఘునాథ్ నాయుడికి కేపీసీసీ కార్యాలయంలో బీఫామ్ కూడా ఇచ్చారు.

ప్రముఖ వ్యాపారవేత్త రఘనాథ్ నాయుడికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది ఎవరో కాదు. స్వయంగా కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చారు. నామినేషన్ వెయ్యడానికి రఘునాథ్ నాయుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో రఘునాథ్ నాయుడికి ఫోన్ చేసిన డీకే. శివకుమార్ నువ్వు నామినేషన్ వెయ్యకూడదని సూచించారు.
పద్మనాభనగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే. శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ అని ఇంతకాలం ప్రచారం జరిగింది. మంత్రి ఆర్. అశోక్ ను ఎదుర్కోవాలంటే డీకే. సురేష్ రంగంలోకి దిగాలని డీకే. శివకుమార్ నిర్ణయించారని తెలిసింది. అయితే చివరి వరకు ట్విస్టు మీద ట్విస్టులతో ఆ నియోజక వర్గం అభ్యర్థి పేరు పెండింగ్ పడుతూనే వచ్చింది.
కనకపురలో తనతో పోటీకి దిగిన అశోక్ తనను ఓడించడానికి వచ్చిన అశోక్ ను ఓడించాలని డీకే శివకుమార్ డిసైడ్ అయ్యారు. డీకే. శివకుమార్ ఆయన తమ్ముడు డీకే. సురేష్ ను బెంగళూరులోని పద్మనాభనగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపడానికి డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో రఘునాథ్ నాయుడిని నామినేషన్ వెయ్యకుండా చేసి డీకే. సురేష్ ను రంగంలోకి దింపడంతో పద్మనాభనగర అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్నికల హీట్ మామూలుగా లేదు.
మొత్తం మీద డీకే శివకుమార్ మార్క్ రాజకీయంతో పద్మనాభనగర్ నియోజక వర్గంలో రసవత్తర పోరు మొదలైయ్యింది. ఇంకో మ్యాటర్ ఏమిటంటే సొంత అన్నదమ్ముల మీద ఒకేసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే కులానికి చెందిన కర్ణాటక మంత్రి ఆర్. అశోక్ పోటీ చెయ్యడం కూడా ఓ రికార్డు కానుంది. రెండు నియోజక వర్గాల్లో ఒక్కలిగ కులస్తులు ఏ నాయకుడిని ఆదరిస్తారో వేచి చూడాలి.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications