Judge: కోర్టులోకి వెళ్లి జిల్లా జడ్జికి చెప్పు చూపించాడు, నాకే ఫైన్ వేస్తావా?, దెబ్బకు దిగిపోయింది!
బెంగళూరు/చిక్కమగళూరు: కోర్టులో కేసుల విచారణకు చాలా మంది హాజరైనారు. కోర్టులో న్యాయమూర్తి కేసుల వాదనలు వింటున్నారు. కోర్టు హాల్ లో కేసులు వాదనలు వినిపిస్తున్న లాయర్లు చాలా మంది ఉన్నారు. ఆ సందర్బంలో ఓ వ్యక్తి మద్యం సేవించి జిల్లా కోర్టు ఆవరణంలోకి వెళ్లాడు. అందరూ చూస్తున్న సమయంలో కాళ్లకు వేసుకున్న చెప్పు తీసి కోర్టులో కేసులు విచారణ చేస్తున్న జిల్లా జడ్జికి చూపించాడు. నాకే ఫైన్ వేస్తావా ? అంటూ ఆ మందుబాబు చిందులు వేశాడు. కోర్టులో జడ్జికి చెప్పు చూపించడం కలకలం రేపింది.
Kerala:
నరబలి
ముందు
సినీ
ప్రముఖులతో
డాక్టర్
దంపతులు
భేటీ,
లైలా
స్టేట్
మెంట్
లో
?,
షఫీ
తోపు!

కోర్టులో అందరూ బిజీబిజి
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా న్యాయస్థానంలో అందరూ చాలా బిజీబిజీగా ఉన్నారు. కోర్టులో కేసుల విచారణకు చాలా మంది హాజరైనారు. కోర్టులో న్యాయమూర్తి కేసుల వాదనలు వింటున్నారు. కోర్టు హాల్ లో కేసులు వాదనలు వినిపిస్తున్న లాయర్లు చాలా మంది ఉన్నారు. ఆ సందర్బంలో లోకేష్ అనే వ్యక్తి మద్యం సేవించి కోర్టు ఆవరణంలోకి వెళ్లాడు.

జడ్జికి చెప్పు చూపించాడు.... దెబ్బకు దిగిపోయింది
అందరూ చూస్తున్న సమయంలో లోకేష్ అతని కాళ్లకు వేసుకున్న చెప్పు తీసి కోర్టులో కేసులు విచారణ చేస్తున్న జడ్జికి చూపించాడు. నాకే ఫైన్ వేస్తావా ?, నీకు ఎంత ధైర్యం అంటూ పీకలదాక మద్యం సేవించిన లోకేష్ జడ్జి మీద చిందులు వేశాడు. లోకేష్ కోర్టులో జడ్జికి చెప్పు చూపించడం కలకలం రేపింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో?
కోర్టు ఆవరణంలోనే ఉన్న పోలీసులు ఈ దెబ్బకు హడలిపోయి తాగుబోతు లోకేష్ ను అరెస్టు చేశారు. చిక్కమగళూరులోని అరవిందనగర్ లో లోకేష్ నివాసం ఉ:టున్నాడు. నెల రోజుల క్రితం లోకేష్ పీకలదాక మద్యం సేవించిన వాహనం నడుపుతుంటే పోలీసులు పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టులో నువ్వు అపరాదరుసుం కట్లాలని పోలీసులకు సూచించారు.

క్వాటర్ మందు ఎంతపని చేసింది?
కోర్టుకు వెళ్లిన లోకేష్ కు న్యాయమూర్తి ఫైన్ వేశారు. తనకు కోర్టు ఫైన్ వేసిందని రగిలిపోయిన లోకేష్ నెల రోజుల తరువాత మరోసారి పీకలదాక మద్యం సేవించి వెళ్లి జడ్జికి చెప్పు చూపించడంతో ఏకంగా జైలుపాలైనాడు. లోకేష్ కు బెయిల్ కూడా ఇప్పించకూడదని చిక్కమంగళూరులోని లాయర్లు డిసైడ్ అయ్యారు.