బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

COVID-19: రికార్డ్ బ్రేక్, నిన్న ఐటీ హబ్, నేడు కరోనా క్లబ్ ?, ఆంధ్రా మహిళ ఫ్యామిలీలో, టెక్కీ భర్త?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హైదరాబాద్/ ముంబాయి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఏడాది నుంచి కరోనా వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర పరిస్థితి సరేసరి. ఇక మహారాష్ట్రాతో పోటీ అన్నట్లుగా కర్ణాటక తయారౌతోంది. కర్ణాటకలో ఏకంగా 40 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఐటీ హబ్ గా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నేడు కరోనా క్లబ్ అనే పాపాన్ని మూటకట్టుకుంటున్నదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా కోడలు ఇంట్లో అత్తమామలు కరోనాకు బలి కావడం, ఆమె భర్త కరోనా పాజిటివ్ తో ఆసుపత్రి పాలైనాడు.

Marriage: ఇద్దరూ ఇంజనీర్లు, ముహూర్తాకి ముందే పెళ్లి, కట్ చేస్తే వారం రోజుల్లో పెళ్లి కొడుకు ?Marriage: ఇద్దరూ ఇంజనీర్లు, ముహూర్తాకి ముందే పెళ్లి, కట్ చేస్తే వారం రోజుల్లో పెళ్లి కొడుకు ?

24 గంటల్లో అల్లకల్లోలం

24 గంటల్లో అల్లకల్లోలం

భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ? అనే భయంతో ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు హడలిచస్తున్నారు.

మహారాష్ట్రకు కర్ణాటక పోటీ ?

మహారాష్ట్రకు కర్ణాటక పోటీ ?

గత ఏడాది కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ మొదలైప్పటి నుంచి మహారాష్ట్ర పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానంలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో కూడా అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. మహారాష్ట్రాతో పోటీ అన్నట్లుగా కర్ణాటక ఇప్పుడు తయారౌతోంది. కర్ణాటకలో గత 24 గంటల్లో ఏకంగా 40, 990 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

నిన్న ఐటీ హబ్..... నేడు కరోనా క్లబ్ ?

నిన్న ఐటీ హబ్..... నేడు కరోనా క్లబ్ ?

ప్రపంచ దేశాల్లో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరం పరిస్థితి రానురాను దారుణంగా తయారౌతోంది. గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో ఏకంగా 19, 353 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరులో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 162 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిన్న ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీ నేడు కరోనా క్లబ్ అయ్యిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 మూర్ఖులు ఎక్కువ అయ్యారు ?

మూర్ఖులు ఎక్కువ అయ్యారు ?

బెంగళూరులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా మంది మూర్ఖులు (తెలుగు ప్రజలు కాదు) చెప్పిన మాట వినకుండా ముఖాలకు మాస్కులు వేసుకోకుండా భౌతిక దూరం పాటించుకుండా ఇష్టం వచ్చినట్లు తిరగడం వలనే కరోనా వైరస్ వ్యాపిస్తోందని గత ఏడాది నుంచి వెలుగు చూస్తూనే ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర తరువాత కర్ణాటక రెండో స్థానంలో ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో కర్ణాటక 23.03 శాతం ఉందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అంచనా వేయ్యచ్చు,

ఆంధ్రా ఆడపడుచు కష్టాలు

ఆంధ్రా ఆడపడుచు కష్టాలు


ఆంధ్రప్రదేశ్ కు చెందిన 27 ఏళ్ల గర్భిణి మహిళ అత్తమామలు కోవిడ్ పాజిటివ్ తో బెంగళూరులోని ఎంఆర్నీఎస్ ఏరియాలో ప్రాణాలు వదిలేశారు. గర్భిణి మహిళ భర్త టెక్కీ ( 32) కూడా కోవిడ్ పాజిటివ్ తో బెంగళూరులోని రాజాజీనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు ఆయన తల్లిదండ్రులు మరణించారు అనే విషయం ఇంకా తెలీదని ఆయన భార్య విలపిస్తున్నది.

 నాభర్త బతుకుతాడు

నాభర్త బతుకుతాడు

అత్తమామల అంత్యక్రియలను ఫిజియోథెరఫిస్టు అయిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన గర్భిణి మహిళ నిర్వహించడంతో అందరూ చలించిపోయారు. కుటుంబ సభ్యులకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆమె వెంటనే బెంగళూరు చేరుకుంది. ఇంతలోనే అత్తమామలు కోవిడ్ తో చనిపోయారని చెప్పారని, నా భర్త బతుకుతాడని వైద్యులు అంటున్నారని ఆంధ్రప్రదేశ్ కు చెందిన బోరన విలపిస్తున్నారు.

English summary
COVID-19: A day after India reported a global record of 4 lakh Covid-19 cases in a single day, Karnataka’s active tally crossed that number on Saturday, with the addition of 40,990 infections in a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X