Devil sketch: దెయ్యం పట్టిందని నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, కాంచనా కూడా కాపాడలేదు !
బెంగళూరు/ బళ్లారి/ చిత్రదుర్గ: మూడనమ్మకాలు అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అనేక మంది అమాయకులకు కొంత మంది కుచ్చుటోపీ పెడుతున్నారు. అమాయకులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తూ కొందరు మంత్రవాదులు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓ యువతికి దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాన్ని మేము వదిలిస్తామని ఓ మంత్రగాడు, అతని కొడుకు యువతి తల్లిదండ్రులను నమ్మించారు. మా మాట వినకుంటే కాంచనా కూడా మీ కూతురిని కాపడలేదని భయపెట్టారు. నీళ్లలో మత్తుమందు కలిపి యువతికి ఇచ్చిన మంత్రగాడి కొడుకు ఆమె మత్తులోకి జారుకున్న తరువాత నగ్నం చేసి రేప్ చేసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

ఫేమస్ మాటల మంత్రగాడు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని భరమసాగర గ్రామంలో 19 ఏళ్ల రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. ఇదే భరమసాగర గ్రామంలో శరణప్ప అనే మంత్రగాడు నివాసం ఉంటున్నాడు. అమాయకులను ఏదో ఒకరకంగా నమ్మించి వారి మూడనమ్మకాలను సొమ్ము చేసుకోవడానికి శరణప్ప ఊరి చివరిలోని నిర్జన ప్రదేశంలో, స్మశానంలో మంత్రాలు వేస్తూ పాపులర్ అయ్యి డబ్బులు సంపాధిస్తూ కాలం గడుపుతున్నాడు.

తండ్రికి కొడుకు అసిస్టెంట్
మంత్రగాడు శరణప్ప కొడుకు భాస్కర్. అమయాకులు చిక్కినప్పుడు తండ్రి శరణప్ప మంత్రాలు తంత్రాలు వెయ్యడానికి వెళ్లిన సమయంలో అతని వెంట వెలుతున్న భాస్కర్ కూడా ముగ్గులు వేసి అందులో నిమ్మకాయలు పెట్టి నానా హంగామా చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే తండ్రి శరణప్పకు అతని కొడుకు భాస్కర్ అసిస్టెంట్ అనమాట.

మీ కూతురికి దెయ్యం పట్టింది..... కాంచనా కూడా కాపడలేదు
రూపాకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా రూపాకు వ్యాధి నయం కాలేదని తెలిసింది. మీ కుమార్తె రూపాకు దెయ్యం పట్టింది, అమావాస్య రోజు ఊరిబయట క్షుద్రశక్తులకు పూజలు చేస్తే రూపాకు పట్టిన దెయ్యం వెళ్లిపోతుందని, లేదంటే ఆ కాంచనా కూడా మీ కూతురిని కాపాడలేదని సినిమా డైలాగులు చెప్పిన శరణప్ప రూపా తల్లిదండ్రులను భయపెట్టాడు. సరే మంచి జరుగుతుందంటే మేమే ఎందుకు కాదంటాము అంటూ రూపా తల్లిదండ్రులు ఓకే అన్నారు.

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్
రూపాను ఊరిబయటకు తీసుకెళ్లిన మంత్రగాడి కొడుకు భాస్కర్ ఆమెకు నీళ్లు ఇచ్చి ఇది తీర్థం అని చెప్పాడు. ముందుగానే నీళ్లలో మత్తుమందు కలపడంతో ఆ నీళ్లు తాగిన రూపా స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో రూపాను నగ్నంగా చేసిన మంత్రగాడి కొడుకు భాస్కర్ ఆమె మీద లైంగిక దాడి చేశాడు. రూపా నగ్నంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు.

వీడి అంతు చూడండి
పదేపదే నగ్న వీడియోలు చూపించి తన కామం తీర్చాలని బెదరిస్తున్న భాస్కర్ వేధింపులు ఎక్కువ కావడంతో రూపా జరిగిన విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. రూపా, ఆమె తల్లిదండ్రులు చిత్రదుర్గ జిల్లా ఎస్పీ జి. రాధికాను కలిసి భాస్కర్ అంతు చూడాలని ఫిర్యాదు చేశారు. ఐదు నెలల క్రితం ఇలాగే 15 ఏళ్ల అమ్మాయికి దెయ్యం పట్టిందని నమ్మించిన భాస్కర్ ఆమెపై అత్యాచారం చేశాడని, ఇప్పుడు తన జీవితంతో ఆడుకుంటున్నాడని బాధితురాలు రూపా జిల్లా ఎస్పీ రాధికకు ఫిర్యాదు చేసింది. భాస్కర్ పరారుకావడంతో అతని కోసం చిత్రదుర్గ పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications