Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug Mafia: ఈడీ ఎంట్రీతో ట్విస్ట్ !, వీరేన్ ఖన్నా ఎవరు ?, విదేశీయులతో టచ్, రాగిణి, సంజనాతో ఏంపని!

బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ బ్యూటీలు, వ్యాపారుల అరెస్టుల తరువాత ఈడీ అధికారుల కన్ను కర్ణాటక మీదపడింది. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలోకి అడుగుపెట్టి డ్రగ్స్ మాఫియా స్టోరీ పిన్ టూ పిన్ తెలుసుకోవడానికి ఈడీ అధికారులు సిద్దం అయ్యారని సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ ఖన్నా హైఫై పార్టీలు నిర్వహించి విదేశీయులతో లింక్ పెట్టుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని వెలుగు చూడటం, అదే సమయంలో అతని ఇంటిలో పోలీసు అధికారుల యూనీఫాం చిక్కడంతో అతని వ్యవహారం ఏమిటో తేల్చుకోవాలని ఈడీ అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది. సినీతారలు సంజనా, రాగిణి ద్వివేదిలతో వీరేన్ ఖన్నాకు ఏం పని ? అంటూ అధికారుల ఆరా తీస్తున్నారు.

వీరేన్ ఖన్నా సమాన్యుడు కాదు

వీరేన్ ఖన్నా సమాన్యుడు కాదు

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే వ్యాపారవేత్త వీరేన్ ఖన్నాను అరెస్టు చేశారు. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబాయిలోని వీరేన్ ఖన్నా ఇంటిలో పోలీసులు సోదాలు చేసిన సమయంలో అతని ఇంటిలో పోలీసు అధికారులు వేసుకునే యూనీఫాం బయటపడింది. వీరేన్ ఖన్నా ఇంటిలో పోలీసు అధికారులు వేసుకునే యూనీఫాం ఎందుకు ఉంది ? అంటూ బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సెలబ్రిటీలు, వీఐపీలతో పార్టీలు

సెలబ్రిటీలు, వీఐపీలతో పార్టీలు

ఓ ఐపీఎస్ అధికారితో వీరేన్ ఖన్నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో వీరేన్ ఖన్నా పలువురు సెలబ్రిటీలు, సినీతారలు, వీఐపీలతో విలాసవంతమైన పార్టీలు నిర్వహించి డ్రగ్స్ సరఫా చేస్తున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

వీరేన్ ఖన్నా డ్రగ్స్ డీలర్!

వీరేన్ ఖన్నా డ్రగ్స్ డీలర్!

సెలబ్రిటీలు, వీవీఐపీలు, వ్యాపారుల కోసం హై ప్రొఫైల్ పార్టీలు నిర్వహిస్తున్న వీరేన్ ఖన్నా విదేశీయులతో లింక్ పెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తెప్పిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న అధికారులు వీరేన్ ఖన్నాను అరెస్టు చెయ్యడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగుతున్నారని తెలిసింది.

ఖన్నా ఏం వ్యాపారాలు చేస్తున్నాడు?

ఖన్నా ఏం వ్యాపారాలు చేస్తున్నాడు?

డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వీరేన్ ఖన్నాపై ఈడీ అధికారుల కన్నుపడింది. అసలు వీరేన్ ఖన్నా ఎవరు ? అతను ఏమేమి వ్యాపారాలు చేస్తున్నాడు ?, విదేశీయులతో అతనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ?, హవాలా సొమ్ముతో అతని ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అంటూ పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఈడీ అధికారులు నిర్ణయించారని తెలిసింది.

ఢిల్లీ టూ బెంగళూరు లింక్

ఢిల్లీ టూ బెంగళూరు లింక్

వీరేన్ ఖన్నాను ఢిల్లీలో అరెస్టు చేసిన తరువాత అతన్ని బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఢిల్లీలో వీరేన్ ఖన్నాకు ఏం పని అని ఈడీ అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారని సమాచారం. మొత్తం మీద ఈడీ అధికారుల ఎంట్రీతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ? అనే విషయం అంతు చిక్కడ లేదని కొందరు న్యాయనిపుణలు అంటున్నారు.

మేడమ్ రాగిణి కస్టడీ ఎండ్

మేడమ్ రాగిణి కస్టడీ ఎండ్

డ్రగ్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ద్వివేది పోలీసు కస్టడీ గడుపు నేటితో (శుక్రవారం) ముగిసిపోతుంది. నటి రాగిణిని మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యడానికి పోలీసులు సిద్దం అవుతారా ? లేక కోర్టు ముందు హాజరుపరిచి ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలిస్తారా ? అనే విషయంపై ఉత్కంఠనెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+