Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: నటి అనికా దెబ్బకు ఢిల్లీలో మరో వికెట్, రెహమాన్ తో లింక్, స్యాండిల్ వుడ్ లో కలకలం!

న్యూఢిల్లీ/ బెంగళూరు: స్యాండిల్ వుడ్ తో పాటు బెంగళూరులో కలకలం రేపిన డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులు ఢిల్లీలో ఎఫ్. అహమ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇప్పటికే బెంగళూరులో అరెస్టు అయిన నటి డి. అనికా అలియాస్ బిమనిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

ముంబాయి డ్రగ్స్ డీలర్స్ ఇచ్చిన సమాచారం, ముంబాయిలో అరెస్టు అయిన రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు అనికాను అరెస్టు చేశారు. స్యాండిల్ వుడ్ కు చెందిన నటులు, సంగీత కళాకారులకు లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలోనే పోలీసులు ఢిల్లీలో ఒకరిని అరెస్టు చెయ్యడంతో కలకలం రేపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో ఇప్పుడు అనేక మంది సెలబ్రిటీల గట్టు బయటకు వస్తోంది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ దందా వ్యవహారం బయటకు రావడంతో ముంబాయిలో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇదే సమయంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మత్తుపదార్థాలు ఉపయోగించేవాడని పలువురు ఆరోపించడం, దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆ కోణంలో విచారణ చెయ్యడం మొదలుపెట్టారు.

 రెహమాన్ దెబ్బతో అనికాకు వల

రెహమాన్ దెబ్బతో అనికాకు వల

ముంబాయిలో ఎన్ సీబీ అధికారులు డ్రగ్స్ డీలర్ రెహమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రెహమాన్ అనేక ఏళ్లు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని వెలుగు చూడటంతో ఎన్ సీబీ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇదే సమయంలో రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో నటి అనికా అలియాస్ బిమనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రెహమాన్ నటి అనికా పెళ్లి చేసుకున్నారని ఎన్ సీబీ అధికారులు సమాచారం సేకరించారు.

ఢిల్లీలో అహమ్మద్

ఢిల్లీలో అహమ్మద్

బెంగళూరు డ్రగ్స్ మాఫియాకు సంబంధించిన కేసులో విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులు ఢిల్లీలో ఎఫ్. అహమ్మద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కారు డ్రైవర్ ముసుగులో బెంగళూరులో మహమ్మద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని ఎన్ సీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. నిందితుడు మహమ్మద్ నుంచి మూడు కేజీల 500 గ్రాముల మరిజువా అనే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

కెనడా టూ భారత్ !

కెనడా టూ భారత్ !

కెనడా నుంచి భారత్ వస్తున్న డ్రగ్స్ ను అహమ్మద్ గ్యాంగ్ అనేక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని ఎన్ సీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ముంబాయి నుంచి బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఎన్ సీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. పక్కా సమాచారంతోనే ఢిల్లీలో ఎఫ్. అహమ్మద్ ను అరెస్టు చేశామని అధికారులు అంటున్నారు. బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఎన్ సీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
    అనికా దెబ్బకు సెలబ్రిటీలకు హడల్

    అనికా దెబ్బకు సెలబ్రిటీలకు హడల్

    నటి అనికా అరెస్టుతో స్యాండిల్ వుడ్ లోని కొందరు నటులకు, సంగీత కళాకారులకు వణుకు పడుతోందని తెలిసింది. నటి అనికాతో లింక్ పెట్టుకున్న కొందరు సెలబ్రిటీలు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సేవిస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పక్కా సమాచారంతోనే సెలబ్రిటీల విషయంలో చర్యలు తీసుకోవాలని, కొంతకాలం వేచిచూడాలని ఎన్ సీబీ అధికారులు బావిస్తున్నారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+