Drug mafia: డ్రగ్స్ కేసులో Bigg Boss కంటెస్టెంట్ అరెస్టు, నటితో లింక్, ఏం జరిగిందంటే, టేస్ట్ !
ముంబాయి/ బెంగళూరు: దేశవ్యాప్తంగా కుదిపేసిన డ్రగ్స్ మాఫియా కేసులో బాలీవుడ్, స్యాండిల్ వుడ్ స్టార్స్ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో Bigg Boss షోలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్ ని డ్రగ్స్ కేసు దందా కేసులో ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్ననారు. డ్రగ్స్ దందా వెలుగు చూసిన మొదట్లోనే బెంగళూరులో అరెస్టు అయిన నటి అనికా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు బిగ్ బాస్ షోలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్ అరెస్టు కావడం కలకలం రేపింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ చాలా డిఫరెంట్ రావడం మరో విశేషం.

కిలాడీ నటి అనికా
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు తరువాత ముంబాయి, బెంగళూరులో డ్రగ్స్ మాఫియా వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇదే సమయంలో బెంగళూరులో సుమారు రూ. 1 కోటి విలువైన డ్రగ్స్ ను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి నటి అనికాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఆ రోజు ఆడం పాషా ఏం చెప్పాడు ?
బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఆడం పాషా చాలా పాపులర్ అయ్యాడు. బెంగళూరులో నటి అనికాను అరెస్టు చేసిన తరువాత బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన ఆడం పాషా మీడియాతో మాట్లాడాడు. నేను అనికా చాలా క్లోజ్, ఆమెతో కలిసి నేను చాలా కాలం తిరిగాను అని ఆడం పాషా అన్నారు. అయితే నటి అనికా డ్రగ్స్ సేవిస్తుందని, ఆమె డ్రగ్స్ విక్రయిస్తుందని మాత్రం తనకు తెలీదని ఆడం పాషా స్పష్టం చేశారు.

ఎన్ సీబీ ఎంట్రీతో పాషాకు రంగులరాట్నం
డ్రగ్స్ మాఫియాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ? అంటూ ఎన్ సీబీ అధికారులు ఆరా తీశారు. ఎన్ సీబీ అధికారుల విచారణలో నటి అనికా అనేక విషయాలు బయటపెట్టింది. నటి అనికా ఇచ్చిన సమాచారం మేరకు బిగ్ బాస్ ఫేమ్ ఆడం పాషాను అరెస్టు చేశారు. నటి అనికా దగ్గర ఆడం పాషా డ్రగ్స్ కొనుగోలు చేశాడని ఎన్ సీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఆడం పాషా ఎవరంటే ?
నటి అనికా దగ్గరే ఆడం పాషా డ్రగ్స్ కొనుగోలు చేసి సేవించేవాడని ఎన్ సీబీ అధికారుల విచారణలో వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేశారు. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన ఆడం పాషా తృతీయ లింగ సంపర్కుడు (థర్డ్ జెండర్స్) అని వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొత్తం మీద డ్రగ్స్ దందా కేసులో ఇప్పటికే నటీ నటులతో పాటు ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ థర్డ్ జెండర్స్ కూడా అరెస్టు కావడంతో ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అంటూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications