Drug racket: నన్ను బకరా చేసి సంకనాకించేశారు, సంజనా ఫైర్, గ్యారెంటీ లేదు, నాతల్లే, నంగనాచి !
బెంగళూరు/ ముంబాయి: డ్రగ్ మాఫియా కేసు విచారణ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనాలకు రక్త పరీక్షలు చేసి వారి అసలు బండారం బయటకు తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవు, ప్రజలు, మీడియా ముందు నన్ను బకరాను చేసి నిలబెట్టి సంకనాకించేశారు, నేను రక్తపరీక్షలు చేసుకోను, రక్త పరీక్షలు చేసినా అది నా రక్తమే అనడానికి గ్యారెంటీ, సాక్షాలు ఏమిటి ? నాకు ఎవ్వరిమీద నమ్మకం లేదు, నా జీవితాన్ని సంకనాకించేశారు అంటూ నటి సంజనా ఆసుపత్రిలో నానా రచ్చచెయ్యడంతో పోలీసులు హడలిపోయారు. నటి సంజనా రచ్చ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయ్యో పాపం అని కొందరు అంటుంటే, తప్పు చేసి దొరికిపోతే ఇంతకంటే రసవత్తరమైన డ్రామా ఏముటుంది, మీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, నువ్వు నంగనాచి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

సంజనా, రాగిణి డ్రగ్స్ సేవించారు !
స్యాండిల్ వుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) బహుబాష నటీమణులు రాగిణి ద్వివేది, సంజనాలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో రాహుల్, వీరేన్ ఖన్నా, ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు. నటి రాగిణి, సంజనా డ్రగ్స్ సేవించామని అంగీకరించారని ఇటీవల పోలీసులు ఆరోపించారు.

రక్త పరీక్షలు చేస్తారా ?.... సంజనా చిందులు !
బహుబాష నటి సంజనాకు రక్తపరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. ఆ సమయంలో రక్తపరీక్షలు చెయ్యడానికి మొండికేసిన నటి సంజనా నానా రచ్చ చేసింది. నన్ను అనవసరంగా అరెస్టు చేశారు, నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవు, నేను ఎందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పండి ? అంటూ వైద్యుల ముందు సంజనా చిందులు వేసింది.

నన్ను బకరా చేసి నా జీవితాన్ని సంకనాకించేశారు
డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న పోలీసులు అనవసరంగా నన్ను అరెస్టు చేసి ప్రజలు, మీడియా ముందు బకరాను చేశారని నటి సంజనా సంచలన ఆరోపణలు చేశారు. నన్ను బకరాను చేసి మీడియా ముందుకు తీసుకు వచ్చి నాజీవితాన్ని సంకనాకించేశారు అంటూ నటి సంజనా మండిపడుతున్నారు.

ఆ రక్తం నాదే అని గ్యారెంటీ ఏమిటి ?
ఆసుపత్రిలో వైద్యులు నటి సంజనాకు రక్తపరీక్ష్లలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఆ సమయంలో ఎదురుతిరిగిన సంజనా అసలు నన్ను ఎందుకు అరెస్టు చేశారు చెప్పండి ?, నేను రక్తపరీక్షలు చేయించుకోను, ఒకవేళ నా రక్తం బలవంతంగా సేకరించి మీరు పరీక్షలు చేసినా ఆ రక్తం నాదే అని గ్యారెంటీ ఏమిటి ?, నాకు పోలీసులు, వైద్యుల మీద నమ్మకం లేదు అంటూ సంజనా ఆవేశంతో ఊగిపోయింది.

నేను ఎవరికో ఫోన్ చేస్తే వాళ్లు ఎవరికో ఫోన్ చేశారు
నేను ఎవ్వరికీ ఫోన్ చెయ్యలేదని నటి సంజనా అంటున్నారు. ఒకవేళ నేను ఎవరికైనా ఫోన్లు చేసి ఉంటే వాళ్లు ఎవరెవరికో ఫోన్లు చేస్తే నాకేం సంబంధం చెప్పండి, నాకు వ్యతిరేకంగా మీదగ్గర ఒక్కసాక్షం కూడాలేదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేస్తారు చెప్పండి అంటూ సీసీబీ పోలీసుల ముందు నటి సంజనా రచ్చరచ్చ చేసిన వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది.
Recommended Video

ఆ బుద్ది ముందే ఏమైయ్యింది తల్లి ?
నాకు రక్తపరీక్షలు చట్టపరంగా చెయ్యాలి తప్పా బలవంతంగా కాదు, మీరు ఇలా చెయ్యడం చట్టపరంగా నేరం అంటూ సంజనా పోలీసులకే నీతులు చెబుతున్న వీడియో చూసిన నెటిజన్లు అయ్యో తల్లి నీకు ఎంత కష్టం వచ్చింది అంటూ కొందరు కామెట్లు పెడితే మరికొందరు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి, ఆ బుధ్ది ముందే ఉండాలి, నంగనాచిలా డ్రామాలు ఆడుతున్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications