Drugs mafia: నటి సంజనాను షాక్, క్రైమ్ బ్రాంచ్ అదుపులో మేడమ్, బిఎండబ్లూ కారు, మొబైల్స్ సీజ్ !
బెంగళూరు/ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా దెబ్బకు స్యాండిల్ వుడ్ సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే బహుబాష నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) మరో బ్యూటీ క్వీన్, బహుబాష నటి సంజనా గర్లాని అలియాస్ సంజనాకు షాక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని ఇందిరానగర్ లోని సంజనా ఫ్లాట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సీసీబీ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఆమె బీఎంబడ్ల్యూ కారు స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వీరేష్ ఖన్నా, రాహుల్ ఇచ్చిన సమాచారం మేరకు కోర్టు అనుమతితో నటి సంజనాకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.

దేవుడు కరుణించలేదు
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యూటీక్వీన్ సంజనా గర్లాని తాను ఏ తప్పు చెయ్యలేదని, తనకు డ్రగ్స్ దందాకు ఎలాంటి సంబంధం లేదని కొన్ని రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. మంగళవారం ఉదయం బెంగళూరులో వరుణదేవుడు కరునించడంతో చిరుజల్లులు కురుస్తుండటంతో చల్లటి వాతావరణం ఉంది. అయితే నటి సంజనాపై దేవుడు కరుణించకపోవడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

మేడమ్.... మేడమ్.... ఓపెన్ ది డోర్
బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) సీనియర్ పోలీసు అధికారులు అంజుమాల, పునీత్ తదితరులు మంగళవారం ఉదయం బెంగళూరు సిటీలోని ఇందిరానగర్ లోని నటి సంజనా అలియాస్ సంజనా గర్లాని నివాసం ఉంటున్న ఫ్లాట్ దగ్గరకు వెళ్లారు. కాలింగ్ బెల్ ఆన్ చేసిన పోలీసు అధికారులు మేడమ్... మేడమ్.... ఓపెన్ ది డోర్ అని చెప్పారు. ఫ్లాట్ తలుపులు తీసిన సంజనా కుటుంబ సభ్యులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను చూసి షాక్ కు గురైనారు.

బిఎండబ్ల్యూ కారు.... మొబైల్ ఫోన్లు
సంజనా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించారు. బహుబాష నటి సంజనా ఉపయోగిస్తున్న బిఎండబ్ల్యూ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అర్చనా గర్లాని పేరుతో బిఎండబ్ల్యూ కారు రిజిస్టర్ అయ్యిందని పోలీసులు గుర్తించారు. సంజనా గర్లానికి అర్చనా గర్లాని అనే మరో పేరు ఉందా ? లేక ఈ అర్చనా గర్లాని ఎవరు ? అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

పోలీసుల అదుపులో సంజనా
నటి సంజనా ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బెంగళూరులోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి పిలుచుకుని వెళ్లారు. కోర్టు అనుమతితో సర్చ్ వారెంట్ తీసుకుని నటి సంజనా గర్లాని ఇంటిలో సోదాలు చేశామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ మీడియాకు చెప్పారు. నటి సంజనాకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని పోలీసు అధికారులకు కొన్ని సాక్షాలు చిక్కాయని తెలిసింది.

రాహుల్, ఖన్నా, రాగిణి దెబ్బ
డ్రగ్స్ మాఫియా కేసుకు సంబంధించి ఇప్పటికే వీరేన్ ఖన్నా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, బెంగళూరులోని వీరేన్ ఖన్నా ఇంటిలో పోలీసులు కొన్ని సాక్షాలు సేకరించారు. ఇదే సమయంలో నటి సంజనా క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ ను అరెస్టు చేశారు. రాహుల్, వీరేన్ ఖన్నా ఇచ్చిన సమాచారం మేరకు నటి సంజనా ఇంటిపై పోలీసులు దాడులు చేశారని తెలిసింది.
Recommended Video

నిన్న రాగిణి, నేడు సంజనా, రేపు ?
గత వారం బహుబాష నటి, స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ రాగిణి ద్వివేదిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. స్యాండిల్ వుడ్ క్వీన్స్ రాగిణిని నిన్న అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు నటి సంజనాను అదుపులోకి తీసుకోవడంతో వీరితో లింక్ ఉన్న మరికొందరు నటీనటులు హడలిపోతున్నారని తెలిసింది. మొత్తం మీద బెంగళూరు డ్రగ్స్ దందా కేసు రోజుకో మలుపు తిరగడంతో పలువురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది.












Click it and Unblock the Notifications