Drugs mafia: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ లాగా నన్నూ చంపేస్తారా ? హీరోయిన్ ఫైర్, చూడండి !

బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగా నేను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలా ? నన్నూ అలాగే చంపేస్తారా ? అంత వరకు నన్ను వదలిపెట్టరా ? నేను ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా ? నా చావు మీరు కోరుకుంటున్నట్లు ఉంది అంటూ ప్రముఖ నటి సంజనా మీడిపై మండిపడ్డారు. స్యాండిల్ వుడ్ నటీనటులకు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడం, ఆ జాబితాలో సంజనా పేరు ఉండటంతో వివరణ కోరిన మీడియాపై బహుబాష నటి సంజనా చిందులు వేసింది. ఇదే సమయంలో నటి రాగిణి ద్వివేదిని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చెయ్యడంతో నటి సంజనా సహనం కోల్పోయి మీడియాపై శివతాండవం చేస్తోంది.

హీరోయిన్ ఫ్రెండ్ కు బెండ్

హీరోయిన్ ఫ్రెండ్ కు బెండ్

స్యాండిల్ వుడ్ లో ఓ వెలుగు వెలిగి తెలుగు, తమిళ బాషల్లో నటించిన హీరోయిన్ సంజనా ఫ్రెండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్టు చేశారు. మీ స్నేహితుడు రాహుల్ ను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు, ఈ విషయంలో మీరు ఏం చెబుతారు ? అంటూ బెంగళూరులో మీడియా హీరోయిన్ సంజనాను ప్రశ్నించింది.

 ఉరి వేసుకుని చచ్చిపోతా.... జాగ్రత్త

ఉరి వేసుకుని చచ్చిపోతా.... జాగ్రత్త

స్యాండిల్ వుడ్ కు డ్రగ్స్ దందాకు సంబంధం ఉందని మీరు చెప్పకండి, అన్నీ మీరే ఊహించుకుంటున్నారు, డ్రగ్స్ దందాలో నన్ను లాగకండి మీకు దండం పెడుతాను అంటూ హీరోయిన్ సంజనా మీడియాకు మనవి చేసింది. డ్రగ్స్ దందాకు తనకు సంబంధం ఉందని మీరు పదేపదే ప్రశ్నిస్తే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటా అంటూ హీరోయిన్ సంజనా మీడియాను బెదిరించింది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ గతి నాకు పడుతుంది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ గతి నాకు పడుతుంది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను సైతం ఇలాగే ప్రశ్నలతో వేధింపులకు గురి చెయ్యడంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ,అదే గతి నాకు పట్టాలని మీరు కోరుకుంటున్నారా ? అంటూ నటి సంజనా మీడియాపై ఎదురుదాడికి దిగింది. తన పని తాను చేసుకోనివ్వండి, డ్రగ్స్ దందాకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ నటి సంజనా మీడియా ముందు చిందులు వేసింది.

 రాహుల్ మంచోడు.... అంతే !

రాహుల్ మంచోడు.... అంతే !

బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన రాహుల్ తనకు మూడు సంవత్సరాలుగా పరిచయం ఉన్నాడని, అతను కామన్ మెన్, చాలా మంచోడు అని మాత్రమే తనకు తెలుసని నటి సంజనా అన్నారు. అంతే కాని రాహుల్ కు డ్రగ్స్ దందాతో లింక్ ఉందా ? లేదా ? అనే విషయం తనకు తెలీదని నటి సంజనా అన్నారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనకు ఇంత వరకు నోటీసులు ఇవ్వలేదని, తనను పోలీసులు సంప్రధించలేదని, ఒకవేళ పోలీసులు సంప్రధిస్తే తాను చట్టపరంగా విచారణ ఎదుర్కొంటానని నటి సంజనా మీడియాకు చెప్పారు. మొత్తం మీద మీడియా ముందు శివతాండవం చేసిన నటి సంజనా సహనం కోల్పోయి మాట్లాడుతోందని ప్రజలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+