జై పాతళ భైరవి, తాళాలు ఎక్కడరా డింబకా ?, స్టాంగ్ రూమ తాళాలు మాయం, గోవింద!

బెంగళూరు/సూరత్కల్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ దేశం మొత్తం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన 2,165 మంది రాజకీయ భవిష్యత్తు ఈరోజు తేలిపోతుంది. మే 10వ తేదీన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగిన తరువాత ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ ల్లో భద్రపరిచి ఆ రూమ్ ల బయట తాళాలు వేశారు.

Karnataka Assembly Election Results 2023

స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎన్నికల అధికారులు, పోలీసుల దగ్గర భద్రంగా పెట్టారు. కర్ణాటకలోని అన్ని స్ట్రాంగ్ రూమ్ లు తాళాలు శనివారం ఉదయం తీశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైయ్యింది. దక్షిణ కన్నడ జిల్లాలోని సూరత్కల్ లోని స్ట్రాంగ్ రూమ్ లో 8 అసెంబ్లీ నియెజక వర్గాల ఈవీఎంలు భద్రపరిచారు.

ఉదయం సూరత్కల్ లోని స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు చేరుకున్న అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అసలు మ్యాటర్ ఏమిటంటే సూరత్కల్ లోని స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనపడటం లేదని తెలుసుకున్న సిబ్బంది. పలు పార్టీల ఏజెంట్ లు బిత్తరపోయారు. మీ దగ్గరే స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఉన్నాయని ఓ అధికారి అంటే లేదు మీ దగ్గర ఉన్నాయని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారని తెలిసింది.

Karnataka Assembly Election Results 2023

తరువాత స్ట్రాంగ్ రూమ్ లకు ఏర్పాటు చేసిన చెక్కలు తొలగించిన సిబ్బంది, పోలీసులు చివరికి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి ఎన్నికల కౌంటింగ్ మొదలుపెట్టారు. 8 నియోజక వర్గాల ప్రజల తీర్పు భద్రంగా ఉన్న ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు మాయం చేసిన అధికారుల తీరుతో ఎన్నికల అధికారులతో పాటు పలు పార్టీల నాయకులు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది.

మే 10వ తేదీన పోలింగ్ జరిగిన తరువాత చిక్కమగళూరు సిటీలోని పెన్షన్ మొహల్లా పోలింగ్ బూత్ లో ఈవీఎంలు వదిలేసిన అధికారులు చక్కగా కేఎస్ఆర్ టీసీ బస్సు ఎక్కి స్ట్రాంగ్ రూమ్ ల దగ్గరకు బయలుదేరారు. తరువాత ఓ రాజకీయ పార్టీ ఏజెంట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు వదిలేసి వెళ్లారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న కొందరు చేసిన తప్పులు కారణంగా ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+