ఎయిర్‌పోర్ట్‌లో ఎంట్రీ ఫీజు అమలు: ప్రతి 7 నిమిషాలకు రూ.150 కట్టాలి
Bengaluru Airport: విమాన ప్రయాణికుల బంధు మిత్రులకు షాక్ తగిలింది. తమ వారిని విమానం ఎక్కించడానికో.. లేదా రిసీవ్ చేసుకోవడానికో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారి చేతి చమురు వదలక తప్పదు. ఇకపై విమానాశ్రయంలో అడుగు పెట్టాలంటే ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ఎంట్రీ ఫీజు అమలులోకి వచ్చింది. అన్ని రకాల వాహనాలకూ దీన్ని వర్తింపజేశారు. కార్లు మొదలుకుని కమర్షియల్ వెహికల్స్ దాకా విమానాశ్రయం పరిధిలోకి వెళ్లాలంటే ఇకపై ప్రవేశ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి 7 నిమిషాలకు 150 రూపాయలను చెల్లించేలా టారిఫ్‌ను నిర్ధరించింది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ యాజమాన్యం. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన తొలి ఏడు నిమిషాలకు 150 రూపాయలు, ఆ తరువాత 7 నుంచి 14 నిమిషాల వరకు 300 రూపాయలను ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి.
14 నిమిషాలు దాటిన తరువాత కూడా ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వెళ్లకపోతే.. ఆ వాహనాన్ని అక్కడి సిబ్బంది లాక్ చేస్తారు. దాన్ని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. ఆ తరువాత ఆ వాహనాన్ని పోలీసుల నుంచి విడిపించుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తాన్నీ దాని యజమానే భరించాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రీ ఫీజు బస్సులు, టెంపో ట్రావెలర్లకూ వర్తింపజేశారు. బస్సుల ఎంట్రీ ఫీజు 600 రూపాయలు, టెంపో ట్రావెలర్ల నుంచి 300 రూపాయలను వసూలు చేస్తారు. బస్సుల, టెంపో ట్రావెలర్లు లేన్ 3లో మాత్రమే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
ఎంట్రీ ఫీజు టికెట్‌ను పోగొట్టుకుంటే 600 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. వైట్ బోర్డ్ వాహనాలన్నింటినీ కూడా ప్రైవేట్ వెహికల్స్‌గా గుర్తిస్తారు. ఎల్లో బోర్డ్, ఎలక్ట్రికల్ కమర్షియల్, సెల్ఫ్ డ్రైవ్ ఎల్లో బోర్డ్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్‌గా క్లాసిఫైడ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవర్లు తమ వాహనాలను వదిలిపెట్టి పక్కకు వెళ్లకూడదు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications