ఐటీ హబ్ లో యువతిని కారులో కిడ్నాప్ చేసి మరుసటి రోజు వరకు అదే కారులో గ్యాంగ్ రేప్ చేసి ?
బెంగళూరు/ కోరమంగల: ఐటీ హబ్ బెంగళూరు సిటీలో ప్రతిరోజు 24 గంటలు ప్రతిఏరియాలో పోలీసులు గస్తీ తిరుగుతూనే ఉంటారు. రాత్రిపూట పోలీసులు ఎక్కువగా తిరుగుతూ శాంతిభద్రతలు కాపాడుతూ ఉంటారు. అయితే బెంగళూరు సిటీ నడిబొడ్డున ఓ యువతిని ఆమె బాయ్ ఫ్రెండ్ ముందే కారులో కిడ్నాప్ చేసి పలు ప్రాంతాల్లో సంచరిస్తూ మరుసటి రోజు వరకు కొన్ని గంటల పాటు యువతి మీద సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.
బెంగళూరు నగరంలోని కోరమంగల ప్రాంతంలో కోటీశ్వరులు, శ్రీమంతులు, వ్యాపారులు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. కోరమంగలలోని నేషనల్ విలేజ్ పార్క్ లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో మార్చి 25వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతి ఆమె స్నేహితుడితో కలిసి కూర్చుని మాట్లాడుతోంది.

ఆ సమయంలో నేషనల్ విలేజ్ పార్కులో కూర్చున్న యువతితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ తో నలుగురు వ్యక్తులు గొడవపడ్డారు. తరువాత ప్రేమికులు బెదిరించి ఆ యువతిని కేఏ 01 ఎంబీ 6169 నెంబర్ గల మారుతీ 800 కారులో కిడ్నాప్ చేశారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు అదే కారులో నిరంతరం ఆ యువతి మీద నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు.
బాధితురాలిపై ప్రేమికులు అత్యాచారం చేసి రోడ్డుపై వదిలేశారు. నలుగురు వ్యక్తులు యువతితో గొడవపడి కదులుతున్న కారులో ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. బెంగళూరులోని
దొమ్మలూరు, ఇందిరానగర్, అనేకల్, నైస్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో కారులో తిరిగిన నిందితులు మరుసటి రోజు వేకువ జామున 4 గంటల వరకు ఆమె మీద అత్యాచారం చేశారు.
కామం తీర్చుకున్న యువకులు యవతి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత బాధితురాలు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి కిరణ్, శ్రీధర్, విజయ్, సతీష్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి మీద నిందితులు సామూహిక అత్యాచారం చేశామని అంగీకరించారని, కేసు విచారణలో ఉందని పోలీసులు అన్నారు. బెంగళూరులో యువతి మీద నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని వెలుగు చూడటంతో సిలికాన్ సిటీ ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications