Girl: బెంగళూరులో కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి, ఇంటికి శవమై వెళ్లింది, ప్రాణం తీసిన క్రేన్!
బెంగళూరు: కాలేజ్ కు వెలుతున్న యువతి చక్కగా చదువుకుంటున్నది. ఎప్పటిలాగా ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లింది. మార్గం మద్యలో మరమత్తులు చెయ్యడానికి, అక్రమ కట్టడాలు కూల్చడానికి ఉపయోగిస్తున్న క్రేన్ ఆ కాలేజ్ అమ్మాయి మీద దూసుకుపోయింది. తీవ్రగాయాలైన అమ్మాయిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే కాలేజ్ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. క్రేన్ నిర్లక్షంగా నడపడం వలన కాలేజ్ అమ్మాయి ప్రాణాలు పోయాయని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు.

బెంగళూరులో క్రేన్ లు
బెంగళూరు సిటీలోని మహదేవపుర శాసన సభ నియోజక వర్గం పరిధిలో కొంతకాలంగా అక్రమ కట్టడానికి బీబీఎంపీ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఇదే సమయంలో డ్రైనేజ్ మరమత్తుల పనుల కోసం, అక్రమ కట్టడాలు నేల కూల్చడానికి మహదేవపుర పరిసర ప్రాంతాల్లో కొన్ని క్రేన్ లు ఉపయోగిస్తున్నారు.

కాలేజ్ అమ్మాయి
కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోని కెన్నమంగల సమీపంలో నివాసం ఉంటున్న కుమారి నూర్ ఫిజ అలియాస్ నూర్ ఫిజా (19) అనే యువకుతి ఆదే ప్రాంతంలోని ప్రైవేట్ కాలేజ్ లో చదువుకుంటున్నది. కాలేజ్ కు వెలుతున్న నూర్ ఫిజ చక్కగా చదువుకుంటున్నది. ఎప్పటిలాగా నూర్ ఫిజ ఉదయం కాలేజ్ కు వెళ్లింది.

క్రేన్ దూసుకుపోయింది
మార్గం మద్యలో కెన్నమంగల గేట్ సమీపంలో మరమత్తులు చెయ్యడానికి, అక్రమ కట్టడాలు కూల్చడానికి ఉపయోగిస్తున్న క్రేన్ కాలేజ్ అమ్మాయి నూర్ ఫిజ మీద దూసుకుపోయింది. తీవ్రగాయాలైన నూర్ ఫిజను వెంటనే వైదేహి ఆసుపత్రికి తరలించారు. తరువాత వైట్ ఫీల్డ్ లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

చదువు కోవడానికి వెళ్లి శవమై వచ్చింది
చికిత్స విఫలమై కాలేజ్ అమ్మాయి నూర్ ఫిజ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. క్రేన్ నిర్లక్షంగా నడపడం వలన కాలేజ్ అమ్మాయి ప్రాణాలు పోయాయని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. కాలేజ్ అమ్మాయి తండ్రి రెహమాన్ క్రేన్ యజమాని పెరియస్వామీ మీద వైట్ ఫీల్డ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి ఇంటికి శవమై తిరిగిరావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు చలించిపోయారు.












Click it and Unblock the Notifications