Lady; ఆంధ్రా మొగుడు, బెంగళూరు ప్రియుడు, ఒకే ఇంట్లో ఎంజాయ్ చేశారు, సీన్ కట్ చేస్తే ? కంత్రీ!

బెంగళూరు/తిరుపతి: వివాహం చేసుకున్న యువతి కొంతకాలం ఆమె భర్తతో కాపురం చేసింది. గొడవల కారణంగా భర్తను గుడ్ బై చెప్పిన యువతి ఆంధ్రా నుంచి ఐటీ హబ్ చేరుకుని ఆమె బంధువుల ఇంట్లో ఉంటున్నది. వయసులో చిన్నవాడైన యువకుడు పరిచయం కావడంతో అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

పెళ్లికాకుండానే యువకుడితో కొన్ని ఏళ్లుగా ఒకే ఇంటిలో ఉంటున్న ఆమె అతనితో సహజీవనం చేసింది. పెళ్లి చేసుకుందామని ఆమె ప్రియుడికి చెప్పింది. అసలే సెకండ్ హ్యాండ్, ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేశాము, ఇంకా పెళ్లి చేసుకోవాలా ? అంటూ ఆ యువకుడు ఆమెను పక్కాప్లాన్ తో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.

ఆంధ్రా మొగుడు

ఆంధ్రా మొగుడు

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన సునితా (27) అనే యువతికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడితో వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న సునితా కొంతకాలం ఆమె భర్తతో కాపురం చేసింది. తరువాత సునితా దంపతు మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. వివాహం చేసుకున్న భర్తను గుడ్ బై చెప్పిన సునితా కొంతకాలం పుట్టింటిలో ఉంది.

బెంగళూరు వచ్చి పేరు మార్చుకుంది

బెంగళూరు వచ్చి పేరు మార్చుకుంది

బెంగళూరు చేరుకున్న సునితా కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. తరువాత సునితా ఆమె పేరు దీపు అలియాస్ దీపాగా మార్చుకుని చిన్న ఉద్యోగంలో చేరింది. సింగసంద్రలోని శ్రీనివాస్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న ప్రశాంత్ (23) అనే యువకుడు ఇ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రశాంత్ కు, సునితాకు పరిచయం అయ్యింది.

పెళ్లి కాకుండానే సహజీవనం

పెళ్లి కాకుండానే సహజీవనం

రానురాను ప్రశాంత్, సునితా దగ్గర అయ్యారు. పెళ్లి కాకుండా సునితా, ప్రశాంత్ నాలుగు సంవత్సరాల క్రితం సింగసంద్రలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. అప్పటి నుంచి సునితా ఆమె ప్రియుడు ప్రశాంత్ తో ఎంజాయ్ చేస్తోంది, సునితా కంటే ఆమె ప్రియుడు ప్రశాంత్ వయసులో నాలుగు సంవత్సరాల చిన్నవాడు.

పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియురాలు

పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియురాలు

తనకంటే వయసులో చిన్నవాడు అని తెలిసినా సునితా ఆమె ప్రియుడు ప్రశాంత్ తో సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేసింది. కొన్ని నెలల నుంచి సునితా మనం పెళ్లి చేసుకుందామని ప్రశాంత్ మీద ఒత్తిడి చేసింది. ఏదో టైమ్ పాస్ కు చిక్కిందని ఎంజాయ్ చేస్తుంటే సునితా పెళ్లి చేసుకుందామని టార్చర్ పెడుతోందని ప్రశాంత్ అసహనంతో రగిలిపోయాడు.

చంపేస్తే పీడపోతుందని ప్రియుడి స్కెచ్

చంపేస్తే పీడపోతుందని ప్రియుడి స్కెచ్

మా అక్కకు పెళ్లి చేసిన తరువాత మనం పెళ్లి చేసుకుందామని ప్రశాంత్ చెప్పాడు. అయితే ఇక నేను ఆలస్యం చెయ్యనని, వెంటనే పెళ్లి చేసుకోవాలని సునితా డిమాండ్ చేసింది. డిసెంబర్ 7వ తేదీన ఇదే వియషంలో సునితా, ప్రశాంత్ మద్య గొడ జరిగింది. సహనం కోల్పోయిన ప్రశాంత్ అతని ప్రియురాలు సునితను గొంతు నులిమి హత్య చేసి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించాడు.

పోలీసులకు ఫోన్ చేసిన డాక్టర్

పోలీసులకు ఫోన్ చేసిన డాక్టర్

సునిత శవాన్ని సమీపంలోని అభిరామ్ ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రశాంత్ ఆమె ఉరి వేసుకుందని చెప్పాడు. అప్పటికే సునితా ప్రాణం పోయిందని తెలుసుకున్న పోలీసులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వెళ్లి చూస్తు సునితా గొంతు మీద గాయాలైన విషయం వెలుగు చూసింది. అయితే పోలీసులు మొదట ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేశారు.

మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది

మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది

పోలీసులు సునితా శవానికి పోస్టుమార్టం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లోని ఆమె కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించారు. సునితా, ప్రశాంత్ చాలాసార్లు ఫోన్ లలో గొడవపడిన విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి విషయంలో ప్రియురాలిని హత్య చేసిన ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. నా ప్రియురాలు సునితా అలియాస్ దీపాను నేనే హత్య చేశానని ప్రశాంత్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+