Girlfriend: భార్య ఫ్రెండ్ తో ఎంజాయ్, రివర్స్ గేర్ వేసిన ప్రియురాలు, గెస్ట్ హౌస్ లో, అనంతపురంలో భర్త!
బెంగళూరు/ అనంతపురం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. వ్యాపారం చెయ్యడానికి భర్త అతని భార్యతో కలిసి ఐటీ హబ్ చేరుకున్నాడు. భర్త వ్యాపారం చేస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటున్నది. రెండు సంవత్సరాల నుంచి దంపతులు హ్యాపీగా ఉంటున్నారు. భార్య కాలేజ్ స్నేహితురాలు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెలుతుంటే భర్త ఆమెను పరిచయం చేసుకున్నాడు. భార్య ఫ్రెండ్ తో చనువు పెంచుకున్న భర్త ఆమెతో విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశాడు.
భార్యకు మాత్రం తాను వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని చెబుతున్న భర్త మాత్రం అతని భార్య స్నేహితురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రియురాలు ఓ గెస్ట్ హోస్ లో హత్యకు గురైయ్యింది. పోలీసులు రంగంలోకి దిగారు. యువతి హత్య కేసులో ఆమె ప్రియుడిని అనంతపురం రైల్వేస్టేసన్ లో పోలీసులు పట్టుకోవడంతో కథ మలుపుతిరిగింది.

ఒడిశా టూ బెంగళూరు
ఒడిశాకు చెందిన 23 ఏళ్ల స్వప్నా అలియాస్ స్వప్నాదేవి పేరు మార్చడం జరిగింది అనే యువతి, అనుమోల్ అనే యువకుడు రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. వ్యాపారం చెయ్యడానికి భర్త అతని భార్యతో కలిసి ఐటీ హబ్ చేరుకున్నాడు.

భార్య ఫ్రెండ్ లైన్ లోకి వచ్చింది
అనుమోల్ అతని భార్యతో హెచ్ఏఎల్ సమీపంలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. అనుమోల్ భార్య స్వప్నా ఇంట్లోనే ఉంటున్నది. రెండు సంవత్సరాల నుంచి అనుమోల్, స్వప్నా దంపతులు బెంగళూరులోనే హ్యాపీగా ఉంటున్నారు. ఇదే సమయంలో అనుమోల్ భార్య స్వప్నా స్నేహితురాలు, బెంగళూరులోనే నివాసం ఉంటున్న దీపా పదన్ అలియాస్ దీపా (22) అనే యువతి అనుమోల్ ఇంటికి వచ్చి వెళ్లడం మొదలుపెట్టింది.

భార్య ఫ్రెండ్ ను లైన్ లో పెట్టేశాడు
స్వప్నా కాలేజ్ స్నేహితురాలు దీపా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెలుతుంటే ఆమె భర్త అనుమోల్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. భార్య స్వప్నా ఫ్రెండ్ దీపాతో చనువు పెంచుకున్న అనుమోల్ ఆమెతో విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశాడు. దీపా, అనుమోల్ ల అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది.

ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు
భార్య స్వప్నాకు మాత్రం తాను వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని చెబుతున్న అనుమోల్ అక్రమ సంబంధం పెట్టుకున్న అతని భార్య స్వప్నా స్నేహితురాలు దీపాతో సంవత్సరం నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే కొన్ని నెలల నుంచి దీపా ఆమె ప్రియుడు అనుమోల్ ఫోన్లు రిసీవ్ చెయ్యకుండా, అతనితో సక్రమంగా మాట్లాడకుండా, ప్రియుడిని దూరం పెట్టి తప్పించుకుని తిరగడం మొదలుపెట్టింది.

ప్రియురాలిని చంపేసిన ప్రియుడు
తన ప్రియురాలు దీపా నన్ను మోసం చేసిందని రగిలిపోయిన అనుమోల్ ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. జూన్ 9వ తేదీన యశవంతపురంలోని ఓ గెస్ట్ హౌస్ కు దీపాను పిలిపించాడు. అక్కడ అనుమోల్, దీపా మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన అనుమోల్ అతని ప్రియురాలు దీపాను గొంతు నులిమి చంపేశాడు.

అనంతపురంలో?
దీపా శవాన్ని గెస్ట్ హోస్ లోనే వదిలేసిన అనుమోల్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల విచారణలో దీపా అడ్రస్, ఆమె మొబైల్ నెంబర్ ఆధారంగా అనుమోల్ మ్యాటర్ మొత్తం తెలిసింది. ప్రియురాలు దీపాను హత్య చేసిన అనుమోల్ కొన్ని రోజులు బెంగళూరులో తలదాచుకుని తరువాత ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం వెళ్లాడు.
Recommended Video


నా ప్రియురాలిని నేను చంపేశాను
అనంతపురం నుంచి రైలులో ఒడిశా పారిపోవడానికి ప్రయత్నించిన అనుమోల్ ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారని బెంగళూరు పోలీసులు అన్నారు. దీపా తనను మోసం చేసిందని ఆమెను నేనే చంపేశారని అనుమోల్ అంగీకరించాడని బెంగళూరుకు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications