Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద !

బెంగళూరు/ మండ్య/ మంగళూరు: అధిక వడ్డి ఇస్తామని నమ్మించి ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయల విలువైన బంగారం సేకరించి అందరికీ పంగనామాలు పెట్టిన భారీ గోల్డ్ స్కామ్ కేసులో A1, A2 నిందితులను పోలీసులు గుర్తించారు. ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు భార్య ( ఫ్రెండ్ భార్య)తో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు కలిసి ఫైవ్ స్టార్ హోటల్స్ లో, విలాసవంతమైన రిసార్టుల్లో ఎంజాయ్ చెయ్యడానికి రూ. 20 కోట్ల విలువైన బంగారు దొబ్బేసి మస్త్ మజా చేశారని పోలీసు అధికారులు గుర్తించారు. బిగ్ షాట్ కోడలు, ఆమె ప్రియుడి భాగోతం తెలుసుకున్న పోలీసులు, బాధితులు ఔరా.... ఏం స్కెచ్ వేశారు రా ! అంటూ నోర్లు వెళ్లబెట్టుకుంటున్నారు. గోల్డ్ స్కామ్ నిందితుడు, బిగ్ షాట్ కోడలు వ్యవహారం, వారి వయ్యారాలు, సింగారాల గురించి పోలీసులు కూపీలాగుతున్నారు.

 అసలు అక్కడ ఏం జరిగిందంటే ?

అసలు అక్కడ ఏం జరిగిందంటే ?

కర్ణాటకలోని మండ్య పట్టణం (బహుబాష నటి సుమలతా అంబరీష్ ఎంపీగా ఉన్న మండ్య)లో బంగారు నగలు కుదవ పెట్టిన వాళ్లకు 20 శాతం నుంచి 40 శాతం వడ్డీ ఇస్తామని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పారు. బ్యాంకులో మీరు బంగారు నగలు కుదవ పెడితే తక్కువ వడ్డీ వస్తుందని, మా దగ్గర బంగారు నగలు కుదువ పెట్టండి, భారీ మొత్తంలో వడ్డీ తీసుకోండి అంటూ కొందరు మహిళలను రంగంలోకి దింపారు. ఈ విధంగా కొన్ని వందల మంది నుంచి సుమారు రూ. కోట్ల రూపాయల బంగారు నగలు లూటీ చేశారు.

 హిజ్రా ఫిర్యాదుతో వెలుగులోకి

హిజ్రా ఫిర్యాదుతో వెలుగులోకి

అమాయకులకు మాయమాటలు చెప్పి బంగారు నగలు ఇప్పించుకుని ఇప్పుడు చేతులు ఎత్తేశారని, ఇదో పెద్ద స్కామ్ అంటూ హిజ్రా వి. సోనియా మండ్య పశ్చిమ (వెస్ట్) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిజ్రా వి. సోనియా ఫిర్యాదు కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని హడలిపోయారు. ఈ కేసులో మండ్యకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బిగ్ షాట్ కోడలికి ఈ స్కామ్ కు లింక్ ఉందని వెలుగు చూడటంతో పోలీసులు హడలిపోయారు.

 కింగ్ పిన్ ప్రియురాలు బిగ్ షాట్ కోడలు !

కింగ్ పిన్ ప్రియురాలు బిగ్ షాట్ కోడలు !

మండ్యలో జరిగిన భారీ గోల్డ్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు సోమశేఖర్ అలియాస్ సోము అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సోమశేఖర్. మండ్యలోని ఫెడ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కలిసి మహిళ దగ్గర సుమారు 4. 5 కేజీల బంగారు నగలు తీసుకుని వారికి అధిక శాతం వడ్డీ ఇస్తామని కుచ్చుటోపి పెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మండ్యలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తి కోడలు పూజాతో ఎంజాయ్ చెయ్యడానికి సోమశేఖర్ ఈ గోల్డ్ స్కామ్ స్కెచ్ వేశాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. పూజా బిగ్ షాట్ కోడలు మాత్రమే కాదు, ప్రధాన నిందితుడు సోము స్నేహితుడి భార్య కావడం విశేషం.

 ఫైవ్ స్టార్ హోటల్స్ లో పూజాతో మస్త్ మజా

ఫైవ్ స్టార్ హోటల్స్ లో పూజాతో మస్త్ మజా

మండ్యకు చెందిన బిగ్ షాట్ కొడుకు నిఖిల్, పూజా అనే యువతికి వివాహం అయ్యింది. సోము స్నేహితుడు నిఖిల్. నిఖిల్ భార్య పూజాతో అక్రమ సంబంధం పెట్టుకున్న సోము గోల్డ్ స్కామ్ కీలక నిందితుడని పోలీసులు అన్నారు. నిఖిల్ కు నీళ్లుతాగిస్తున్న అతని భార్య పూజా సోముతో అక్రమ సంబంధం పెట్టుకుని బెంగళూరు, మంగళూరు, మైసూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఫైవ్ స్టార్ హోటల్స్, రిసార్టుల్లో వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 వారానికి మూడు రాత్రులు ఎంజాయ్

వారానికి మూడు రాత్రులు ఎంజాయ్

మండ్య నుంచి శనివారం సాయంత్రం సోము, ఆమె ప్రియురాలు పూజా బయలుదేరి ఫైవ్ స్టార్ హోటల్స్ చేరుకుంటున్నారని, శనివారం రాత్రి, ఆదివారం రాత్రి, సోమవారం వరకు పిచ్చపాటిగా హైఫై లైఫ్ ఎంజాయ్ చేసి సోమవారం రాత్రి మళ్లీ వీరు మండ్య చేరుకుంటున్నారని, ప్రతివారం వీరిది ఇదే పని అని పోలీసు అధికారులు గుర్తించారు.

 మొగుడికి మస్కా కొట్టిన పూజా

మొగుడికి మస్కా కొట్టిన పూజా

భర్త నిఖిల్ కు మస్కా కొడుతున్న అతని భార్య పూజా సోముతో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన మామ పెద్ద వ్యాపారవేత్త అనే విషయం, ఆ కుటుంబానికి చాల పేరుప్రతిష్టలు ఉన్నాయి అనే విషయం గాలికి వదిలేసిన పూజా అక్రమ సంబంధం పెట్టుకున్న సోముతో కలిసి ఇతర ప్రాంతాలకు చెక్కేసి హైఫై పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తోందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    India-China Stand Off: చైనా.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు! - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
     రూ. 20 కోట్లు గోవిందా గోవింద

    రూ. 20 కోట్లు గోవిందా గోవింద

    అధిక శాతం వడ్డీ ఇస్తామని మహిళలను నమ్మించి ఇప్పటి వరకు సుమారు 5 కేజీల బంగారు నలగు తీసుకున్న సోము వాటిని రూ. 20 కోట్ల వరకు తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బుతో వివాహిత మహిళ పూజాతో కలిసి ఎంజాయ్ చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు. నిఖిల్ ను గాలికి వదిలేసిన పూజా హైఫై లైఫ్ ఎంజాయ్ చెయ్యడానికి సోమును రెండో వివాహం చేసుకుందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండ్య గోల్డ్ స్కామ్ కేసులో A1 సోము, A2 పూజాను నిందితులుగా చేర్చామని, ఇంకా ఈ స్కామ్ లో ఉన్న నిందితుల వివరాలు సేకరిస్తున్నామని మండ్య వెస్ట్ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద బిగ్ షాట్ కోడలు అక్రమ సంబంధం వ్యవహారం మండ్యతోపాటు కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+