Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Guruji: శిష్యుడే గురూజీ హంతకుడు ?, గతంలో నిందితుడి భార్య కూడా గురూజీ దగ్గర ఉద్యోగం, పెళ్లి చేసి!

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని కిరాతకంగా హత్య చేసిన నిందితుల కోసం హుబ్బళి పోలీసులు గాలిస్తున్నారు. 40 సెకన్లలో 60 సార్లు పొడిచి చంపేశారు. గురూజీని పగతో, పాతకక్షలతో హత్య చేశారని పోలీసులు అంటున్నారు. హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని మంగళవారం పట్టపగలు అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

చంద్రశేఖర్ గురూజీ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్ అనే వ్యక్తి,, అతని అనుచరుడు కలిసి హత్య చేశారని, ఆ విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు. మహంతేష్ భార్య కూడా చంద్రశేఖర్ గురూజీ దగ్గరే పని చేసేది అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే మహంతేష్ భార్య కొంతకాలం క్రితం చంద్రశేఖర్ గురూజీ దగ్గర ఉద్యోగం మానేయడం అనేక అనుమానాలకు దారితీసింది.

హోటల్ లో గురూజీ

హోటల్ లో గురూజీ

కర్ణాటకలో వాస్తు శాస్త్రజ్ఞుడిగా చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడి ఎంతో పేరుప్రతిష్టలు సంపాధించుకున్నారు. జులై 2వ తేదీన హుబ్బళిలో ప్రెసిడెంట్ హోటల్ లో చంద్రశేఖర్ గురూజీ గది అద్దెకు తీసుకుని పలువురికి వాస్తు శాస్త్రం చెబుతున్నారు. బుధవారం హోటల్ రూమ్ ఖాళీ చేస్తున్నానని చంద్రశేఖర్ గురూజీ హోటల్ యాజమాన్యంకు, అక్కడి సిబ్బందికి చెప్పారు.

పాదాభివందనం చేసి పొడిచిపారేశారు

పాదాభివందనం చేసి పొడిచిపారేశారు

మంగళవారం పట్టపగలు చంద్రశేఖర్ గురూజీ హోటల్ లోని రిసెప్షన్ సమీపంలో కుర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి చంద్రశేర్ గురూజీ దగ్గరకు వెళ్లి పాదాభివందనం చేశారు. వెంటనే పైకి లేచిన నిందితుడు కత్తి తీసుకుని చంద్రశేఖర్ గురూజీని పొడిచాడు. సమీపంలో ఉన్న మరో వ్యక్తి కూడా వెంటనే అక్కడికి చేరుకుని చంద్రశేఖర్ గురూజీని ఇష్టం వచ్చినట్లు పొడిచేశారు.

 40 సెకన్లలో 60 కత్తిపోట్లు..... కసితీరా పొడిచి ఎస్కేప్

40 సెకన్లలో 60 కత్తిపోట్లు..... కసితీరా పొడిచి ఎస్కేప్

హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని అతికిరాతకంగా హత్య చేశారు. ఇద్దరు నిందితులు 40 సెకన్లలో 60 సార్లు చంద్రశేఖర్ గురూజీని పొడిచి చంపారంటే ఆయన మీద నిందితులు ఎంతకసి పెంచుకున్నారో అర్థం అవుతోందని పోలీసు అధికారులు అంటున్నారు.

 సీసీటీవీ కెమెరాల్లో రికార్డు

సీసీటీవీ కెమెరాల్లో రికార్డు

కర్ణాటకలోని హుబ్బళిలోని ప్రెసిడెంట్ హోటల్ లో ఉన్న ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అగడిని అతి దారుణంగా హత్య చేస్తున్న సమయంలో హోటల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీ హత్యకు గురికావడం కర్ణాటకలో కలకలం రేపింది.

పెళ్లి చేసిన గురూజీని హత్య చేసిన శిష్యుడు

పెళ్లి చేసిన గురూజీని హత్య చేసిన శిష్యుడు

చంద్రశేఖర్ గురూజీ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్న మహంతేష్ శిరూర్ అలియస్ మహంతేష్ అనే వ్యక్తి,, అతని అనుచరుడు కలిసి హత్య చేశారని, ఆ విషయం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు. మహంతేష్ భార్య కూడా చంద్రశేఖర్ గురూజీ దగ్గరే పని చేసేది అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే మహంతేష్ భార్య కొంతకాలం క్రితం చంద్రశేఖర్ గురూజీ దగ్గర ఉద్యోగం మానేయడం అనేక అనుమానాలకు దారితీసింది. మహేంతేస్ కు చంద్రశేఖర్ గురూజీ దగ్గరుండి పెళ్లి చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.

16 అవార్డులు తీసుకున్న గురూజీ

16 అవార్డులు తీసుకున్న గురూజీ

వాస్తు పరివార్ పేరుతో చంద్రశేఖర్ గురూజీ కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు సంపాధించుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రశేఖర్ గురూజీకి 16 అవార్డులు వచ్చాయి. సుమారు 2 వేలకు పైగా సెమినార్లలో చంద్రశేఖర్ గురూజీ ప్రసంగించి వాస్తు గురించి, వాస్తు ప్రాముఖ్యత గురించి వివరించారు.

 350 మంది శిష్యులు

350 మంది శిష్యులు

ఇంజనీరింగ్ పూర్తి చేసి వాస్తు శాస్త్రంలో పీహెచ్ డీ చేసిన చంద్రశేఖర్ గురూజీ డాక్టర్ పట్టా అందుకున్నారు. 2002లో సీజీ పరివార్ అనే ప్రైవేట్ సంస్థను ప్రారంభించారు. 2016లో సరళ జీవన ఇన్ఫో ఎంటర్ టైన్మెంట్ టీవీ చానల్ ను ప్రారంభించిన చంద్రశేఖర్ గురూజీ ఇప్పటి వరకు 350 మంది శిష్యులను తీర్చిదిద్ది ప్రపంచ వ్యాప్తంగా వస్తు శాస్త్రం చెప్పిస్తున్నారు. ఇలాంటి ప్రముఖ వాస్తు శాస్త్రజ్ఞుడు చంద్రశేఖర్ గురూజీని అతికిరాతకంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+