Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నువ్వు హీరో ఎలా అయ్యావు సార్, బుద్ది ఉండే ట్విట్ చేశావా ? ఓ రాష్ట్రం భవిష్యత్తు అని తెలీదా ?

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైయ్యింది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమీషన్ డేట్ ఫిక్స్ చేసింది. మే 10వ తేదీన కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒకేసారి పోలింగ్ జరగడానికి ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మే 13వ తేదీ కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెళ్లడిస్తామని ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ ఇప్పటికే చెప్పారు.

అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీ జరిగితే మే 13వ తేదీ ఫలితాలు ఎందుకు ప్రకటిస్తారు ?, ఓట్లు లెక్కించడానికి రెండు రోజులు గ్యాప్ అవసరమా అంటూ బహుబాష నటుడు, దర్శకుడు, ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర ట్విట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తేదీ ప్రకటించిన తరువాత ప్రముఖ నటుడు ఉపేంద్ర చేసిన ట్విట్ వైరల్ అయ్యింది.

Hero Upendra tweeted about Karnataka assembly election polling and counting dates.

ఇంతటితో ఉప్పి సైలెంట్ గా ఉండకుండా కొన్ని గంటల తరువాత మరో ట్వీట్ చేశారు. డిజిటల్ యుగంలో ఓట్లు లెక్కించడానికి రెండు రోజులు అవసరమా ?, నాకు తెలీదు, తెలిస్తే మీరు చెప్పండి అంటూ మరో ట్విట్ చేశాడు. దెబ్బకు ఉపేంద్ర ట్వీట్ మరోసారి వైరల్ అయ్యింది. ఉపేంద్రకు మద్దతుగా ట్విట్ చేసిన వారికంటే హీరోకు క్లాస్ పీకినవాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.

ఒకటో తరగతి పరీక్షలు జరిగిన తరువాత వాటి ఫలితాలు వెళ్లడించడానికి స్కూల్ యాజమాన్యం నెల రోజులు టైమ్ తీసుకుంటుంది. అలాంటిది ఓ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు వెళ్లడించడానికి రెండు రోజులు టైమ్ తీసుకుంటే తప్పు ఏమిటి అని చాలా మంది బహుబాష నటుడు ఉపేంద్రను సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు ఓ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు అని తెలీదా అని ఉపేంద్రను ప్రశ్నించారు.

Hero Upendra tweeted about Karnataka assembly election polling and counting dates.

ఈవీఎం యంత్రాలను భద్రపరచడానికి, ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని, అందుకు రెండు రోజులు సమయం అవసరం అని కూడా తెలీదా, నువ్వు హీరో ఎలా అయ్యావు. దర్శకుడు ఎలా అయ్యావు అంటూ ఉప్పికి చివాట్లు పెట్టారు.

పోలింగ్ జరిగిన రోజే నువ్వు అన్ని ఈవీఎంలు ఒకచోటకు తరలించు, ఆరోజే ఓట్ల లెక్కింపుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. అసలు బుద్ది ఉండే ట్విట్ చేశావా ? అంటూ ఓ నెటిజన్ హీరో ఉపేంద్రతో రఫ్ అడుకున్నాడు. మొత్తం మీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత హీరో ఉపేంద్ర చేసిన ట్విట్ తో అతన్ని సోషల్ మీడియాలో ఆడుకునే వాళ్లు ఎక్కువ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+