కర్ణాటక కింగ్ ఎవరు ?, ఎవరికి ఎన్ని సీట్లు ?, జన్ కీ బాత్ సర్వేతో షాక్, గాలికి ఎన్ని సీట్లు?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని అంటున్నారు. ఈసారి మాదే రాజ్యం అని కాంగ్రెస్ అంటోంది. అయితే కింగ్ మేకర్లు మేమే అని జేడీఎస్ దళపతులు అంటున్నారు.
మేము లేకుండా ఎవ్వరూ అధికారంలోకి రాలేరని మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వివిద సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఎప్పటిలాగే జన్ కి బాత్ సంస్థ నిర్వహించిన సర్వేని ప్రముఖ కన్నడ టీవీ చానల్ సువర్ణ టీవీ విడుదల చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

జన్ కీ బాత్ సర్వేలో ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారు. కర్ణాటకలోని వివిద ప్రాంతాలు, జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు ఏమిటి అని వివరాలు ఉన్నాయి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 98-109 స్థానాలు వస్తాయని జన్ కీ బాత్ సర్వేలో వెలుగు చూసింది.
కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 89- 97 సీట్లు వస్తాయని సర్వేలో వెలుగు చూసింది. జేడీఎస్ పార్టీకి 25 నుంచి 29 స్థానాలు మాత్రమే దక్కుతాయని జన్ కీ బాత్ సర్వేలో వెలుగు చూసింది. మొత్తం మీద కర్ణాటకలో మరోసారి పూర్తి మెజారిటీ ఎవ్వరూ అధికారంలోకి రారని, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37 నుంచి 39 శాతం ఓట్లు సంపాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 38 నుంచి 40 శాతం ఓట్లు సంపాధిస్తుందని, జేడీఎస్ 16 నుంచి 18 శాతం ఓట్లు సంపాదిస్తుందని జన్ కీ బాత్ సర్వే వెళ్లడించింది. స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 5 నుంచి 7 శాతం ఓట్లు సంపాధిస్తారని జన్ కీ బాత్ సర్వే వెళ్లడించింది.
మధ్య కర్ణాటక (కర్ణాటక సెంట్రల్)లో మొత్తం 26 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయని. ఈసారి ఈ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోటీ ఉందని సర్వే తెలిపింది. కర్ణాటక సెంట్రల్ ప్రాంతంలో బీజేపీకి 13, కాంగ్రెస్ పార్టీకి 12, జేడీఎస్ కు 1 సీటు వచ్చే అవకాశం ఉందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది. మొత్తం మీద కర్ణాటకలో మరోసారి ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాదని, హంగ్ గ్యారెంటీ అని జన్ కీ బాత్ సర్వే వెళ్లడించింది.












Click it and Unblock the Notifications