కాంగ్రెస్ వస్తే గూండా రాజ్యం గ్యారెంటీ, పీఎఫ్ఐ గుండాలతో?, ఎంపీ తేజస్వి సూర్య!
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గూండారాజ్ లు, మాఫియా రాజ్ తయారౌతారని, ఉగ్రవాదం పెరిగిపోయి ఇస్లామిక్ రాజ్యం వచ్చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మన లక్షం అని బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ, కర్ణాటక బీజేపీ యువమోర్చ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
భజరంగ్ దళ్, పీఎఫ్ఐని బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. దేశం కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు. దేశంలో అల్లర్లు జరగడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని, గుడ్డిగా ఎన్నికల మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటిస్తే ఎవ్వరూ చూస్తూ కుర్చోరని తేజస్వి సూర్య అన్నారు.

ఉత్దర కన్నడ, దక్షిణ కన్నడ తదితర జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తల వలనే హిందువులు ధైర్యంగా బయట తిరుగుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గుర్తు చేశారు. తాను నైతిక్ పోలీసు గిరిని సమర్థించడం లేదని, అలా అని హనుమాన్ భక్తులను నిషేధిస్తామని ప్రయత్నిస్తే తాము చూస్తూ కుర్చోమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు.
భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని బహిరంగంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ హిందూ విరోధి అనే విషయం స్పష్టం అయ్యిందని తేజస్వి సూర్య ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మతమార్పిడులు నిషేధిస్తామని, గో హత్యను నిషేధిస్తామని, అందులో ఎలాంటి డౌట్ లేదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ పీఎఫ్ఐ గుండాలు రోడ్ల మీదకు విచ్చి విచ్చలవిడిగా తిరుగుతారని, అమాయకులైన హిందువులను టార్గెట్ చేస్తారని తేజస్వి సూర్య ఆరోపించారు. లోకాయుక్త అధికారాలకు కత్తెర వేసి ఏసీబీని తెచ్చిన మాజీ సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మళ్లీ లోకాయుక్తను భలోపేతం చేస్తామని హామీలు ఇచ్చి నవ్వులపాలైనారని బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు.












Click it and Unblock the Notifications