మేము అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, రైతులు, వాళ్ల బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు !

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రస్తుతం పేదవాడు బతకడం చాలా కష్టం అయ్యిందని, ధరలు మండిపోతున్నాయని, వంట గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు దాటిపోయిందని, పేదలు ఎలా గ్యాస్ సిలిండర్లు కొంటారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డీ. కుమారస్వామి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మామ్మల్ని ఆదరిస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాజీ సీఎం కుమారస్వామి ప్రజలకు హామీ ఇచ్చారు.

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచరత్న యాత్ర చేస్తున్న మాజీ సీఎం కుమారస్వామి బెంగళూరులోని యశవంతపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. తరువాత మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి జేడీఎస్ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత పథకాలు ఎలా అందిస్తామో వివరించారు.

If we form a government we will give five cooking gas cylinders free to poor people, says HD Kumaraswamy.

జేడీఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం పేదలకు ఉచితంగా ఐదు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, గ్యాస్ ధరకంటే సగం సబ్సిడీ ఇచ్చి ప్రతి ఏడాది 10 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాజీ సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారు. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోయి సామాన్యుడు పొయ్యి వెలిగించాలంటే భయపడిపోతున్నాడని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

జేడీఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ప్రతిరోజు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మాజీ సీఎం కుమారస్వామి అన్నదాతలకు హామీ ఇచ్చారు. రైతులకు ప్రతి ఎకరాకు రూ. 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని, వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేలా చూస్తామని, ఆటో డ్రైవర్లకు ప్రతినెల రూ. 2 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

ఇక కర్ణాటకలో వక్కలు, కొబ్బరి పండించే రైతులకు ప్రత్యేక ప్యాకేజీల రూపంలో ఆర్థిక సహాయం చేస్తామని మాజీ సీఎం హెచ్. డీ. కుమారస్వామి హామీ ఇచ్చారు. జేడీఎస్ పార్టీని మీరు ఆదరిస్తే గతంలో కంటే మీకు ఎక్కువ సేవ చేసుకుంటానని మాజీ సీఎం కుమారస్వామి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల మీద మాజీ సీఎం కుమారస్వామి విమర్శలు గుప్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+