Illegal affair: ఆంటీ మీద పెట్రోల్ పోసి, గ్యాస్ సిలిండర్ పేల్చి?, అనంతపురంలో శవమైనాడు!

బెంగళూరు: ఉద్యోగం చేసే వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. పెళ్లి జరిగి 25 ఏళ్లు అయిపోయినా భార్య మీద భర్తకు అనుమానం ఉంది. భార్య శీలం మీద అనుమానంతో నిత్యం భర్త ఆమెతో గొడవలు పడుతూనే ఉన్నాడు. దంపతులకు బంధువర్గం ఎక్కువ. నిత్యం దంపతుల ఇంటికి బంధువులు వచ్చి వెలుతున్నారు. ఇంటికి ఎవరు వచ్చినా, భార్యతో ఎవరు క్లోజ్ గా మాట్లాడినా భర్తకు అనుమనం వచ్చేసింది. బంధువులు వెళ్లిపోయిన తరువాత భార్యకు టార్చర్ పెట్టాడు. తన మీద తన భర్తకు అనుమానం ఉందని తెలిసినా ఆంటీ మాత్రం ఇంటికి ఎవరు వచ్చినా వారితో సన్నిహితంగా ఉంటూ భర్తను ఇంకా రెచ్చగొట్టిందని సమాచారం.

చివరికి ఒక రోజు ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యను చూసి రగిలిపోయాడు. వెంటనే భార్య మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆ సమయంలో భర్తకు కూడా మంటలు వ్యాపించాయి. భార్య సజీవదహనం అయిన తరువాత ఇంటి నుంచి తప్పించుకున్న భర్త చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. తీవ్రగాయాలైన భర్త ఆసుపత్రికి వెలితే పోలీసులు పట్టుకుంటారు అనే భయంతో అలాగే తిరిగాడు. చివరికి కాలిన గాయాలతో మంటలు, నొప్పులు తట్టుకోని అతను కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడాడు. అతని మొబైల్ ఫోన్ ట్రేస్ చేసి వెతుక్కుంటు వెళ్లిన పోలీసులకు అతను శవమై కనిపించాడు.

బెంగళూరులో ఆంటీ కాపురం

బెంగళూరులో ఆంటీ కాపురం

బెంగళూరులోని ఆడుగోడిలోని రాజేంద్రనగర్ లో నిసార్ (51), ఆయేషా (47) దంపతులు నివాసం ఉంటున్నారు. నిసార్, ఆయేషా దంపతులకు 22 ఏళ్ల వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలు నిసార్ అతని భార్య ఆయేషాతో సంతోషంగా ఉండేవాడు. రానురాను దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి.

ఆంటీ శీలం మీద అంకుల్ కు అనుమానం

ఆంటీ శీలం మీద అంకుల్ కు అనుమానం

పెళ్లి జరిగి 25 ఏళ్లు అయిపోయినా భార్య ఆయేషా మీద ఆమె భర్త నిసార్ కు అనుమానం ఉంది. భార్య ఆయేషా శీలం మీద అనుమానంతో నిత్యం నిసార్ ఆమెతో గొడవలు పడుతూనే ఉన్నాడు. నిసార్, ఆయేషా దంపతులకు బంధువర్గం ఎక్కువ. నిత్యం నిసార్, ఆయేషా దంపతుల ఇంటికి బంధువులు వచ్చి వెలుతున్నారు.

భర్తను ఇంకా రెచ్చగొట్టిన భార్య

భర్తను ఇంకా రెచ్చగొట్టిన భార్య

ఇంటికి ఎవరు వచ్చినా, భార్య ఆయేషాతో ఎవరు క్లోజ్ గా మాట్లాడినా నిసార్ కు అనుమనం వచ్చేసింది. బంధువులు వెళ్లిపోయిన తరువాత భార్య ఆయేషాకు ఆమె భర్త నిషార్ టార్చర్ పెట్టాడు. తన మీద తన భర్త నిషార్ కు అనుమానం ఉందని తెలిసినా ఆయేషా ఆంటీ మాత్రం ఇంటికి ఎవరు వచ్చినా వారితో సన్నిహితంగా ఉంటూ ఆమె భర్త నిషార్ ను ఇంకా రెచ్చగొట్టేదని సమాచారం.

 పెట్రోల్ పోసి భార్యకు నిప్పంటించాడు

పెట్రోల్ పోసి భార్యకు నిప్పంటించాడు

ఈనెల 19వ తేదీన ఇంటికి వెళ్లిన నిషార్ అతని భార్య ఆయేషాను, మరో వ్యక్తిని ఇంట్లో చూసి రగిలిపోయాడు. తరువాత దంపతుల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నిసార్ వెంటనే భార్య ఆయేషా మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆయేషా గట్టిగా ఆమె భర్త నిషార్ ను పట్టుకోవడంతో అతనికి మంటలు వ్యాపించాయి.

గ్యాస్ సిలిండర్ పేలి భార్య ప్రాణం పోయింది

గ్యాస్ సిలిండర్ పేలి భార్య ప్రాణం పోయింది

నిసార్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆ సమయంలో ఆయేషాతో పాటు ఆమె భర్త నిషార్ కు మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించి ఆయేషా సజీవదహనం అయ్యింది. భార్య ఆయేషా ప్రాణం పోయిన తరువాత ఇంటికి తాళం వేసిన నిషార్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

ఆంధ్రాలో చక్కర్లు కొట్టిన భర్త

ఆంధ్రాలో చక్కర్లు కొట్టిన భర్త

ఆటోలో నేరుగా వెళ్లిపోయిన నిషార్ బస్సులో కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వెళ్లిపోయాడు. రెండు రోజులు మదనపల్లెలో నిషార్ తలదాచుకున్నాడు. మంటలు వ్యాపించినా నిషార్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వెళ్లలేదు. ఆసుపత్రికి వెళితే పోలీసులకు విషయం తెలిసి పట్టుకుంటారని నిషార్ భయపడ్డాడు.

ఫోన్ స్విచ్ ఆఫ్..... స్విచ్ ఆన్

ఫోన్ స్విచ్ ఆఫ్..... స్విచ్ ఆన్

నిషార్ తెలివిగా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చెయ్యడం, తరువాత పోలీసులకు భయపడి స్విచ్ ఆఫ్ చెయ్యడం మొదలు పెట్టాడు. నిషార్ మొబైల్ ఫోన్ ట్రేస్ చెయ్యడానికి పోలీసులు ప్రయత్నించినా అతన్ని పట్టుకోవడం సాధ్యం కాలేదు. చివరికి నిషార్ మదనపల్లె నుంచి బస్సులో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తికి వెళ్లి అక్కడి నుంచి పెనుగొండ చేరుకున్నాడు.

కొడుక్కి ఫోన్ చేసి ప్రాణాలు వదిలేశాడు

కొడుక్కి ఫోన్ చేసి ప్రాణాలు వదిలేశాడు

నాలుగు రోజుల తరువాత నిషార్ అతని కొడుక్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని ఆరా తీశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిషార్ మొబైల్ ఫోన్ ట్రేస్ చేసి పెనుగొండ చేరుకున్నారు. పోలీసులు పెనుగొండ చేరుకుని చూడగా నిషార్ నిర్జనప్రదేశంలో శవమై కనిపించాడు. ఆసుపత్రిలో చికిత్స చేసుకోకపోవడం వలనే మంటలకు శరీరం కాలిపోయి నిషార్ ప్రాణం పోయిందని పోలీసులు అంటున్నారు. భార్య ఆయేషా శీలం మీద అనుమానంతో ఆమెను హత్య చేసిన నిషార్ కొన్ని రోజులకు అతను శవమై కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఆయేషా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పదేపదే ఆమె భర్త నిషార్ టార్చర్ పెట్టేవాడని, మేము చాలాసార్లు పంచాయితీలు చేసి చివరికి సైలెంట్ గా ఉండిపోయామని అతని బంధువులు చెప్పారని ఆడుగోడి పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+