Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: బ్రాందీలో విషం మిక్స్, ప్రియుడి తోడ మీద ప్రాణం వదిలేసింది. కథ వేరే ఉంది!

బెంగళూరు/విజయపురం: వివాహిత మహిళ, ఇంతకు ముందే వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇంతకాలం చెట్లుపుట్టల చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ విషయం ఊర్లోవాళ్లకు తెలిసింది. ప్రియురాలు, ప్రియుడు మద్యంలో విషం కలుపుకుని దానిని తాగేశారు. విషం కలిపిన మద్యం తాగిన ప్రియురాలు ఆమె ప్రియుడి ఒడిలో పడుకుని చావులో కూడా నా వెంట వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ నోట్లో రక్తం కార్చుకుని అతని ఒడిలోనే ప్రాణాలు వదిలేసింది.

పక్కాస్కెచ్ ప్రకారం ప్రియురాలిని చంపేసిన ఆమె ప్రియుడు ఇప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తన ఒడిలో పడుకుని ప్రియురాలు ప్రాణాలు వదులుతున్న సమయంలో ఆమె ప్రియుడు ఎలాంటి ఫీలింగ్ లేకుండా కాలం గడిపిన సమయంలో తీసిన వీడియో, ఫోటోలు వైరల్ కావడం కలకలం రేపింది.

పాత ప్రేమికులు

పాత ప్రేమికులు

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని గంగూరు గ్రామంలో నివాసం ఉంటున్న రేణుకా (36), బసవరాజ్ (40) అనే ఇద్దరు గతంలో ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు రేణుకా, బసవరాజ్ కలిసి మస్త్ మజా చేసి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. తరువాత రకరకాల కారణాలతో ఇద్దరు విడిపోయారు.

ప్రియురాలికి ముగ్గురు, ప్రియుడికి ఆరు మంది పిల్లలు

ప్రియురాలికి ముగ్గురు, ప్రియుడికి ఆరు మంది పిల్లలు

రేణుకా వేరే వ్యక్తిని వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. బసవరాజ్ కూడా వేరే మహిళను వివాహం చేసుకుని ఆరు మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. రేణుకా, బసవరాజ్ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకుని కాపురం చేస్తున్నా వీరి అక్రమ సంబంధం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.

పంచాయితీలు.... రామాయణాలు

పంచాయితీలు.... రామాయణాలు

రేణుకా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె భర్త భార్యను చితకబాదుతున్నాడు. బసవరాజ్ అక్రమ సంబంధం విషయం గురించి అతని భార్య నిత్యం గొడవలు పడుతూనే వస్తోంది. ఊరిపెద్దలు, బంధువులు రేణుకా, బసవరాజ్ కు బుద్దిమాటలు చెప్పి అక్రమ సంబంధానికి దూరంగా ఉండాలని అనేకసార్లు పంచాయితీలు చేశారు.

బ్రాందీలో విషం కలిపి స్కెచ్ వేసిన ప్రియుడు

బ్రాందీలో విషం కలిపి స్కెచ్ వేసిన ప్రియుడు

తన భర్తను వదిలేసి నీతో వచ్చేస్తానని రేణుకా ఆమె ప్రియుడికి చెప్పింది. మనం ఈ వయసులో లేచిపోయి బతకలేమని, కలిసి ఆత్మహత్య చేసుకుందామని బసవరాజ్ అతని ప్రియురాలు రేణుకాను నమ్మించాడు. బ్రాందీ తీసుకెళ్లిన బసవరాజ్ అందులో విషం కలిపాడు. ఇద్దరు కలిసి విషం కలిపిన బ్రాందీ తాగేసి ఆత్మహత్య చేసుకుందామని బసవరాజ్ అతని ప్రియురాలు రేణుకాకు చెప్పాడు.

 ప్రియుడి తోడ మీద ప్రాణాలు వదిలేసింది

ప్రియుడి తోడ మీద ప్రాణాలు వదిలేసింది

ప్రియుడు బసవరాజ్ మాటలు నమ్మిన రేణుకా విషం కలిపిన బ్రాందీ పీకలదాక తాగేసింది. ప్రియుడు బసవరాజ్ కూడా కొంచెం మాత్రం విషం కలిపిన బ్రాందీ తాగి ప్రియురాలి ముందు నటించాడు. బసవరాజ్ ఒడిలో పడుకున్న రేణుకా ఇక ఈ జీవితానికి ఇదిచాలు, పైలోకంలో ఇద్దరు కలుసుకుందాం అంటూ నోటిలో రక్తం కక్కుకుంటూ ప్రియుడి బసవరాజ్ ఒడిలోనే కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలేసింది.

ప్రియురాలి ముఖం మీద గాయాలు

ప్రియురాలి ముఖం మీద గాయాలు

ప్రియుడు బసవరాజ్ మాత్రం వాంతులు చేసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే రేణుకా ముఖం. మెడ. ఛాతీ మీదగాయాలు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తన అక్కకు బసవరాజ్ విషం తాగించి చంపేశాడని రేణకా సోదరుడు పోలీసు కేసు పెట్టాడు.

వీడియో వైరల్ తో అసలు స్టోరీ తెలిసింది

వీడియో వైరల్ తో అసలు స్టోరీ తెలిసింది

బసవరాజ్, రేణుకా విషం కలిపిన బ్రాందీ తాగిన తరువాత ఆమె ఆ బాధతట్టుకోలేక గట్టిగా కేకలు వేసింది. పశువులు మేపుకుంటున్న స్థానికులు కేకలు విని దూరం నుంచి చూసి వీడియో తీశారు. ఆ సమయంలో రేణుకా నోటి నుంచి రక్తం కార్చుకుంటున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బసవరాజ్ ఎలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని, ఆమె ప్రాణం పోతుంటే సాఫీగా చూస్తూ ఉండిపోయాడని ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

ప్రియుడిని గుడ్డిగా నమ్మింది...... ప్రాణం పోయింది

ప్రియుడిని గుడ్డిగా నమ్మింది...... ప్రాణం పోయింది

బసవరాజ్ ప్రాణాలతో బయటపడిన తరువాత ఆ వీడియో తీసిన వాళ్లు దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. రేణుకాను ఆమె ప్రియుడు పక్కాప్లాన్ తో చంపేశాడని పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అక్రమ సంబంధం కారణంగా తనతో పాటు ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని గుడ్డిగా నమ్మిన ప్రియురాలు రేణుకా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+