Wife: భార్య మీద మోజు తీరిపోయింది, ప్రియురాలితో భర్త మస్త్ మజా, రాత్రి ఇంట్లో ఏం చేశాడంటే?, పిల్లలు!

బెంగళూరు/ మండ్య: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్య మీద మోజు తగ్గిపోవడంతో భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త వ్యాపారం పనిమీద బయట ఊరికి వెలుతున్నానని భార్యకు మాయమాటలు చెప్పి నేరుగా అతని ప్రియురాలి ఇంటికి వెళ్లి మస్త్ మజా చేస్తున్నాడు. భర్త అక్రమ సంబంధం విషయం అతని భార్యకు తెలిసిపోయింది.

Recommended Video

    పదేళ్ల ముందు OTT వచ్చి ఉంటె నేను పెద్ద స్టార్ - బిగ్ బాస్ అభిజిత్ *Interview | Telugu OneIndia

    పెద్దలు పంచాయితీలు చేసినా భర్త మాత్రం నాకు నా ప్రియురాలు కావాలని బెట్టు చేశాడు. భార్యను పుట్టింటికి తరిమేసి ప్రియురాలితో జీవితాంతం సుఖంగా ఉండాలని భర్త స్కెచ్ వేశాడు. రాత్రి ఇదే వియషంలో దంపతుల మద్య గొడవ జరిగింది. కన్నబిడ్డల ఎదురుగానే కట్టుకున్న భార్యను చంపేసిన భర్త చేతులు దులుపుకుని ఎస్కేప్ అయ్యాడు.

    భార్యతో సంతోషంగా కాపురం చేశాడు

    భార్యతో సంతోషంగా కాపురం చేశాడు

    కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టం తాలుకాలోని గండెహోసహళ్ళి గ్రామంలో రవి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రవి పెద్దలు సెట్ చేసిన యోగితా (27) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు రవి, యోగితా సంతోషంగా కాపురం చేశారు. రవి, యోగితా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    భార్య మీద మోజుతీరిపోయింది

    భార్య మీద మోజుతీరిపోయింది

    ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భార్య యోగితా మీద రవికి మోజు తగ్గిపోయిందని తెలిసింది. వివాహిత మహిళ రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న రవి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న రవి వ్యాపారం పనిమీద బయట ఊరికి వెలుతున్నానని అతని భార్య యోగితాకు మాయమాటలు చెప్పి నేరుగా అతని ప్రియురాలు రేఖా ఇంటికి వెలుతున్న రవి ఆహెతో మస్త్ మజా చేస్తున్నాడు.

     భార్య వద్దు..... ప్రియురాలు ముద్దు

    భార్య వద్దు..... ప్రియురాలు ముద్దు

    కొన్ని నెలల క్రితం యోగితాకు ఆమె భర్త అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. అక్రమ సంబంధం విషయంలో యోగితా, రవి దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా రవి మాత్రం నాకు నా ప్రియురాలు రేఖా కావాలని, తన భార్య యోగితాతో నేను కాపురం చెయ్యనని తేల్చి చెప్పాడు.

    భార్యను పుట్టింటికి తరిమేయాలని స్కెచ్

    భార్యను పుట్టింటికి తరిమేయాలని స్కెచ్

    భార్య యోగితాను పుట్టింటికి తరిమేసి ప్రియురాలు రేఖాతో జీవితాంతం సుఖంగా ఉండాలని రవి స్కెచ్ వేశాడు. సాయంత్రం పిల్లలను పిలుచుని పానీపూరి తినడానిి అందరూ బయటకు వెళ్లారు. పానీపూరీ తినిన తరువాత రవి అతని భార్య యోగితా, ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇంటికి వెళ్లాడు.

    భార్యను చంపేసి ఎస్కేప్

    భార్యను చంపేసి ఎస్కేప్

    రాత్రి యోగితా, రవి దంపతుల మద్య అక్రమ సంబంధం విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో రెచ్చిపోయిన రవి కన్నబిడ్దల ముందే అతని భార్య యోగితా గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని రవి ఇద్దరు పిల్లలను బెదిరించాడు. భయపడిపోయిన పిల్లలు బయటకు పరుగు తీసి పక్కింటిలో నివాసం ఉంటున్న బంధువులకు చెప్పారు.

    భర్త కోసం వెతుకుతున్న భార్య ఫ్యామిలీ

    భర్త కోసం వెతుకుతున్న భార్య ఫ్యామిలీ

    బంధువులు వెళ్లి చూసే సమయానికే యోగితా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్రమ సంబంధం విషయంలో భార్యను చంపేసి ఎస్కేప్ అయిన రవి కోసం గాలిస్తున్నామని మండ్య జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. భర్త రవి అక్రమ సంబంధం కారణంగా అతని చేతిలోనే హత్యకు గురైన యోగితా కుటుంబ సభ్యులు అతను కనపడితే బుద్దిచెప్పాలని అతని కోసం గాలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+