Illegal affair: ఇడ్లీ స్కెచ్ తో భర్తను చంపేసిన లేడీ టీచర్, ప్రియుడితో గంటలు గంటలు ?, ఫినిష్ !
బెంగళూరు: వివాహం జరిగి మూడు సంవత్సరాలు కాకుండా భార్య ఆమె భర్తను చాలా సింపుల్ గా ఇడ్లీల స్కెచ్ తో చంపేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది. వివాహం చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని అనుకున్న పెద్దల ఆశలు అడియాశలు అయ్యాయి. అక్రమ సంబంధం కారణంగా భార్య ఆమె భర్తను నిర్లక్షం చెయ్యడమే కాకుండా గంటలు గంటలు మొబైల్ ఫోన్ లో ప్రియుడితో మాట్లాడింది. విషయం గుర్తించిన అత్త మందలించడంతో కోడలు అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. టీచర్ గా ఉద్యగం చేస్తున్న భార్యను పిలుచుకురావడానికి వెళ్లిన భర్త ఆమె ఇంట్లో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైనాడు. విషయం తెలుసుకున్న అతని తల్లి, సోదరుడు ఆసుపత్రికి వెళ్లినా అతనితో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. రెండు రోజులకు భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన భార్య ఆమె పుట్టింటి దగ్గరే అంత్యక్రియలు జరిపించేసి చేతులు దులుపుకుంది. వయసు మీదపడిన తల్లి తన కొడుకును చంపేశారని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కోర్టు జోక్యంతో భర్త హత్య కేసులో అతని భార్య మీద కేసు నమోదు అయ్యింది. ఇడ్లీలో విషం కలిపి భర్తను చాలా సింపుల్ గా చంపేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

లేడీ టీచర్
ఐటీ హబ్ బెంగళూరులోని జేపీనగర్ ఫస్ట్ ఫేస్ లో వినోదమ్మ (65) అనే మహిళ నివాసం ఉంటున్నారు. వినోదమ్మకు మనోహర్ (33), మదుసూధన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోసకోటేలో నివాసం ఉంటున్న కీర్తి (27) అనే లేడీ టీచర్ తో మనోహర్ వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకున్నారు.

గ్రాండ్ గా పెళ్లి జరిగినా ?
2019 ఏప్రిల్ నెలలో మనోహర్, కీర్తి వివాహం గ్రాండ్ గా చేశారు. మనోహర్, కీర్తి దంపతులు జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కుుటంబ సభ్యులు, బంధువులు దీవించారు. అయితే వివాహం జరిగిన ఆరు నెలలకే మనోహర్, కీర్తి దంపతుల మద్య తేడా వచ్చింది. అత్తారింటికి వెళ్లిన కీర్తి భర్త మనోహర్, అత్త వినోదమ్మను నిర్లం చేస్తూ ఆమె పాటికి ఆమె గడపడం మొదలుపెట్టింది.

భర్త బయటకు వెళితే భార్య ప్రియుడికి ఫోన్ చేసి ?
హోస్ కోటేలో కీర్తి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. జేపీ నగర్ ఇంటికి వెళ్లిన తరువాత కీర్తి భర్త మనోహర్ తోపాటు అతని కుటుంబ సభ్యులను ఏమాత్రం పట్టించుకోవడం మానేసింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత కీర్తి మొబైల్ ఫోన్ లో ఓ వ్యక్తికి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడటం మొదలుపెట్టింది. ఒక్కసారి ఫోన్ చేస్తే కనీసం రెండు గంటలు మూడు గంటల సేపు మాట్లాడేదని సమాచారం.

అత్తను కూడా లెక్క చెయ్యని కోడలు
కీర్తి ఎక్కువ సేపు ఫోన్ లో మాట్లాడుతుండటంతో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ కీర్తిని ఆమె అత్త వినోదమ్మ ప్రశ్నించింది. నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు ?, నీకు చెప్పి నేను ఎవరికైనా ఫోన్ చెయ్యాలా ? అంటూ కీర్తి ఆమె అత్త వినోదమ్మకు ఎదురుతిరిగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలు పెట్టింది.

తగులుకున్న అత్తా కోడలు
నీ భార్య కీర్తి పద్దతి ఏమీ బాగాలేదని, ఆమె ఎవరో మగాళ్లతో గంటలు గంటలు అసభ్యంగా మాట్లాడుతోందని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని వినోదమ్మ ఆమె కొడుకు మనోహర్ కు చెప్పింది. నా గురించి నా భర్తకు నువ్వు పర్సనల్ విషయాలు చెబుతావా ? అంటూ కీర్తి ఆమె అత్త వినోదమ్మ మీద గొడవపడటం మొదలు పెట్టింది. అత్తా కోడులు వినోదమ్మ, కీర్తిల మద్య తారాస్థాయిలో గొడవలు మొదలైనాయి.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
ఇంట్లో గొడవలు ఎక్కువ కావడంతో కీర్తి గొడవపడి ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో హోస్ కోటేలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తన భార్య కీర్తి పుట్టింటిలో ఉంటే అన్ని సర్దుకుంటాయని అనుకున్న మనోమర్ అతని భార్యను అక్కడే ఉండాలని చెప్పాడు. భార్య కీర్తిని కలవడానికి మనోహర్ అప్పుడప్పుడు హోసకోటేకి వెళ్లి వస్తున్నాడు.

అత్తారింటిలో ఇడ్లీలు తిని ఆసుపత్రిపాలైన భర్త
ఇదే సంవత్సరం మే 8వ తేదీన మనోహర్ బెంగళూరు నుంచి హోస్ కోటేలోని భార్య కీర్తి పుట్టింటికి వెళ్లాడు. మరుసటి రోజు మనోహర్ అతని తల్లికి ఫోన్ చేసి కీర్తి ఇంట్లో ఇడ్లీలు తిన్నానని, తరువాత వాంతులు ఎక్కువ అయ్యాయని, ఆసుపత్రికి వెలుతున్నానని చెప్పాడు.
తరువాత కీర్తి ఆమె అత్త వినోదమ్మకు ఫోన్ చేసి నీ కొడుకు మనోహర్ కు అనారోగ్యంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని చెప్పింది. హడలిపోయిన వినోదమ్మ ఆమె మరో కొడుకు మదుసూదన్ ను పిలుచుకుని బెంగళూరు నుంచి హోసకోటేకి వెళ్లింది.

కరోనా వచ్చిందని డ్రామాలు ఆడిన భార్య
మనోహర్ కు కరోనా సోకిందని, అందుకే ఆసుపత్రిలో చేర్పించామని కీర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వినోదమ్మకు చెప్పారు. ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న మనోహర్ ను చూడటానికి అతని కుటుంబ సభ్యులకు అవకాశం లేకుండా పోయింది. మే 12వ తేదీన మనోహర్ కు కోవిడ్ పాజిటివ్ అని కీర్తి కుటుంబ సభ్యులు అతని తల్లి వినోదమ్మకు చెప్పారు.

ఊర్లోనే అంత్యక్రియలు చేసేసిన భార్య
కోవిడ్ పాజిటివ్ అని చెప్పిన మరుసటి రోజు (మే 13వ తేదీ) మనోహర్ చనిపోయాడని అతని తల్లి వినోదమ్మకు సమాచారం ఇచ్చారు. బెంగళూరుకు శవాన్ని కూడా తరలించకుండా కీర్తి సమీప బంధువు కిషోర్, అతని స్నేహితుడు మహేష్ కలిసి హోసకోటేలోనే మనోహర్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇడ్లీలు తిన్నతరువాత తన శరీరంలో మార్పులు వచ్చాయని, వాంతులు అయ్యాయని మనోహర్ ఆ రోజు చెప్పడని, ఇడ్లీలో విషం కలిపి నా కొడుకును చంపేశారని వినోదమ్మ ఆరోపించింది. నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ కీర్తి కుటుంబ సభ్యులు వినోదమ్మను దూషించారు.

ఇడ్లీలో విషయం పెట్టి భర్తను చంపేసిన భార్య మీద కేసు నమోదు
అప్పటి నుంచి తన కొడుకు మనోహర్ ను విషప్రయోగంతో హత్య చేశారని, తన కోడలు కీర్తి మీద చర్యలు తీసుకోవాలని వినోదమ్మ పోలీసుల చుట్టూ తిరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చెయ్యలేదు, చివరికి వినోదమ్మ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఇప్పుడు భర్త మనోహర్ ను హత్య చేసిందని కీర్తి మీద కేసు నమోదు అయ్యింది. భర్త మనోహర్ కు ఇడ్లీల్లో విషం పెట్టి కీర్తి చంపేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications