Illegal affair: లవ్ మ్యారేజ్, భార్యకు పిస్తా ప్రియుడు, పక్కాప్లాన్ తో భర్త హత్య, సెల్ఫీ ఫోటోతో !
బెంగళూరు/ కేజీఎఫ్/ కోలారు: కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు జీవితాంతం కలిసి జీవించాలని అనుకున్నాడు. తల్లిని ఎదిరించిన యువకుడు ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రేమించిన యువకుడితో కాపురం చేసిన యువతి తరువాత అడ్డదారిలో నడిచింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కళ్లు కప్పి వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకునింది. అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు కొన్ని నెలలు కాకముందే కొత్తగా ప్రియుడు పుట్టుకొచ్చాడని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. తన రంకుపురాణం బయట పడిందని, తన భర్తకు ముందే కోపం ఎక్కువని, తనను చంపినా చంపేస్తాడని భార్య బయపడిపోయింది.
ఎలాగైనా తన భర్తను చంపేసి అతని ఆస్తి కొట్టేసి ప్రియుడితో సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయ్యింది. ప్రియుడితో కలిసి పక్కాప్లాన్ తో భర్తను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. కొడుకు ఆత్మహత్య చేసుకోలేదని, అతనిని హత్య చేశారని యువకుడి తల్లి కేసు పెట్టింది. కొంతకాలం తరువాత భర్త చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా అతని భార్య ప్రియుడితో కలిసి సెల్ఫీ తీసుకుని ఆఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒక్క ఫోటో ఆధారంగా యువకుడి తల్లి ఐదు సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగి తన కొడుకును హత్య చేయించిన కోడలు, ఆమె ప్రియుడికి సరైన శిక్ష పడేలా చేసింది.

లవ్ మ్యారేజ్
కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ లో వాసగి (60) అనే మహిళ నివాసం ఉంటున్నది. వాసగికి సోమనాథ్ అనే కొడుకు ఉన్నాడు. సోమనాథ్ కంటే పెద్ద కొడుకు ఉన్న వాసగి ఇద్దరు కొడుకులతో కలిసి సంతోషంగా జీవించేసింది. సంతోష్ అశ్వినీ అనే యువతిని ప్రేమించాడు. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న సోమనాథ్, అశ్వినీ జీవితాంతం కలిసి జీవించాలని అనుకున్నారు. తల్లి వాసగిని ఎదిరించిన సోమనాథ్ అతను ప్రేమించిన అశ్వినీని 2016 మార్చి నెలలో కేజీఎఫ్ లో వివాహం చేసుకున్నాడు.

కిలాడి పేరుకు లవ్ మ్యారేజ్ చేసుకుంది అంతే
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సోమనాథ్ కళ్లు కప్పిన అశ్వినీ మరో యువకుడు సంతోష్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త సోమనాథ్ కళ్లు కప్పిన అశ్వినీ ఆమె ప్రియుడు సంతోష్ తో కలిసి ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. అశ్వినీ, సంతోష్ అక్రమ సంబంధం విషయం చాలా కాలం భర్త సోమనాథ్ దగ్గర దాచిపెట్టలేకపోయారు. అసలే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అశ్వినీకి కొత్తగా సంతోష్ అనే ప్రియుడు పుట్టుకొచ్చాడని తెలుసుకున్న భర్త సోమనాథ్ రగిలిపోయాడు.

ప్రియడుని అన్నగా పరిచయం చేసింది
నువ్వు సంతోష్ అనే యువకుడితో ఎందుకు తిరుగుతున్నావు అని భర్త సోమనాథ్ అతని భార్య అశ్వినీని ప్రశ్నించాడు. సంతోష్ తన బంధువు అని, అతను తనకు సోదరుడు అవుతాడని కొంతకాలం అశ్వినీ ఆమె భర్త సోమనాథ్ ను నమ్మించడానికి ప్రయత్నించింది. అన్నా చెల్లి ఎలాగుంటారు, నువ్వు చూస్తే సంతోష్ తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు, అసలు ఏం జరుగుతోందని సోమనాథ్ అతని భార్య అశ్వినీని నిలదీయడం మొదలుపెట్టాడు.

భార్యను బెండ్ తీసిన భర్త
రానురాను సంతోష్, అశ్వినీ యవ్వారం ముదిరిపోయింది. తన భార్య అశ్వినీ చెడుమార్గంలో వెలుతోందని తెలుసుకున్న సోమనాథ్ అతని భార్యను పట్టుకుని చితకబాదడం మొదలు పెట్టాడు. తన రంకుపురాణం బయట పడిందని, తన భర్త సోమనాథ్ కు ముందే కోపం ఎక్కువని, తనను చంపినా చంపేస్తాడని అతని భార్య అశ్వినీ బయపడిపోయింది.

భర్త ఆస్తి కొట్టేసి ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్
ఎలాగైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త సోమనాథ్ ను చంపేసి అతని ఆస్తి కొట్టేసి ప్రియుడు సంతోష్ తో సెటిల్ అయిపోవాలని అశ్వినీ డిసైడ్ అయ్యింది. సోమనాథ్ ను హత్య చెయ్యాలని అశ్వినీ ఆమె ప్రియుడు సంతోష్ కు చెప్పింది. ఇద్దరూ కలిసి సోమనాథ్ ను హత్య చెయ్యాలని పక్కా ప్లాన్ చేశారు.

ఆత్మహత్య చేసుకున్నాడని డ్రామా
ప్రియుడు సంతోష్ తో కలిసి పక్కాప్లాన్ తో భర్త సోమనాథ్ ను చంపేసిన అశ్వినీ తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించింది. అప్పట్లో సోమనాథ్ అంత్యక్రియలు కూడా పూర్తి చేసేశారు. తన కొడుకు సోమనాథ్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిని హత్య చేశారని యువకుడి తల్లి వాసగి మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. చివరికి వాసగి కోడలు అశ్వినీ మీద కేజీఎఫ్ లో పోలీసు కేసు పెట్టింది.

సెల్ఫీ తీసి షేర్ చేసిన కిలాడి పెళ్లామ్
పోలీసులు సోమానథ్ ఎలా చనిపోయాడు అని విచారణ చేస్తున్న సమయంలో అతని భార్య అశ్వినీ ఓ చిన్నపొరపాటు చేసింది. కొంతకాలం తరువాత భర్త సోమనాథ్ చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా అతని భార్య అశ్వినీ ఆమె ప్రియుడు సంతోష్ కలిసి సెల్ఫీలు తీసుకుని ఆఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒక్క ఫోటో ఆధారంగా సోమనాథ్ తల్లి వాసగి మళ్లీ కేజీఎఫ్ పోలీసులను ఆశ్రయించింది.

రంకులాడి స్టోరీ ఖేల్ కథం
సెల్ఫీ ఫోటో ఆధారంగా కేజీఎఫ్ పోలీసులు అశ్వినీ, సంతోష్ ను అరెస్టు చేశారు. అశ్వినీ ఆమె ప్రియుడు సంతోష్ కలిసి సోమనాథ్ ను హత్య చేశారని పోలీసులు ఆధారాలు సేకరించారు. ఐదు సంవత్సరాల నుంచి కేసు విచారణ జరిగింది. ప్రియుడు సంతోష్ మోజులో అశ్వినీ ఆమె భర్త సోమనాథ ను చంపేసిందని కోర్టులో నేరం రుజువు అయ్యింది. సోమనాథ్ హత్య కేసులో అతని భార్య అశ్వినీ, ఆమె ప్రియుడు సంతోష్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరిని రూ. 25, 000 జరిమానా విధించింది.

చేసిన పాపం ఊరికే పోతుందా ?
60 సంవత్సరాల వయసులో కొడుకును హత్య చేసిన కోడలు, ఆమె ప్రియుడికి కఠిన శిక్షపడేలా చేసిన సోమనాథ్ తల్లి వాసగి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంత కాలానికి తన కొడుకు సోమనాథ్ ఆత్మశాంతించిందని అతని తల్లి వాసగి అంటున్నారు. మొత్తం మీద లవ్ మ్యారేజ్ చేసుకుని మరో ప్రియుడు సంతోష్ మోజులో భర్త సోమనాథ్ ను హత్య చేయించిన అశ్వినీ ఇప్పుడు జైలుపాలు కావడంతో కేజీఎఫ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications