Terrorist: ఐసీస్ తో లింక్, బాంబు పేలుళ్ల ట్రయల్స్, మాజీ సీఎం ఇలాకాలో ?, అరటి కాయల వ్యాపారికి తోలు!
బెంగళూరు: ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుని గుట్టచప్పుడు కాకుండా వాళ్లపని వాళ్లు చేసుకుంటున్నట్లు నటిస్తున్న వారికి అధికారులు సినిమా చూపిస్తున్నారు. నిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో లింక్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఇప్పటికే కొందరిని అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో తుంగా నది సమీపంలో బాంబులు పేల్చి ట్రయల్ నిర్వహించిన యువకులతో టచ్ లో ఉన్న ఓ వ్యాపారిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఐసీస్ తో లింక్
నిషేధిత ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్)తో లింక్ పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఇటీవల కర్ణాటలోని శివమొగ్గలో సయ్యద్ యాసిన్, మునీర్ అహమ్మద్ అనే యువకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న సయ్యద్ యాసిన్, మునీర్ అహమ్మద్ గుట్టుచప్పుకుడా కాకుండా విదేశాలకు వెళ్లి ఉగ్రవాదులను నేరుగా కలిశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

తుంగా నది తీరంలో బాంబు పేలుళ్ల ట్రయల్
సయ్యద్ యాసిన్, మునీర్ అహమ్మద్ తదితరులు శివమొగ్గ నగరం సమీపంలోని తుంగా నది తీరంలో బాంబు పేలుళ్ల ట్రయల్ నిర్వహించారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని శివమొగ్గ జిల్లా ఎస్పీ డాక్టర్ బిఎం, లక్ష్మీనారాయణ అంటున్నారు. సయ్యద్ యాసిన్, మునీర్ అహమ్మద్ తో సంబంధాలు పెట్టుకున్న వారి మీద నిఘా వేశామని శివమొగ్గ జిల్లా ఎస్పీ డాక్టర్ బిఎం, లక్ష్మీనారాయణ మీడియాకు చెప్పారు.

అరటికాయల వ్యాపారికి సీన్ సితారా
తుంగా నది తీరంలో బాంబు పేలుళ్ల ట్రయల్ నిర్వహించిన సయ్యద్ యాసిన్, మునీర్ అహమ్మద్ తో నిత్యం టచ్ లో ఉన్న గంగావతిలోని మైబూబ్ నగర నివాసి, అరటి కాయల మండి వ్యాపారి షబ్బీర్ అనే యువకుడిని సోమవారం వేకువ జామున పోలీసులు అరెస్టు చేశారు. షబ్బీర్ ను అరెస్టు చేసిన పోలీసు అధికారులు అతన్ని శివమొగ్గ తీసుకెళ్లారని తెలిసింది.

ఉగ్రవాదులతో లింక్?
తుంగా నది తీరంలో బాంబు పేలుళ్లు నిర్వహించిన వారితో పాటు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో అరటి కాయల వ్యాపారి షబ్బీర్ లింక్ పెట్టుకున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. అయితే గంగావతితో తాము ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని శివమొగ్గ పోలీసులు అంటున్నారు. షబ్బీర్ ను అరెస్టు చేసినట్లు అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications