IT Hub: జైలు నుంచి వచ్చినా వీడి కొవ్వు తగ్గలేదు, అర్దరాత్రి ఏం చేశాడంటే ?, దెబ్బకు మైండ్ బ్లాక్ !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో నేరాలు అరికట్టాలని పోలీసు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాపకింద నీరులా నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నేరాలు అరికట్టాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొన్ని ఏరియాల్లో పోలీసులు ఇన్ ఫార్మర్లను పెట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయితో పాటు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి గురించి పోలీసు అధికారులు వారి ఇన్ ఫార్మర్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. ఇన్ ఫార్మర్ ద్వారా బెంగళూరులోని రాజగోపాల నగర పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నఅయూబ్, అతని అనుచరులు జైలుకు వెళ్లారు.

అయూబ్ అతని అనుచరులతో కలిసి గంజాయి విక్రయించాడు. పక్కా సమాచారం అందడంతో పోలీసులు అయూబ్ అతని అనుచరులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.కొంతకాలం పాటు అయూబ్ అతని అనుచరులు జైలు శిక్ష అనుభవించారు. తరువాత అయూబ్ అతని అనుచరులు బెయిల్ మీద బయటకు వచ్చారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అయూబ్ రగలిపోయాడు. తనతో పాటు తన అనుచరులను జైలుకు పంపించిన వారిని చంపేస్తాను అంటూ అయూబ్ వేటకొడవలి చేతిలో పెట్టుకుని రోడ్డు మీద హంగామా చేశాడు. ప్రతిరోజు అయూబ్ రోడ్డు మీద వేటకొడవళ్లతో హంగామా చేస్తున్న అయూబ్ అతని అనుచరులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications